విశాఖ జైల్లో ఖైదీలకు జ్ఞాన సాగరం

విూకు స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ సినిమా గుర్తు ఉంది కదా. అందులో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక పక్క జైలు శిక్ష అనుభవిస్తూనే మరోప్రక్క లా చదువుతాడు. ఇప్పుడు విశాఖ సెంట్రల్‌ జైలులో అలా శిక్ష అనుభవిస్తూనే చదువుకుంటున్న వారిసంఖ్య పెరుగుతోంది. ఇందులో కో ఇన్సిడెంట్‌ ఏంటంటే స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ సినిమాలో జూనియర్‌ చదివేది కూడా విశాఖ జైలులోనే కావడం. ఆవేశంలో నేరాలకు పాల్పడి జైలు పాలయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటివారిలో తమ జీవితం ఇక జైలుపాలే అనుకోకుండా చదువుకుని రిలీజ్‌ అయ్యాక మెరుగైన జీవితం గడపాలనుకునే వారు చదువుపై దృష్టిపెడుతున్నారు. జైలు అధికారులు కూడా వారికి చదువుకునే అవకాశం కల్పించడంతో పాటు దానికి తగ్గ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. దానితో ఒక పక్క జైలులో రకరకాల పనులు చేసుకుంటూనే మరోపక్క చదువుకునే వారు ఎక్కువ అవుతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. వారిలో 10బిష్ట్ర క్లాస్‌ నుంచి డిగ్రీ ,పీజీల వరకూ చదువుతున్న వారున్నారు. ఈ అకాడమిక్‌ ఇయర్‌ పరీక్షలు రాసినవారు 23 మంది ఉన్నారు. వీరు కాకుండా కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకున్నవారు మరో 50 మంది వరకూ ఉన్నారు. గతంలో అంటే 2019`20లో 29 మంది, 2020`21లో 32 మంది , 2021`22 లో 17 మంది విశాఖ జైలు నుంచి తమ తమ చదువులు పూర్తి చేశారు. 2010లో అయితే లైఫ్‌ ఇంప్రెజన్మెంట్‌ శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ పీజీలో గోల్డ్‌ మెడల్‌ సాధించి సంచలనం సృష్టించాడు . ఈ జైలులో శిక్షలు పడినవారు, రిమాండ్‌ లో ఉన్నవారు తమ చదువు పాడు కాకుండా కొనసాగించే అవకాశం ఉంది. వారే కాదు అస్సలు చదువులేని వారు కూడా జైల్లో ఉంటారు. అలాంటి వారికోసం అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ కింద చదువు చెబుతున్నారు. వారు నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌ ద్వారా 10బిష్ట్ర క్లాస్‌ వరకూ చదువుకుంటున్నారు. డిగ్రీ ,పీజీలు చదివేవారికి క్లాసులు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా జైలు రిక్రూట్మెంట్‌ లో భాగంగా అపాయింట్‌ అయిన టీచర్‌ ఒకరు ఉంటారు. ఉదయం 8 నుంచి 11 వరకూ , మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకూ ఖైదీలకు క్లాసులు ఉంటాయి. ఎగ్జామ్స్‌ టైంలో ఏయూ నుంచి వచ్చిన ప్రతినిధులే ఇన్విజిలేషన్‌ చేస్తారు. అలాగే కొన్ని కార్పొరేట్‌ సంస్థల ఆధ్వర్యంలో టెక్నికల్‌, కంప్యూటర్‌ ట్రైనింగ్‌ లు అందిస్తారు. ఇక ఈ జైలులో ఖైదీల కోసం ‘‘జ్ఞాన సాగరం ‘‘ పేరుతో ప్రత్యేక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. ఏదేమైనా విశాఖ జైలులోని ఖైదీలకు చదువు పట్ల ఆసక్తి కలిగించడం లో అధికారులు తీసుకుంటున్న చర్యలు సక్సెస్‌ కావడంతో అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *