సినిమానే ప్రేమిస్తూ.. సినిమానే ఆస్వాదిస్తూ..!

పి.సత్యానంద్‌ (P Satyanand) టాలీవుడ్‌కి పరిచయం అవసరంలేని రచయిత. ఆదుర్తి సుబ్బారావు మేనల్లుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆయన సూపర్‌స్టార్‌ కృష్ణ (Krishna) నటించిన ‘మాయదారి మల్లిగాడు’ చిత్రంతో రచయితగా కెరీర్‌ ప్రారంభించారు. ఎన్టీఆర్‌, కృష్ణ, శోభనబాబు, చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున, పవన్ కళ్యాణ్ కల్యాణ్‌, మహేష్‌బాబు ఇలా అగ్ర హీరోల చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూధనరావు, కె రాఘవేంద్రరావు వంటి దర్శకుల నుంచి ఈతరం దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల వరకూ ఆయన కలిసి పని చేశారు.

దాదాపు 400లకుపైగా చిత్రాలకు రచయితగా విజయంవంతమైన జర్నీని కొనసాగించారు. ఈ ఏడాదికి టాలీవుడ్‌లో ఆయన ప్రస్థానానికి 50 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా చిరంజీవి సత్యానంద్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ ఓ పోస్ట్‌ చేశారు.

ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్ర్కిప్ట్‌ సమకూర్చి, పదునైన డైలాగ్స్‌ రాసి, మరెన్నో చిత్రాలకు స్ర్కిప్ట్‌ డాక్టర్‌గా ఉంటూ, ఎంతో మంది నేటి రచయితలకు, దర్శకులకు , నటులకు ఒక మెంటోర్‌ గా, ఒక గైడింగ్‌ ఫోర్స్‌గా, గొప్ప సపోర్ట్‌ సిస్టమ్‌గా ఉంటూ, సినిమాని ప్రేమిస్తూ, సినిమానే ఆస్వాదిస్తూ, సినిమాని జీవన విధానం గా మలచుకున్న నిత్య సినీ విద్యార్థి, తరతరాల సినీ ప్రముఖులందరికీ ప్రియ మిత్రులు.. నాకు అత్యంత ఆప్తులు, మృదు భాషి , సౌమ్యులు సత్యానంద్‌ గారు తన సినీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు.

ఆయనతో నా వ్యక్తిగత అనుబంధం ఇప్పటిది కాదు. నా అనేక చిత్రాలలో ఆయన వహించిన పాత్ర ఎంతో ప్రగాఢమైనది. డియర్ సత్యానంద్ గారు.. మీరిలాగే మీ సినీ పరిజ్ఞానాన్ని, సినీ ప్రేమని, అందరికీ పంచుతూ, మరెన్నో చిత్రాల విజయాలకు సంధానకర్తగా, మరో అర్థ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీ తో ఉండాలని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *