హమ్మయ్యా! అని రిలాక్స్‌ అవుతున్న చైనా! కేసులు నిల్‌

Zero Covid Cases: చైనాలో కరోనా మహమ్మారి ఫోర్త్‌వేవ్‌ విరుచుకుపడింది. గత కొన్ని నెలలుగా అనుహ్యంగా పెరుగుతున్న కేసులు చూసి తలలు పట్టుకున్నారు చైనా అధికారులు. అందులోనూ కరోనా పుట్టినిల్లు అయిన చైనా ఆది నుంచి జీరో కోవిడ్‌ విధానం అంటూ ప్రగల్పాలు పలికి నిలబెట్టుకోనేందుకు నానాతంటాలు పడింది. కఠినమైన ఆంక్షలతో ప్రజలను నిర్బంధించి తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత తోపాటు ప్రపంచ దేశాల విమర్శలను ఎదుర్కొంది. ఏదీ ఏమైనా జీరో కోవిడ్‌ పాలసీని వదిలేదే లేదంటూ… ఆంక్షలు విధించి తన పంతం నెగ్గించుకుంది.

ఒక్కపక్క దేశ ఆర్థికస్థితి ప్రమాదకరంలో ఉన్నా సరే అధికంగా డబ్బు ఖర్చుపెట్టి మరీ సామూహిక కరోనా పరీక్షలు నిర్వహించింది. గత ఏప్రిల్ నుంచి కేసులు తగ్గినట్లు తగ్గి అనుహ్యంగా కొన్ని నగరాల్లో వేగంగా పుంజుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. షాంఘై, బీజింగ్‌ వంటి పారిశ్రామిక నగరాల్లోనే కేసులు పెరగడంతో ఒకనోక దశలో ఏవిధంగా నియత్రించాలో తెలియక చేతులెత్తేసే స్థితికి చేరుకుంది. ప్రజలు కూడా వరుస లాక్‌డౌన్‌లతో విసిగిపోయి తీవ్ర అసహనస్థితికి లోనయ్యారు.

అయినా చైనా వీటన్నింటిని లెక్క చేయకుండా ప్రజా ఆరోగ్య ప్రయోజాల కోసం జోరో కోవిడ్‌ పాలసీనే అవలంభిస్తానంటూ పట్టుపట్టి మరీ మరిన్ని ఆంక్షలను విధించింది. ఎట్టకేలకు విజయాన్ని సాధించింది చైనా. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు జీరో అని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో చైనా ప్రస్తుతం కొన్ని ఆంక్షలను సడలించింది. గానీ బహిరంగ ప్రదేశాల్లో తిరగాలంటే మాత్రం… ఆరోగ్య స్థితిని ట్రాక్ చేసే మొబైల్ యాప్‌లో గ్రీన్ కోడ్‌ను చూపించాలి. ప్రతి మూడు రోజులోకోసారి కరోనా పరీక్షలు తప్పనసరి అని, పైగా మూడు సంవత్సరాలకు పైబడిన పిల్లలు సైతం పరీక్షలు చేయించుకోవాల్సిందేనని చైనా నొక్కి చెప్పింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *