తెలంగాణ ఉద్యమ కారుడు ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్!

కాళోజీ నారాయణరావు (KalojiNarayanaRao) లేదా కాళోజీ (Kaoji) అంటే తెలియని తెలుగు వాడు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు వుండరు. అతను తెలంగాణా ఉద్యమానికి ప్రతినిధిగా చెపుతారు. అదొక్కటే కాదు, అన్యాయం ఎక్కడుంటే అక్కడ ఉండి ప్రశ్నిస్తాడు, హక్కుల కోసం పోరాటం సలిపిన యోధుడు, ఉద్యమాలు నడిపిన ప్రజావాది. ఒకటేమిటి మొత్తంగా చెప్పాలంటే అతను ప్రజల మనిషి. అప్పట్లో నైజాం ప్రభుత్వానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా తన కలం ఎత్తాడు. అతని పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 9 న తెలంగాణ తెలంగాణ భాషా దినోత్సవంగా చేశారు అంటే అతని గురించి ఇక్కడ చెప్పింది చాలా తక్కువే

అటువంటి తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణ రావు జీవితాన్ని వెండితెరపై చూపించాలని దర్శకుడు ప్రభాకర్ జైనీ (PrabhakarJaini) నిర్ణయించారు. అతను ఇంతకుముందు ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రణయ వీధుల్లో’, ‘అమ్మా! నీకు వందనం!’ లాంటి సినిమాలు తీసి, ప్రస్తుతం స్వాతి వారపత్రిక అధినేత వేమూరి బలరామ్ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే కాళోజీ నారాయణరావు మీద చేసిన బయోపిక్ కి ‘ప్రజాకవి కాళోజీ’ #PrajakaviKaloji అని టైటిల్ పెట్టారు, చిత్రీకరణ కూడా పూర్తి చేశారు.

కాళోజీగా ఎవరెవరినో అనుకోని చివరికి మూలవిరాట్ (Moolavirat) అనే నటుడిని పట్టుకొచ్చారు ప్రభాకర్. మూలవిరాట్ అచ్చం కాళోజీలాగే కనపడుతూ ఉండటం ఆసక్తికరం. కాళోజీ నారాయణరావు భార్యగా పద్మ, కొడుకుగా రాజ్ కుమార్, కోడలుగా స్వప్న నటించారు. సెప్టెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్వాహకులు చెప్పారు.

ఈ సినిమా చిత్రీకరణ జరిగేటప్పుడు ఇందులో కాళోజీ పాత్ర చేస్తున్న మూలవిరాట్ ను చూసి నిజంగా కాళోజీ గారే కెమెరా ముందుకు వాచినట్టు ఉందని చెప్పారు. ఎందుకంటే పోలికలు అంతలా సరిపోయాయి. కాళోజీ గారి కుటుంబ సభ్యులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు దర్శకుడు. చిత్రీకరణ కూడా కాళోజీ గారు జీవించిన, ఆయన ఎక్కడెక్కడ తిరిగారో, ఆయా ప్రదేశాలకి వెళ్లి చిత్రీకరణ చేసినట్టుగా చెప్పారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు, అలాగే విశాఖపట్నంలో (Visakhapatnam) కూడా ఒక సన్నివేశం చిత్రీకరించాం. శ్రీ శ్రీ (SriSri), కాళోజీ, రామేశ్వరరావు కలిసి ఉన్న దృశ్యాలు, విశాఖలో కృష్ణబాయమ్మ గారి ఇంట్లో కాళోజీ ఉన్న దృశ్యాలు అద్భుతంగా వచ్చాయి. అమృతలత గారి ఇంటిలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. ఆయన నివసించిన ఇంట్లోనే సన్నివేశాలు తీశాం. కాళోజీ గారు వాడిన కళ్ళజోడు, చేతి కర్రను ఆయన కుటుంబ సభ్యుల అనుమతితో ఉపయోగించాం.కాళోజీకి రెండు రాష్ట్రాల్లో అనేక మంది మిత్రులు ఉన్నారు. వారి జీవిత చరిత్ర చదువుతుంటే, అలాగే వారి సన్నిహిత మిత్రులు నుంచి వింటుంటే, పది సినిమాలకు సరిపడే కంటెంట్ లభించింది. దానిని ఒక సినిమా పరిధిలోకి కుదించడం అసాధ్యం, అందుకే, కాళోజీ ఔన్నత్యాన్ని, కాళోజీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని సన్నివేశాలను మాత్రమే ఉదాహరణగా తీసుకుని, వారి జీవితం స్ఫూర్తి పొంది, కథ రాసుకున్నాను అని చెప్పారు ప్రభాకర్ జైనీ. ఈ చిత్రంలో నాలుగు పాటల్లో ఒకటి ఎమ్మెల్యే గోరటి వెంకన్న, రెండు వందేమాతరం శ్రీనివాస్, ఒకటి మాళవిక, భూదేవి పాడారు. ఈ పాటలలో కాళోజీ కవితల సారాంశాన్ని పొందు పరిచాము అని చెప్పారు దర్శకుడు.

కాళోజీ గారితో చిరకాలంగా సన్నిహితంగా మెదిలిన పొట్లపల్లి శ్రీనివాసరావు, నాగిళ్ళ రామశాస్త్రి, విద్యార్థి, అంపశయ్య నవీన్, డాక్టర్ వీయస్ రెడ్డి, అన్వర్ తదితరులు ఈ సినిమాలో వారి పాత్రల్లో నటించారు. పీవీ నరసింహారావు పాత్రలో వారి సోదరుడు, పీవీ మనోహర్ రావు నటించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *