రేసు గుర్రాలపై పార్టీల ఫోకస్‌

హైదరాబాద్‌, జూన్‌ 29
బీఆర్‌ఎస్‌ లో అసంతృప్తిగా ఉన్న నేతలు గొంతెత్తున్నారు. పొంగులేటి, జూపల్లి వంటి నేతలు బయటికి వెళ్లగా? మరో కీలక నేత అధినేతకు అల్టిమేటం ఇచ్చారు. ఈసారి టికెట్‌ ఇవ్వకపోతే కారు దిగటం ఖాయమేనంటూ హింట్‌ ఇచ్చేశారు.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు రేసు గుర్రాలపై ఫోకస్‌ పెట్టాయి. ముందుగానే 70 నుంచి 80 మంది అభ్యర్థులను కూడా ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో…పలువురు నేతలు అలర్ట్‌ అవుతున్నారు. సీటుపై తేడా కొడితే చాలు…హైకమాండ్‌ కు హింట్‌ ఇచ్చేస్తున్నారు. ఇక అధికార బీఆర్‌ఎస్‌ లో చూస్తే…ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఇప్పటికే పొంగులేటి, జూపల్లితో పాటు పలువురు నేతలు కారు దిగగా… మరికొందరు కూడా అదే బాటలో వెళ్లేందుకు యోచిస్తున్నారు. ఈ క్రమంలో… రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు.మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ గా పని చేసిన తీగల కృష్ణారెడ్డి పార్టీ బీఆర్‌ఎస్‌ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు మహేశ్వరం టికెట్‌ ఇవ్వకుంటే కారు దిగటం ఖాయమే అని చెప్పుకొచ్చారు. కోడలు అనితారెడ్డి రంగారెడ్డి జెడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉండటంతో…. ఒకే ఇంట్లో రెండు పదవులు కుదరవన్నట్లు హైకమాండ్‌ మాట్లాడుతోందని కామెంట్స్‌ చేశారు. తిరిగి తాము కూడా విమర్శిస్తే బాగుండదని…. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితారెడ్డిని పార్టీలోకి తీసుకొని బీఆర్‌ఎస్‌ తప్పుచేసిందన్నారు. ఓ విూడియా ఛానెల్‌ తో మాట్లాడిన ఆయన? ఈ కామెంట్స్‌ చేశారు. అయితే కాంగ్రెస్‌ లో చేరుతారా అనేది దానిపై స్పందిస్తూ? ఎవరితోనూ సంప్రదింపులు చేయలేదని క్లారిటీ ఇచ్చారు.నిజానికి 2018 ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేశారు తీగల. 86వేలకు పైగా ఓట్లు సాధించగా? కాంగ్రెస్‌ తరపున బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే కొద్దిరోజులకే కాంగ్రెస్‌ ను వీడిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌ లో చేరారు. మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు. ఫలితంగా జిల్లా రాజకీయాల్లో యాక్టివ్‌ అయిపోయారు. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో అంతా తానై నడుస్తున్నారు. ఇది కాస్త?. తీగలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే నియోజకవర్గంలో తీగల వర్సెస్‌ సబితా ఇంద్రారెడ్డి మధ్య వర్గపోరు, ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. సందర్భాన్ని బట్టి?. తీగల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *