కూలర్లు… కూల్‌ డ్రిరక్స్‌ పెద్ద దెబ్బ

హైదరాబాద్‌రాష్ట్రంలో అకాల వర్షాల ఎఫెక్ట్‌? రైతులతో పాటు సమ్మర్‌ బిజినెస్‌ చేసుకునే చిరు వ్యాపారులపై కూడా పడిరది. మార్చి, ఏప్రిల్‌ నెలలు వచ్చాయంటేనే ఎండలు భగభగమనేవి. ఎండవేడి తట్టుకోలేక జనాలు కొబ్బరి బొండాలు, చెరుకు రసాలు, జ్యూస్‌లు ఎక్కువగా తాగేవారు. ఉడుకపోతను తట్టుకునేందుకు కూలర్లు, ఏసీలు కొనేందుకు క్యూ కట్టేవారు. ఈసారి మాత్రం సీజన్‌ అంతా తలకిందులైంది. టెంపరేచర్‌? పెరగాల్సిన మార్చి రెండో వారం నుంచే అకాల వర్షాలు మొదలయ్యాయి. వరుసపెట్టి దంచుతున్నాయి. ఉడుకపోత సమయాల్లోనూ చలికాలం లెక్క వాతావరణం వణికిస్తోంది. దీంతో సమ్మర్‌ సీజనల్‌ బిజినెస్‌ చేసుకునే వేలాది మంది చిరు వ్యాపారులు, వారిపై ఆధారపడ్డ సిబ్బంది రోడ్డునపడ్డట్లయింది. ప్రతీ రోజూ వానలు కొడుతుండడంతో వాతావరణం చల్లగా మారింది. రాష్ట్రంలో ఏటా వందల కోట్ల కూలర్ల బిజినెస్‌ నడవగా.. ఈసారి వ్యాపారులు తలలు పట్టుకున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ వెయ్యిస్తంభాల గుడి ఏరియాలో సమ్మర్‌? వచ్చిదంటే కూలర్‌ షాపులు హోల్‌సేల్‌, రిటైల్‌ కస్టమర్లతో కిటకిటలాడేవి. ఒక్కో షాపులో దాదాపు 40 నుంచి 50 మంది సిబ్బంది పనిచేసేవారు. ప్రతీరోజూ దాదాపు 100 నుంచి 120 వరకు కూలర్లు అమ్మేవారు. కూలర్లు ట్రాన్స్‌?పోర్ట్‌? చేయడానికే పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ఇక్కడ ఉపాధి పొందేవారు. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాంతంలోని షాపులన్నీ కుల్లాగా ఉంటున్నాయి. ఒక్కో షాపులో రోజుకు10 కూలర్లు కూడా అమ్ముడుపోవడంలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు లేక స్టాక్‌ అలానే ఉండిపోయింది. సిబ్బందికి జీతాలిచ్చే పరిస్థితుల్లేక ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఐదారుగురితో మేనేజ్‌ చేస్తున్నారు. సమ్మర్‌? వచ్చిందంటే చిరువ్యాపారాలు జోరుగా నడుస్తాయి. ఈ సీజన్‌?లో వాతావరణం చల్లగా ఉండడంతో చెరుకు రసం, జ్యూస్‌ సెంటర్లు, ఐస్‌క్రీం బండ్లు, కొబ్బరి బొండాల షాపులు వెలవెలపోతున్నాయి. అకాల వర్షాలు తమ ఉపాధిపై దెబ్బ కొట్టాయని వాపోతున్నారు. మే నెల.. రోహిణి కారై పైనే ఆశలు..మాములుగా ఫిబ్రవరి చివరి వారంలో ఎండలు మొదలై మార్చి రెండో వారం నుంచి సమ్మర్‌? బిజినెస్‌లు ఊపందుకుంటాయి. దీనికి అనుగుణంగానే వ్యాపారులు ప్లాన్‌ చేసుకుంటారు. కాగా, సరిగ్గా బిజినెస్‌ స్టార్ట్‌? అయ్యే మార్చిలోనే అకాల వర్షాలు మొదలు కావడంతో రెండు నెలల బిజినెస్‌ నష్టపోయారు. కోట్ల రూపాయల వ్యాపారం దెబ్బతింది. దీంతో వ్యాపారులంతా మే నెల, రోహిణి కార్తె బిజినెస్‌పై ఆశతో ఉన్నారు. కూలర్లకు గిరాకీ రావాలంటే మినిమం టెంపరేచర్‌ 40 దాటాలే. ఎండాకాలం వచ్చిందంటే ఇది కూడా దాటుతది. ఈసారి అనుకోని వానలతో టెంపరేచర్‌ 32లోపు ఉంటే జనాలు ఫ్యాన్‌ గాలి చాలనుకుంటున్నారు. దీంతో కొనుగోళ్లు తగ్గినయ్‌. గత సీజన్లతో పోలిస్తే ఈ ఏప్రిల్‌ నెల బిజినెస్‌ బాగా దెబ్బతింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *