గ్లోబల్‌ లీడర్‌ గా ప్రధాని

ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గ్లోబల్‌ లీడర్‌ అప్రూవల్‌ రేటింగ్‌లో అగ్రస్థానంలో కూర్చున్నారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్‌ సంస్థ ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ నిర్వహించిన సర్వే ప్రకారం ప్రధాని మోదీ 78 శాతం రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. ఈ సర్వేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో, బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌ 10వ స్థానంలో నిలిచారు.ఈ రేటింగ్‌లో 100 శాతం మందిలో 4 శాతం మంది ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. 78 శాతం మంది ప్రజలు మాత్రం తమ మొదటి ఎంపికగా ప్రధాని మోడీని ఎంచుకున్నారు. ఆ తర్వాత స్విస్‌ అధ్యక్షుడు అలైన్‌ బెర్సెట్‌ 62 శాతంతో రెండోస్థానంలో ఉంటే… మెక్సికో అధ్యక్షుడు మూడో స్థానంలో ఉన్నారు.గ్లోబల్‌ లీడర్‌ అప్రూవల్‌ రేటింగ్‌లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు 53 శాతం మంది ఓట్లు వేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మలోనీ 49 శాతం అప్రూవల్‌ రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి కూడా పాపులారిటీ పరంగా 22 దేశాల సీనియర్‌ నేతలను అధిగమించి మొదటి స్థానాన్ని కైవశం చేసుకున్నారు.మార్నింగ్‌ కన్సల్ట్‌ అనేది ఒక అమెరికన్‌ సంస్థ, ఆయా దేశాల్లో ప్రభుత్వాలు నడుపుతన్న నాయకుల ఇమేజ్‌ పై డేటాను సేకరిస్తుంది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన 2014లో ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ పని ప్రపంచ స్థాయిలో డేటా ఇంటెలిజెన్స్‌. మార్నింగ్‌ కన్సల్ట్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఆధారిత కంపెనీగా చెబుతారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *