సోషల్‌ విూడియాలో బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌..

రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని దృఢ నిశ్చయంతో ఉన్న బిజెపి ఈసారి అభ్యర్థులను ముందుగానే ఖరారు చేస్తూ ప్రజాక్షేత్రంలో ముందునుంచి తిరిగేలా చెయ్యాలని భావిస్తోంది. ఈమేరకు సర్వేలు చేస్తూ ప్రజల మద్దతు పొందుతున్న అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడిరది. అయితే తాజాగా సోషల్‌ విూడియాలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా అంటూ ఒక జాబితా వైరల్‌ అవుతోంది. అందులో 25 నియోజకవర్గాలకు, 25 మంది అభ్యర్థులను బిజెపి ఖరారు చేసినట్టు, అభ్యర్థుల పేర్లతో సహా లిస్ట్‌ సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతుంది. సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్న లిస్టు ఏ నియోజకవర్గం నుంచి, ఎవరెవరు పోటీ చేస్తున్నారు అన్నది ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. 25 మందితో బిజేపి మొదటి లిస్ట్‌ అని ప్రచారం అవుతున్న లిస్టులో పాలమూరు నియోజకవర్గం ` జితేందర్‌ రెడ్డి గద్వాల నియోజకవర్గం` డికే అరుణ కరీంనగర్‌ నియోజకవర్గం ` బండి సంజయ్‌ కుమార్‌ అంబర్‌ పేట్‌ నియోజకవర్గం ` కిషన్‌ రెడ్డి ముషీరాబాద్‌ నియోజకవర్గం ` డా. లక్ష్మణ్‌ నిజామాబాద్‌ నియోజకవర్గం ` అరవింద్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గం` ఈటల రాజేందర్‌ దుబ్బాక నియోజకవర్గం` రఘునందన్‌ రావు మునుగోడు నియోజకవర్గం` కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేవెళ్ళ నియోజకవర్గం ` కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి .. వికారాబాద్‌ నియోజకవర్గం ` చంద్రశేఖర్‌ వరంగల్‌(తూర్పు) నియోజకవర్గం ` ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు భూపాలపల్లి నియోజకవర్గం ` కీర్తి రెడ్డి పరకాల నియోజకవర్గం` డా. కాళీ ప్రసాద్‌ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం` కూన శ్రీశైలం గౌడ్‌ స్టేషన్‌ ఘన్‌ పూర్‌ నియోజకవర్గం ` డా. విజయ రామారావు వర్ధన్నపేట నియోజకవర్గం` కొండేటి శ్రీధర్‌ ఉప్పల్‌ నియోజకవర్గం` ఎన్వీఎస్‌ ఎస్‌ ప్రభాకర్‌ భువనగిరి నియోజకవర్గం` జిట్టా బాలకృష్ణారెడ్డి గోషామహల్‌ నియోజకవర్గం` రాజాసింగ్‌ నారాయన్‌ ఖేడ్‌ నియోజకవర్గం ` సంగప్ప నిర్మల్‌ నియోజకవర్గం ` ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి వేములవాడ నియోజకవర్గం ` తుల ఉమ ఎల్లారెడ్డి నియోజకవర్గం` ఏనుగు రవీందర్‌ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం ` రేవూరి ప్రకాశ్‌ రెడ్డి లు ఎన్నికల బరిలోకి దిగుతారని చర్చ జరుగుతుంది. అయితే సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్న ఈ లిస్టు బీజేపీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ లిస్టు ఎవరు వైరల్‌ చేస్తున్నారన్నది చర్చనీయాంశం అవుతుంది. అయితే ఆయా నియోజకవర్గాలలో మాత్రం అభ్యర్థిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇది నిజంగానే బిజెపి తయారు చేసిన లిస్టు నా.. లేక బీజేపీ దీనిపై జనాలు ఏమనుకుంటారో అని తెలుసుకోవడానికి వదిలిన ఫీలర్‌ నా అన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *