అదిలాబాద్‌ లో బోదకాల వ్యాధి ..

రాష్ట్రంలో బోదకాలు పేషెంట్లకు ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోతున్నది. గత మూడేళ్ల నుంచి ప్రతీ ఏటా సగటున 60 వేలకు తగ్గకుండా పేషెంట్ల సంఖ్య ఉన్నా, వీరిలో 50 శాతం మందికే పెన్షన్లు ఇస్తున్నారు. దీంతో మిగతా వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొందరికి ఇచ్చి, మరి కొందరికి ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు విన్నపించినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని ఓ పేషెంట్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. కరోనా వైరస్‌?ఎంట్రీ అయినప్పటి నుంచి స్థానిక మానిటరింగ్‌ టీమ్‌లు కూడా తమను పట్టించుకోవడం లేదన్నారు. దీంతో మనోవేదనకు గురవుతున్నట్లు బోదకాలు బాధితులు స్పష్టం చేస్తున్నారు. మన రాష్ట్రంలో 2019 లో 65,953 మంది బోదకాలు పేషెంట్లు ఉండగా, 2020కి అది 67,302కి పెరిగింది. ఇక 2021కి ఏకంగా 69,151 కు పెరిగింది. ప్రతీ సంవత్సరం సగటును 2 వేల చొప్పున రోగులు పెరుగుతున్నా, ప్రభుత్వం ఆ సంఖ్యకు అనుగుణంగా పింఛన్లు ఇవ్వడం లేదు.రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన జిల్లాల్లోనే బోదకాలు(ఫైలేరియా) అత్యధికంగా ఉన్నది. ఉట్నూర్‌?ఐడిడీఏ పరిధిలోని ఆదిలాబాద్‌లో మరింత తీవ్రంగా ఉన్నది. ఈ జిల్లాలో 1449 మంది పేషెంట్లు ఉంటే కేవలం 192 మందికి మాత్రమే ప్రభుత్వం నుంచి పింఛన్‌? వస్తున్నది. ఇక ఆసిఫాబాద్‌? జిల్లాలో 746 మంది పేషెంట్లకు 149, భద్రాద్రిలో 220కి 100, ఖమ్మంలో 220కి 14, మహబూబాబాద్‌లో 176కి 41, వరంగల్‌లో 105కి 17, నాగర్‌? కర్నూల్‌లో 43 మందికి నలుగురు, మంచిర్యాలలో 127కి 40 మందికి పింఛన్లు వస్తున్నాయి. జయశంకర్‌?భూపాలపల్లి ఒకరు ఉంటే ఒకరికి, నాగర్‌? కర్నూల్‌?లో ఇద్దరి పేషెంట్లకు ఇద్దరికీ పింఛన్లు అందుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఏటూర్‌?నాగారం, మన్ననూర్‌, ఉట్నూర్‌? ఐటీడీఏ పరిధిలో మొత్తం 3318 మంది బాధితులు ఉండగా, కేవలం 618 మందికి మాత్రమే పింఛన్లు రావడం గమనార్హం.రాష్ట్ర వ్యాప్తంగా బోదకాలు పేషెంట్ల వైద్య చికిత్సకు స్పెషల్‌ సెంటర్లు కూడా లేవు. స్థానికంగా ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైనే పేషెంట్లు ఆధారపడాల్సి వస్తున్నది. పైగా ప్రస్తుతం అల్లోపతి విధానంలో పైలేరియా రికవరీ శాతం కూడా చాలా తక్కువగా ఉన్నది. దీంతో గతంలోనే ఓ ఆయుర్వేదిక్‌?సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని పలువురు బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడు, కేరళ తరహాలో ట్రీట్మెంట్‌? సెంటర్లను ఏర్పాటు చేయాలని విన్నపించారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. తద్వారా వేల మంది బోదకాలు బాధితులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *