ఇతర దేశాలపై చైనా గూఢచారి బెలూన్లు.. కొత్త ఫోటోలు విడుదల.. ఏఏ దేశంపై అంటే..

చైనా కుళ్లుబుద్ది మరోసారి బయటపడింది. జపాన్, తైవాన్‌తోపాటు ఇతర దేశాలపై చైనా తమ గూఢచారి బెలూన్లను ఎగురవేసింది. దీనికి సంబంధించి బ్రిటీష్ మీడియా కొత్త సాక్ష్యాలను బయటపెట్టింది. నెల రోజుల క్రితం తమ తీరంలోకి ఇలాంటి బెలూనే ప్రవేశించడంతో అమెరికా దానిని కూల్చివేసింది. దీంతో అమెరికా, చైనా సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. కాగా చైనా బెలూన్‌లు తూర్పు ఆసియాను దాటుతున్నప్పుడు బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) వాటి ఫోటోలను తీసింది. కృత్రిమ మేధస్సు సంస్థ అయిన సింథటిక్‌తో కలిసి పని చేస్తన్నప్పుడు ఆ చిత్రాలు లభించాయి. ఇది ఉపగ్రహాల ద్వారా సేకరించిన డేటాను చాలా వరకు జల్లెడ పట్టింది.

2021 సెప్టెంబర్‌లో చైనా బెలూన్లు జపాన్‌ను దాటినట్టుగా బీబీసీ కంపెనీ వ్యవస్థాపకుడు కోర్ జస్కోల్స్కి ఆధారాలను కనుగొన్నారు. సదరు బెలూన్లు చైనా అంతర్భాగం నుంచే వచ్చాయని ఈ ఆధారాలు సూచిస్తున్నాయని ఆయన నమ్మారు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మూడు బస్సుల సైజ్‌లో ఉన్న చైనా గూఢచారి బెలూన్లు అట్లాంటిక్ మహాసముద్రం తీరంలో యూఎస్ దళాల కంటపడ్డాయి. దీంతో యూఎస్ దళాలు వాటిని కూల్చివేశాయి. ఈ ఘటనతో చైనా, యూఎస్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. అయితే ఆ బెలూన్లను తాము యూఎస్ గగనతలంలో కనిపించే పౌర ప్రయోజనాల కోసం, వాతావరణ శాస్త్రం వంటి శాస్త్రీయ పరిశోధనలకు ఉపయెగించుకోవడానికి ప్రయెగించామని చైనా పేర్కొంది.

కాగా ఫిబ్రవరిలో యూఎస్ భూభాగం మీదుగా ఎగిరిన బెలూన్ మోంటానా రాష్ట్రంలోని అణు వాయు రక్షణ వ్యవస్థకు 130 కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉందని జాస్కోల్స్కీ విశ్లేషణ చెబుతుంది. మరోవైపు ఈ బెలూన్ల విషయమపై చైనా కూడా అమెరికాపై ఆరోపణలు చేసింది. అమెరికా భారీగా ఎత్తైనా బెలూన్‌లను విడుదల చేసిందని, అవి ప్రపంచాన్ని చుట్టుముట్టాయని, తమ గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించాయని ఆరోపిస్తూ లండన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *