ఇక 24 గంటల వ్యాపారం…

తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అన్ని దుకాణాలు, వ్యాపార సముదాయాలు 24 గంటలు తెరిచేలా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో వ్యాపార వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని పేరుతో విడుదలైన జీవో ప్రకారం తెలంగాణలో షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలు 24 గంటలూ తెరిచేలా అనుమతి ఇచ్చారు. దీని కోసం ఏటా ప్రభుత్వానికి పదివేల రూపాయలు చెల్లించాలి. తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1988కు సవరణలు చేసిన ప్రభుత్వం ఈ మేరకు 24 గంటలు షాపులు తెరిచేలా అనుమతి ఇచ్చారు.
ఇలా 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు షాపులు, షాపింగ్‌ మాల్స్‌ నిర్వాహకులు కొన్ని రూల్స్‌ పాటించాల్సి ఉంటుంది. సిబ్బందికి ఐడీ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. వారికి వీక్లీహాలిడేస్‌ మస్ట్‌గా ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. కచ్చితమైన పని గంటల్లో వారితో పని చేయంచుకోవాలి. ఓవర్‌ టైం చేస్తే మాత్రం ప్రత్యేక వేతనం ఇవ్వాలి. పండగలు, సెలవు దినాల్లో పని చేసేవారికి కాంపెన్సేటరీ లీవులు కూడా ఇవ్వాలి.మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వేతనం ఇవ్వాలి. రాత్రి షిఫ్టులో పని చేసేందుకు అంగీకరిస్తేనే మహిళలకు డ్యూటీలు వేయాలి. వారికి తగిన భద్రత కల్పించాలి. వారికి రవాణా సౌకర్యం కూడా కల్పించాలి. రికార్డులను సరిగా నిర్వహించాలి. పోలీస్‌ యాక్ట్‌ రూల్స్‌ మస్ట్‌గా ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఉంటే తప్ప అలాంటి షాపులను 24 గంటలూ తెరిచేలా అనుమతులు ఇవ్వబోరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *