అందరికీ తెలుసు.. నన్నే ఎందుకు ఇలా?

చిత్రం’ సినిమాతో ఉదయ్‌కిరణ్‌ను (Uday Kiran) హీరోను చేశారు దర్శకుడు తేజ (Teja). ఆ సినిమా విజయం సాధించడంతో వెంటనే ‘నువ్వు నేను’ చిత్రంతో రెండో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో ఉదయ్‌ కిరణ్‌ గ్రాఫ్‌ పెరిగింది. వరసగా విజయవంతమైన చిత్రాల అవకాశం అందుకుని అతి తక్కువ సమయంలో స్టారడమ్‌ని చూశాడు. ఉదయ్‌కిరణ్‌ 2014లో ఆత్మహత్య (Uday Kiran Death mistery) చేసుకున్నారు. అయితే అతని మరణం గురించి రకరకాల కారణాలు బయటకు వచ్చినా ఇప్పటికీ నిజం ఏంటనేది ఓ మిస్టరీలాగే ఉంది. ఉదయ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే దర్శకుడు తేజ ‘అతని మరణానికి కారణం ఏంటో సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా’ అని ఓ సందర్భంలో అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదే ప్రశ్నను ఎదుర్కొన్నారు తేజ. ‘ఉదయ్‌ గురించి ఒక్క మాటలో’ చెప్పాలంటే ‘పాపం’ అని ఆయన తేజ అన్నారు. అతని డెత్‌ మిస్టరీ గురించి వ్యాఖ్యాత అడగ్గా ఆయన స్పందించారు. ‘‘దాని గురించి నేను చెబుతాను. కానీ, కొందరు ‘మీరే చెప్పండి.. చెప్పాలి’ అని ఏమీ తెలియనట్లు అమాయకంగా యాక్ట్‌ చేస్తున్నారు ఎంతో మందికి ఆ విషయం తెలిసినా నాతోనే చెప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు’’ అని అసహనం వ్యక్తం చేశారు

మరోసారి ఉదయ్‌కిరణ్‌ (Uday kiran death) గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వు చిత్రాలతో వరుసగా సూపర్‌హిట్‌ కావడంతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ని చూశాడు. దాంతో బ్యాలెన్స్‌ మిస్‌ అయ్యాడు. అలాగని గర్వంగా ఎప్పుడూ లేదు. అమాయకుడు అతను. సక్సెస్‌లో ఉన్నప్పుడు పదిమంది చుట్టూ ఉంటారు. రకరకాలు చెబుతారు అవన్నీ విని ఉండొచ్చు. చాలా సినిమాలు చేశాడు. ఆ సమయంలో నన్ను కూడా కాస్త దూరం పెట్టాడు. అతను ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు నేనే పిలిచి ‘ఔనన్నా కాదన్నా’ సినిమా చేశా. అతనికి నేను గుర్తొచ్చానో లేదో తెలియదు కానీ నేను అతన్ని గుర్తు పెట్టుకున్నా. ‘నేనిలా చేసినా నన్ను పిలిచి అవకాశం ఇచ్చారు. ఒక సారి మిమ్మల్ని టచ్‌ చేస్తాను క్షమించాను’ అని చెప్పండి అన్నాడు. టచ్‌ చెయొద్దు నేను క్షమించను’ అని చెప్పా. జరిగింది నేను మరిచిపోను.. నువ్వు మంచి సినిమాలు చెయ్యి. అలాగే ఉండు’ అని చెప్పాను. అయితే తన జీవితంలో ఏం జరిగిందో మొత్తం నాతో పంచుకున్నాడు. అది సమయం వచ్చినప్పుడు చెప్తా’’ అని తెలిపారు తేజ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *