ఎమ్మెల్యేలకు దళిత బంధు టెన్షన్‌

నల్గోండ, వరంగల్‌, జూలై 8, (న్యూస్‌ పల్స్‌)
ఇప్పుడున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో అందరికీ టికెట్‌ ఇస్తం..ఇది ఒకటికి రెండు సార్లు పార్టీ విూటింగ్‌లలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వయంగా చెప్పిన మాట. దీంతో అంతా అనుకున్నట్లు జరిగితే బాగుంటుంది అని అందరూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అనుకున్నారు. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో అది కూడా ప్రగతి భవన్‌ సర్కిల్‌ లో జరుగుతున్న ప్రచారం తో సిట్టింగ్‌ లలో మళ్ళీ టెన్షన్‌ పుట్టిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు మరీ ముఖ్యంగా.. దళిత బంధులాంటి ప్రతిష్టాత్మక స్కీమ్‌ లో ఎమ్మెల్యేల చేతివాటంపై సీఎం కేసీఆర్‌కు అందిన రిపోర్ట్స్‌ ను బట్టి 25 నుంచి 30 స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చక తప్పదని ఆ పార్టీ ముఖ్య నేతలు డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ.. ఎవరికి టికెట్‌ ఇవ్వాలి..ఎవరికి టికెట్‌ ఇస్తే ఓడిపోతారో అనేది ఇప్పటికే ఒక బ్లూ ప్రింట్‌ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆ బ్లూ ప్రింట్‌ ఆధారంగానే 25 నుంచి 30 స్థానాల్లో సిట్టింగ్‌ లను పక్కన పెట్టక తప్పదనే అంచనాకు ప్రగతి భవన్‌ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా నాలుగైదు సర్వే రిపోర్ట్స్‌ ను బేరీజు వేసుకొని వీరికి టికెట్‌ మర్చక తప్పదని ప్రగతి భవన్‌ పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.దానిలో భాగంగానే ప్రభుత్వ పథకాల్లో అవినీతి విషయాన్నీ ప్రస్తావించిన గులాబీ బాస్‌.. ఇదే రిపీట్‌ అయితే పార్టీ టిక్కెట్‌ కట్‌ చేయడమే కాదు పార్టీ నుండి సాగనంపడానికి కూడా వెనుకాడను అంటూ ఇటీవల హెచ్చరికలు చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.మరో వైపు బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు, వైస్‌ షర్మిల తదితర విపక్ష నేతలు దళిత బంధులో అక్రమాలపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను సుమోటా తీసుకోను విచారణ చెయ్యాలి అంటూ అప్పట్లో టార్గెట్‌ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనీసం నలుగురు సిట్టింగ్‌లు, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో ఇద్దరు, కరీంనగర్‌ జిల్లా లో ముగ్గురు, అదిలాబాద్‌ లో 3, రంగారెడ్డి 4, ఖమ్మం లో 3, నిజామాబాద్‌ 2, వరంగల్‌ లో 4, మెదక్‌ లో 4 సిట్టింగ్‌ లకు వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కకట్‌ అనే వార్తలు జోరందుకున్నాయి. అటు సోషల్‌ విూడియాలో పలు స్థానాల్లో అభ్యర్థుల మార్పు తథ్యమన్న ప్రచారం సిట్టింట్‌ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.ఎన్నికలకు కొన్ని మాసాల ముందే అభ్యర్థులను ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ డిసైడ్‌ అయ్యారని తెలుస్తుంది. ఇప్పటికే పలు స్థానాల్లో సిట్టింగ్‌ల పేర్లను మంత్రి కేటీఆర్‌ ప్రకటించినా.. టికెట్‌ దక్కని వారికి ముందే సమాచారం ఇచ్చే అవకాశం లేదని పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుకుంటున్నారు. టిక్కెట్‌ ఇవ్వడం లేదని హింట్‌ ఇస్తే వారు ఇతర పార్టీలకు జంప్‌ అయ్యే అవకాశం ఉండటంతో ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని బీఆర్‌ఎస్‌ పెద్దలు భావిస్తున్నారు.అయితే సిట్టింగ్‌లకు టిక్కెట్‌ కోతలపై సీఎం కేసీఆర్‌ ఫిక్స్‌ అయ్యారు కాబట్టే మొన్నటి సమావేశంలో దళిత బంధు స్కీమ్‌లో పార్టీ ఎమ్మెల్యేల చేతివాటంపై ఓపన్‌ అయ్యారన్న టాక్‌ వినిపిస్తోంది. కేవలం కామెంట్స్‌ మాత్రమే కాదు.. ఎవరు ఎంత వాసులు చేశారన్న జాబితా కూడా గులాబీ బాస్‌ టేబుల్‌ ముందు ఉన్నట్టు కీలక సమాచారం. మొత్తానికి ఈ వార్తలతో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో వణుకు మొదలయ్యింది. సొంతంగా సర్వే లు చేయించుకొని.. నియోజక వర్గాల్లో పరిస్థితి ని సరిదిద్దుకునే ప్రయత్నం సిట్టింగ్‌ లు చేస్తున్నారు. మరో వైపు దళిత బంధు పథకంలో వసూళ్లపై పార్టీ బాస్‌ గరం గరం అవ్వడంతో టికెట్‌ వస్తుందా లేదా అనే టెన్షన్‌ పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు తప్పడం లేదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *