మునుగోడు పోటీలో తొకపార్టీలు

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే ఎలా అన్నదానిపైనే సర్వత్రా చర్చ సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి చూపు కూడా మునుగోడు వైపే మళ్లింది. మునుగోడులో సత్తా చాటబోయే పార్టీ ఏదన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ అంశం ప్రధాన పార్టీలకు టెన్షన్‌ పెట్టిస్తోందనే టాక్‌ జోరందుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నేతృత్వంలోని బీఎస్పీ, షర్మిల నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌ టీపీ పార్టీల నిర్ణయం ఏంటన్న దానిపై రాజకీయ వర్గాల్లో అంచనాలు, అభిప్రాయాలు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెవిూ ఫైనల్‌గా రాజకీయ వర్గాల్లో అంచనాలు వేసుకుంటున్నాయి. ఇక్కడ రాబోయే ఫలితమే రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారబోతోందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామంటే తామని కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతుంటే తామేమి తక్కువ కాదు అంటూ ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, వైఎస్‌ షర్మిల తమదైన విమర్శలతో రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది తామే అని ఇటు ప్రవీణ్‌ కుమార్‌, అటు వైఎస్‌ షర్మిల ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అయితే మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే ఈ రెండు పార్టీలు బరిలో ఉంటాయా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఈ రెండు పార్టీలకు తోడు ఇటీవల తెలంగాణలో కేఏ పాల్‌ సైతం తన యాక్టివిటీని పెంచేశారు. ఒక వేళ ఈ ముగ్గురు నేరుగా తామే బరిలోకి దిగుతారా? లేక తమ తరఫున అభ్యర్థులను బరిలోకి దిపుతారా అనేది ఆసక్తిగా మారింది. వీరు బరిలోకి దిగితే ఏ మేరకు ఓట్లు చీల్చగలరనేది చర్చగా మారింది.మునుగోడులో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, షర్మిల, కేఏ పాల్‌ కారణంగా ఎవరికి మైనస్‌ కాబోతోందనేది ఆసక్తిని రేపుతోంది. ఇక్కడ ట్రైయాంగిల్‌ వార్‌ పక్క అనేది స్పష్టం అవుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య బిగ్‌ ఫైట్‌ సాగనుంది. ఇప్పటి వరకు షర్మిల, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, కేఏ పాల్‌ ఈ ముగ్గురు కూడా కేసీఆర్‌ సర్కార్‌ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాము చేపడుతున్న పాదయాత్రల్లోనూ ఉద్యోగాలు, పెన్షన్లు, రైతుల సమస్యలపై, విద్యా రంగంపై ప్రధానంగా ఫోకస్‌ పెడుతున్నారు. సంక్షేమ పథకాలు, పార్టీ క్యాడర్‌ ఆధారంగా టీఆర్‌ఎస్‌ కు అధిక ఓట్లు పడే అవకాశాలు ఉండగా.. అసంతృప్త ఓట్లు విపక్షాలు షేర్‌ చేసుకుంటాయని, ఒక వేళ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా ఎక్కువ పార్టీలు బరిలో ఉంటే ఓటు చీలి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా మారినా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి బలమైన క్యాడర్‌ ఉంది. మరో వైపు ఈ సెగ్మెంట్‌ కాంగ్రెస్‌ కు కంచుకోట. అయితే గతేడాది హుజురాబాద్‌లో ఉన్న ఎన్నిక వస్తే షర్మిల పార్టీ పోటీ చేస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆమె మాత్రం నిరుద్యోగులు నామినేషన్‌ దాఖలు చేయాలని అలా ముందుకు వచ్చిన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ప్రకటన చేసింది. బీఎస్పీ సైతం పోటీకి దూరంగా ఉంది. ఈ ఏడాది కాలంలో ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఎస్పీకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాడు. షర్మిల పాదయాత్ర స్పీడును మరింత పెంచింది. ఈ నేపథ్యంలో బీఎస్పీ, వైఎస్‌ఆర్టీపీ, ప్రజాశాంతి పోటీలో నిలిస్తే ఫలితం ఎలా ప్రభావితం కానుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *