సైకిల్‌ పై కమలం సవారీ..?

తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలసి నడిచేందుకు ప్రయత్నిస్తుందా? ముందు తెలంగాణలో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతుందా? అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయని చెబుతున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లోని స్లీపర్‌ సెల్స్‌ కూడా టీడీపీతో పొత్తు పట్ల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పై టీడీపీ వత్తిడి కూడా తెస్తుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పొత్తు పెట్టుకునే దిశగా తెలుగుదేశం పార్టీ హస్తిన స్థాయిలో పెద్దయెత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే పొత్తు కుదరవచ్చు. కుదరకపోవచ్చు. ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం ఉన్నాయంటున్నారు. అంటే ఇంతకు ముందుకంటే పరిస్థి?తి కొంత మెరుగైంది. మొన్నటి వరకూ వందశాతం టీడీపీతో పొత్తు లేదని చెప్పిన కమలనాధులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వస్తున్న వత్తిడి ఇందుకు కారణమంటున్నారు. సీఎం రమేష్‌ లాంటి నేతలు కూడా ఢల్లీి పెద్దల చెవిలో అదే పనిగా ఊదుతుండటంతో అధినాయకత్వం కొంత మెత్తపడినట్లు చెబుతున్నారు. ఇంటలిజెన్స్‌ నివేదికలు కూడా టీడీపీతో కలసి వెళ్లడం మేలని సూచిస్తుండటంతో ఢల్లీి హైకమాండ్‌ కొంత ఆలోచనలో పడిరదని చెబుతున్నారు.ఈసారి తాము ఉత్తమ మిత్రపక్షంగా ఉంటామని టీడీపీ పదే పదే హావిూలిస్తుండటం కూడా ఇందుకు కారణమంటున్నారు. ముందుగా జరిగే తెలంగాణలో పొత్తును బీజేపీతో కుదుర్చుకుంటే ఏపీలో ఇక ఖాయమన్న కామెంట్స్‌ వినపడుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరన్న సామెత మరోసారి రుజువయ్యేటట్లుంది. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో వ్యతిరేకించిన చంద్రబాబు ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం మళ్లీ చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను కూడా ఆ పార్టీలోకి పంపారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు దౌత్యం ఫలించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం సుముఖంగా లేరు. 2018లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో చంద్రబాబుతో జట్టుకట్టిన కాంగ్రెస్‌ రెండోసారి కూడా అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అదేమాదిరి తయారవుతుందన్న ఆందోళన రాష్ట్ర కమలం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో ఆదరించరని చెబుతున్నారు. ఆయన ప్రకటనలు, తెలంగాణ సమాజంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కొంత ఇబ్బందిపెట్టేవిగా ఉన్నాయని చెబుతున్నారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే పొత్తు కుదుర్చుకోవాలనుకుంటే ఫలితం లేదని చెబుతున్నారు. మేజర్‌ వర్గాలు దూరమవుతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ంశ్రీబనీ ఖీవజీట ` ఓటమి మంచిదేనట.. ఎందుకంటే? ఆవిర్భావ వేడుకల్లో… తాజాగా ఢల్లీిలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనడం ఇందుకు ఊతమిస్తుంది. జేపీ నడ్డా పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న నడ్డా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు అభినందనలను తెలియజేశారు. వాజ్‌ పేయి, ఎన్‌ డి ఏ హయాంలో టిడిపి` బిజెపి అనుబంధాన్ని కూడా వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇటీవల అండమాన్‌ మేయర్‌ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ పొత్తుపైనా ట్వీట్‌ చేయడంతో తమ బంధం ఏర్పడుతుందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *