ఎనిమిదో తేదా, 12వ తేదా….?

హైదరాబాద్‌, జూన్‌ 29
ప్రధాని మోడీ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. గతంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని మోడీ.. మరికొన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన పనులు పెండిరగ్‌లో ఉండటతో వాటిని ప్రారంభించలేదు.దీంతో అవి పెండిరగ్‌ లోనే ఉన్నాయి. అందులో వరంగల్‌ టెక్స్‌ టైల్‌ పార్క్‌తో పాటు, కాజీపేటలో రైల్వే అభివృద్ధి పనులు ఉన్నాయి. ఈ పనుల ప్రారంభోత్సవానికి మోడీ తెలంగాణకు వస్తున్నారు. అయితే వచ్చనెల 8వ తేదీన ఆయన షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకుంటారా? లేక 12వ తేదీన తెలంగాణకు వస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో రైల్వే శాఖ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.వచ్చే నెల 8వ తేదీన తెలంగాణలో 11 రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులతో పాటు సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో హైదరాబాద్‌లో విూటింగ్‌ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రధాని మోడీ సైతం హాజరవుతారని సమాచారం.కానీ ప్రధాని మోడీకి సంబంధించిన షెడ్యూల్‌పై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. నేతల సమావేశం అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. నడ్డా, అమిత్‌ షా ఎలాగూ ఈ సభకు హాజరుకునుండటంతో ప్రధాని మోడీ సైతం ఈ సభకు హాజరైతే ఇంపాక్ట్‌ ఎక్కువగా ఉంటుందని, శ్రేణుల్లోనూ జోష్‌ వస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.అలా అయితే 8వ తేదీన సమావేశానికి హాజరై పనిలో పనిగా ఈ అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తే బాగుంటుందా? లేక 12వ తేదీన హాజరుకావాలా? అనే విషయంపై సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోడీ 8వ తేదీన తెలంగాణకు వస్తారా? 12వ తేదీన వస్తారా? అనేది పక్కన పెడితే వచ్చే నెలలో మాత్రం ఆయన తెలంగాణ టూర్‌ పక్కా అని స్పష్టమవుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. తేదీ ఖరారు కావాల్సి ఉందని చెప్పారు. అది కన్ఫామ్‌ అయితే ఏర్పాట్లు చేసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *