సిటీలో మిడిల్‌ క్లాస్‌ కు దూరమేనా

విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న భాగ్య నగరం.. అన్ని రంగాల్లో.. అన్ని వైపులా.. శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భూముల రేట్లు భారీగా పలుకుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు హైదరాబాద్‌లో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొందనే టాక్‌ వినిపిస్తోంది.మళ్లీ వచ్చిన బిర్లా. నష్టాల నుంచి వీఐ గట్టెక్కెనా?ఎందుకంటే.. జూబ్లీహిల్స్‌ లాంటి ఏరియాలో యావరేజ్‌గా గజం స్థలం రేటు ఏకంగా 2 లక్షల 74 వేల 950 రూపాయలు చెబుతున్నారు. ఇది.. ప్రభుత్వం నిర్ణయించిన రేటు అనే విషయం మర్చిపోవద్దు. అంటే.. మార్కెట్‌ వ్యాల్యూ ఇంకెంతఉంటుందో ఊహించుకోవచ్చు.హైదరాబాద్‌లో ప్రస్తుతానికి ఇదే హయ్యస్ట్‌ రేట్‌ కావటం విశేషం. దీని ప్రకారం చూసుకుంటే హైదరాబాద్‌ శివారు సదాశివపేట ప్రాంతంలో యావరేజ్‌గా గజం స్థలం ధర 14 వేల 850 రూపాయలుగా నమోదైంది. సిటీలోని 16 ప్రముఖ ప్రాంతాలతో పోల్చితే.. సదాశివపేటలోనే అతి తక్కువ రేటు.. అది కూడా దాదాపు 15 వేల రూపాయలు కావటం గమనించాల్సిన అంశం.జూబ్లీహిల్స్‌, సదాశివపేట కాకుండా మిగతా 14 ప్రాంతాల్లో యావరేజ్‌గా గజం ధర ఎలా ఉందో చూద్దాం. కోహెడలో 14 వేల 850. సంగారెడ్డిలో 15 వేల 750. కీసర మరియు అల్వాల్‌లో 19 వేల 350 చొప్పున పలుకుతోంది. తుర్కయంజాల్‌ మరియు బోడుప్పల్‌లో యావరేజ్‌గా గజం స్థలం ధర 32 వేల 850 రూపాయల చొప్పున చెబుతున్నారు.గాజుల రామారంలో 57 వేల 600, బండ్లగూడ జాగీర్‌లో 63 వేల రూపాయలు చెల్లించాలి. గండి మైసమ్మ మరియు నార్సింగిలో 73 వేల 350 రూపాయల చొప్పున డిమాండ్‌ నెలకొంది. కొండాపూర్‌లో 94 వేల 950 రూపాయలు పెడితే తప్ప గజం స్థలం రావట్లేదు.లింగంపల్లి, బడంగ్‌పేట్‌ ఏరియాల్లో యావరేజ్‌గా గజం స్థలం కావాలంటే.. 95 వేల 850 రూపాయల చొప్పున సమర్పించుకోవాలి. నల్లగండ్ల అనే ఏరియాలో 99 వేల 900 రూపాయలు ఇవ్వాలి. అంటే.. లక్ష రూపాయలకు 100 రూపాయలు మాత్రమే తక్కువన్న మాట.ఒక్క గజం స్థలం రేటే ఇంత ఉందంటే.. చిన్న ఇల్లయినా కట్టడానికి ఎంత ప్లేస్‌ కావాలో, దానికి ఎన్ని డబ్బులవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మిడిల్‌ క్లాస్‌ పీపుల్‌.. హైదరాబాద్‌కి నలభై యాభై కిలోవిూటర్ల దూరం వెళ్లి కొనుక్కుంటున్నారని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు చెబుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *