ఐటెమ్ సాంగ్స్ హీరోయిన్ వందల కోట్లా ఇల్లు.

బాలీవుడ్ను షేక్ చేస్తున్న హీరోయిన్లలో ఊర్వశి రౌతేలా ఒకరు అని చెప్పాలి. చేసిన సినిమాలు తక్కువే అయినా… స్టార్ హీరోయిన్ హోదా అయితే వచ్చింది. దానికి తగ్గట్లుగానే లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వస్తోంది. 2013లో ది సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లు, ఈవెంట్స్.. బాలీవుడ్ ఒక్కటేనా.. దేహ విదేశాల్లో జరిగే ప్రత్యేకేమైనా ఈవెంట్స్ కూడా అమ్మడిని ఆహ్వానించే రేంజ్ కు ఎదిగింది.ఇక ఈ మధ్యనే కేన్స్ ఫెస్టివెల్ ల్లో మొసలి నెక్లెస్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. దాని విలువ సుమారు రూ. 200కోట్లు అని తెలిసి జనాలు విస్తుపోయారు. అంతటి కాస్ట్లీ నెక్లెస్ అమ్మడు ధరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంకా ఆ ట్రోల్ నడుస్తూనే ఉంది.. తాజాగా మరో రూమర్ అమ్మడి గురించి నెట్టింట వైరల్ గా మారింది. ఊర్వశి రౌతేలా ఏకంగా 190 కోట్ల రూపాయలు పెట్టి ఒక బంగ్లా కొని సంచలనం సృష్టించిందంటూ వార్తలు వస్తున్నాయి. అసలు నిజానికి ఈమె చేసిన సినిమాలు తక్కువే.

ఇప్పటివరకు 15 సినిమాల్లో నటించింది. ఇందులో ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలు కేవలం ఐదు. మిగతావన్నీ ఐటెంసాంగ్స్ మాత్రమే. ఈ మధ్యనే తెలుగులో కూడా ఊర్వశీ అడుగుపెట్టింది. వాల్తేరు వీరయ్య, ఏజెంట్ సినిమాలలో ఐటెం సాంగ్స్ మెప్పించింది. కేవలం 15 సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ ముంబైలో అంత పెద్ద బంగ్లా కొన్నారు అనగానే అందరూ షాక్ అవుతున్నారు.స్టార్ హీరోయిన్లే.. అంతంత మాత్రంగా ఉంటున్న ఈ సమయంలో అమ్మడు మాత్రం రూ. 200కోట్ల నెక్లెస్.. రూ.190 కోట్ల బంగ్లా కొంటుంది అంటే మాములు విషయం కాదు అంటూ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ఈ భామ బోయపాటి, రామ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ ఐటెం సాంగ్ లో
కనిపించనుందని తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *