పేపర్‌ లీకేజీ పై సిట్‌ చార్జీ షీటు

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్‌ అధికారులు దూకుడు పెంచారు. నిందితులపై అభియోగపత్రంలో 37 మంది పేర్లు చేర్చనున్నట్లు తెలుస్తోంది. న్యాయ సలహా తీసుకొని వచ్చే వారంలో అభియోగపత్రం దాఖలు చేసే యోచనలో సిట్‌ అధికారులు ఉన్నట్లు సమాచారం. పేపల్‌ లీకేజీ కేసులో సిట్‌ అధికారులు ఇప్పటి వరకు 50 మందిని అరెస్ట్‌ చేశారు. ఇందులో 15 మంది నిందితులు బెయిల్‌ పై బయటకి వచ్చారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌, రాజశేఖర్‌ రెడ్డితో పాటు మిగతా నిందితులు జైల్లోనే ఉన్నారు. అనుబంధ అభియోగ పత్రం (ఛార్జ్‌ షీటు)లో మిగతా నిందితుల పేర్లను చేర్చే యోచనలో సిట్‌ అధికారులు ఉన్నారు. మరోవైపు డీఈ పూల రమేష్‌ అరెస్టుతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. నిందితుడు డీఈ పూల రమేష్‌ కొందరు అభ్యర్థులతో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ చేయించాడు. డీఈ ప్రశ్నా పత్రాన్ని దాదాపు 80 మందికి విక్రయించినట్లు సిట్‌ అదికారుల దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే వ తేదీన కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న విద్యుత్‌ శాఖ డీఈ రమేష్‌ రెడ్డిని సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు షాకింగ్‌ విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. డీఈ రమేష్‌ ద్వారా ఓ మాజీ ఎంపీటీసీ కూతురు కూడా ఏఈఈ సివిల్‌, జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్ష రాసినట్లు వెల్లడి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దర్యాప్తు వేగాన్ని పెంచిన సిట్‌ అధికారులు ఇటీవల వరంగల్‌ జిల్లా విద్యుత్‌ శాఖలో డీఈగా పని చేస్తున్న రమేష్‌ ను అరెస్ట్‌ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే విచారణలో ఏఈఈ సివిల్‌, జనరల్‌ నాలెడ్జ్‌, డీఏఓ పరీక్షల ప్రశ్నాపత్రాలను 40 మందికి ఇవ్వడంతోపాటు హైటెక్‌ పద్ధతిలో మాస్‌ కాపీయింగ్‌ చేయించినట్లు తేలింది. ఈ క్రమంలోనే డీఈ రమేష్‌ ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్‌ అధికారులు నాంపల్లి కోర్టు అనుమతితో అతడిని ఆదివారం కస్టడీకి తీసుకున్నారు.విచారణలో కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్‌ కూతురు రమేష్‌ ద్వారా ఏఈఈ సివిల్‌, జనరల్‌ నాలెడ్జ్‌ పరీక్ష రాసినట్లు తేలింది. శ్రీనివాస్‌ ను కిలిసిన రమేష్‌ 75 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడి అయింది. ఈక్రమంలోనే ఆ ఎంపీటీసీ కూతురు పరీక్ష రాయగా… ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా ఆమెకు రమేష్‌ జవాబులు చేర వేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎంపీటీసీతో పాటు ఆయన కూతురును కూడా విచారించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇలా ఇప్పటి వరకు విచారణలో మొత్తం 80 మందికి డీఈ రమేష్‌ ప్రశ్నాపత్రాలు అమ్మినట్లు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుందో.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *