కరోనా వల్ల పిల్లల్లో మీజిల్స్ ముప్పు…ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తర్వాత మీజిల్స్ ముప్పు ఆరంభమైందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా వెల్లడించింది. కరోనావైరస్ మహమ్మారి(Covid pandemic) ప్రారంభమైనప్పటి నుంచి మీజిల్స్(Measles) ఇమ్యునైజేషన్ గణనీయంగా పడిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 40 మిలియన్ల మంది పిల్లలు గత ఏడాది వ్యాక్సిన్ డోస్ మిస్సయ్యారు.మీజిల్స్ వ్యాధిపై నియంత్రణ బలహీనపడటంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా (Global Threat)వివిధ ప్రాంతాలకు మీజిల్స్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

మీజిల్స్ అంటువ్యాధి

మీజిల్స్ అనేది అంటువ్యాధి. ఈ అంటు వ్యాధిని టీకా ద్వారా దాదాపు పూర్తిగా నివారించవచ్చు. అయితే సమాజ వ్యాప్తిని నివారించడానికి 95 శాతం టీకా కవరేజ్ అవసరమని వైద్యనిపుణులు చెప్పారు.ప్రపంచంలో ఇప్పుడు మిలియన్ల మంది పిల్లలు మీజిల్స్‌కు గురవుతున్నారు. 2021వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 9 మిలియన్ల మంది మీజిల్స్ ఇన్ఫెక్షన్ల బారిన పడ్డారని, వారిలో 1,28,000 మంది మరణించారని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *