హీరోలు లేకుండా ప్లాన్‌ చేశారు!

బిజీగా ఉన్నారు. ఇటీవల ముంబైలో ‘ఒజి’ (OG)చిత్రం షూటింగ్‌ మొదలెట్టారు. అక్కడ సన్నివేశాలు చిత్రీకరణ చేస్తున్నారు. హరీశ్‌ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad bhagatsingh) మొదటి షెడ్యూల్‌ పూర్తి చేశారు. గత షెడ్యూల్‌ పవన్‌, శ్రీలీల మధ్య సాగే లవ్‌ సీన్స్‌ చిత్రీకరించారు. సముద్రఖని తెరకెక్కిస్తున్న ‘పీకే ఎస్‌డీటి’ (PKSDT) చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదాయ సిత్తం’ చిత్రానికి రీమేక్‌ ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌ లేని కొన్ని వేశాలను తెరకెక్కిస్తున్నారు. విశాలమైన రోడ్డు మీద నైడ్‌ మోడ్‌లో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. భారీ క్రేన్‌లు, లైటింగ్‌, వెహికల్స్‌ హంగామా చూస్తే భారీ యాక్షన్‌ సీన్స్‌ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటి సముద్రఖని ఈ చిత్రం టాకీ పార్ట్‌ పూర్తి చేశారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది
ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’ చిత్రం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. కార్తిక్‌ దండు దర్శకత్వంలో మిస్టీక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం సూపర్‌హిట్టై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సాయితేజ్‌ కెరీర్‌లోనే భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఎస్‌విసీసీ బ్యానర్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయక్తంగా ఈచిత్రాన్ని నిర్మించాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *