నిన్న కేసీఆర్‌… ఇవాళ హరీష్‌ రావు

మెదక్‌, ఆగస్టు 28
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల హడావిడి నెలకొంది. ఇంకొక మూడు నెలల్లో ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లలోని ఆయా పార్టీల ప్రతినిధులు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇప్పటి నుండే నానాపాట్లు పడుతున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ నేత మాత్రం ఏ ప్రయత్నాలు చేయకుండానే అక్కడి ప్రజలు ఆయన చేసిన అభివృద్ధిని గమనించి, తామంత తాముగా ఎన్నికలకు మూడు నెలలు ముందు నుంచే తమ మద్దతును తెలుపుతున్నారట ఇంతకి ఎవరా నేత? వివరాలు పూర్తిగా తెలుసుకుందాం..అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌.. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే మాస్‌ లీడర్‌.. ఆయనే హరీష్‌ రావు. ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి హరీష్‌ రావుకి మద్దతుగా ఏకగ్రీవాల ట్రెండ్‌ నడుస్తోందట. అభివృద్ధికి హద్దులు లేవు అన్న విధంగా, బుల్లెట్‌ లా దూసుకుపోతోంది సిద్దిపేట నియోజకవర్గం. గత కొన్నేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి మంత్రి హరీష్‌ రావు పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా హరీష్‌ రావుని కేసీఆర్‌ ప్రకటించారు. దాంతో ఆ నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. హరీష్‌ రావును గెలిపించుకునే బాధ్యతను నియోజకవర్గ ప్రజలు తీసుకుంటున్నారు. ఆయనకు స్వచ్ఛందంగా తమ మద్దతును ఇస్తామంటూ ముందుకు వస్తున్నారు.అవును, సిద్దిపేటలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. సిద్దిపేట అభివృద్ధి బిఆర్‌ఎస్‌ పార్టీతోనే.. మంత్రి హరీష్‌ రావుతోనే జరిగింది అంటున్నారు అక్కడి ప్రజలు. అందుకే తామంతా బిఆర్‌ఎస్‌ కే.. మా హరీష్‌ అన్నతోనే ఉంటామని ఏకగ్రీవంగా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఒక గ్రామం ఏకగ్రీవ తీర్మానం చేయగా పలు గ్రామాల్లో కుల సంఘాల ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు.సిద్దిపేటలో నియోజకవర్గ పరిధిలో పోటీలో ఎవరు ఉన్న, తమ మద్దతు మాత్రం హరీష్‌ రావుకే అని మరోసారి సిద్దిపేట ప్రజలు నిరూపించారు. మంత్రి హరీష్‌ రావుకి ఏకగ్రీవ తీర్మానాలు అందజేస్తున్నారు. ఒక వైపు గ్రామాలు.. మరో వైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటి పైకి వచ్చి మంత్రి హరీష్‌ రావు, బిఆర్‌ఎస్‌ పార్టీకి జై కొడుతున్నారు. ఇప్పటికే సిద్దిపేట రూరల్‌ మండలంలోని రాంపూర్‌ గ్రామం మొత్తం వచ్చే ఎన్నికల్లో మంత్రి హరీష్‌ రావుకే తమ మద్దతు అని ఏకగ్రీవ తీర్మానం చేసి, ఆ పత్రాన్ని మంత్రి హరీష్‌ రావుకి అందజేశారు. మరో వైపు చిన్న గుండవెళ్లి గ్రామ మత్స్య కారుల సహకార సంఘం, ముదిరాజ్‌, ఇరుకోడ్‌ గ్రామ ముదిరాజ్‌ సంఘం, సిద్దిపేట పట్టణంలోని హనుమాన్‌ నగర్‌ ముదిరాజ్‌ సంఘం మొత్తం మంత్రి హరీష్‌ రావుకి జై కొట్టారు.సిద్దిపేట రూరల్‌ మండలం తోర్నాల గ్రామంలోని రజక సంఘం, మున్నూరు కాపు సంఘం, రావురుకుల గ్రామంలోని కుర్మ సంఘం మంత్రి హరీష్‌ రావును కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా తీర్మాన పత్రాలను మంత్రి హరీష్‌ రావు గారికి అందజేశారు. తమ గ్రామాలను అభివృద్ధి చేస్తూ.. తమ కుల సంఘాల బాగు కోసం ఆలోచించే మంత్రి హరీష్‌ రావు వైపే, బీఆర్‌ఎస్‌ పార్టీ వైపే ఉంటామని అంటూన్నారుఈ ఏకగ్రీవ తీర్మానాల పరంపర కొనసాగుతునే ఉంది.. అందరం ఒకే మాట.. ఒకే బాట అంటూ మేమంతా బీఆర్‌ఎస్‌ తోనే, మంత్రి హరీష్‌ రావుతోనే.. అంటున్నారు పలు గ్రామాల ప్రజలు. ఇలా ఏకగ్రీవ తీర్మాణాలు చేస్తున్న ప్రజలను చూసి మంత్రి హరీష్‌ రావు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘విూరు చూపించే అభిమానం, ఆప్యాయత తనపై మరింత బాధ్యత పెంచుతుంది. సిద్దిపేట ప్రజలే నా కుటుంబం. వారికోసం మరింత శ్రమిస్తాను.’ అని చెప్పారు మంత్రి హరీష్‌ రావు. ఇలా సిద్దిపేట నియోజక వర్గంలో ఏకగ్రీవ తీర్మానాల పర్వం మరోసారి మొదలైంది. సిద్దిపేట ప్రజల ఆదరణ.. ఆప్యాయతను గుండెల్లో పెట్టుకుంటానని మంత్రి హరీష్‌ రావు చెప్పారు. ఏకతాటి పై వచ్చి ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం అనేది అభివృద్ధి.. బిఆర్‌ఎస్‌ పార్టీపై నమ్మకానికి నిదర్శనమన్నారు మంత్రి హరీష్‌ రావు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *