కరోనా వైరస్‌ జీవాయుధమే

ప్రపంచమంతా కరోనా వైరస్‌ ధాటికి అల్లాడిపోడానికి కారణం చైనానే అన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కరోనా పేరు చెబితే వణికిపోతున్నారు ప్రజలు. కానీ.. ఇది సహజంగా పుట్టిందా ? లేక కావాలని తయారు చేసి బయటికి పంపారా ? అన్న సందేహాలు ఇంకా నివృత్తి కాలేదు. కొందరు సహజంగా వచ్చిందంటే.. కొందరు మాత్రం మానవ సృష్టి అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వుహాన్‌ శాస్త్రవేత్త కరోనా పుట్టుకపై చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి.గబ్బిలాల నుంచి వచ్చిందని కొందరు.. కాదు కాదు.. చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చిందని మరికొందరు వాదిస్తుంటారు. అమెరికా మాత్రం రెండో వాదనకే కట్టుబడి ఉంది. ఆ క్రమంలో.. అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్టెమంట్‌ ఓ రిపోర్టులో… వైరస్‌ వచ్చింది చైనా లోని ల్యాబ్‌ లీక్‌ ఐందని రాసుకొచ్చింది. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ లోనే పురుడు పోసుకుందని వైరాలజీ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకుడు చావోషావ్‌ వెల్లడిరచాడు. ఇంటర్నేషనల్‌ ప్రెస్‌ అసోసియేషన్‌ సభ్యురాలు, హక్కుల కార్యకర్త జెన్నిఫర్‌ రెaంగ్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చావోషావ్‌ ఈ విషయాన్ని చెప్పాడు. తమ పై అధికారి ఒకరు తమకు నాలుగు రకాల కరోనా వైరస్‌ లను ఇచ్చి వాటిలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే దానిని గుర్తించాలని ఆదేశించారని తెలిపాడు. 2019లో వుహాన్‌లో జరిగిన మిలిటరీ వరల్డ్‌ గేమ్స్‌ సమయంలో తమ సహచరులు చాలామంది అదృశ్యమయ్యారన్న షావో.. క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో వారి ఆరోగ్యం, అక్కడి పరిశుభ్రతను చెక్‌ చేసేందుకు వారిని పంపినట్లుగా తర్వాత తెలిసిందన్నారు. కరోనా వైరస్‌ జీవాయుధమని, దానిని ఉద్దేశపూర్వకంగానే సృష్టించినట్లు తేల్చేశారు. ఆ ప్రాంతంపై ఏమన్నారంటే.. నిజానికి మిలిటరీ వరల్డ్‌ గేమ్స్‌ సమయంలో చెకింగ్‌ కు వెళ్లేందుకు వైద్యులు సరిపోతారు. కానీ.. వైరాలజిస్టులను పంపినపుడే తనకు అనుమానం వచ్చిందన్నారు. వైరస్‌ ను వ్యాప్తి చేసేందుకే పంపి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఏడాది జింగ్‌జియాంగ్‌లోని రీ ఎడ్యుకేషన్‌ శిబిరాల్లో ఉన్న వుయిగర్ల ఆరోగ్యాన్ని పరీక్షించాలంటూ వైరాలజిస్టులను పంపడంతో తన అనుమానం మరింత బలపడిరదన్నారు. వైరస్‌ ను వ్యాపింపజేయడం లేదా మానవులపై వైరస్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకే పంపి ఉంటారని షావో అభిప్రాయపడ్డారు. షావో చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయిఏప్రిల్‌ 2020లో షావోను అధికారులు జింజియాంగ్‌ పంపి అక్కడి రీ`ఎడ్యుకేషన్‌ శిబిరాలలో ఉన్న వుయిగర్ల(ముస్లింలలో ఒక వర్గం) ఆరోగ్యాన్ని పరీక్షించాలని కోరారు. వైరస్‌ను తనతో వ్యాపింపజేయడమో లేదంటే మానవులపై వైరస్‌ ఎలా పనిచేస్తున్నదో తెలుసుకునేందుకో తనను అక్కడికి పంపి ఉంటారని షావో వివరించారు.మరో వైపు రోనా ఇన్ఫెక్షన్‌ కు బ్లడ్‌ గ్రూపులు కూడా కారణమవుతాయని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడిరచింది. కొవిడ్‌`19కి కారణమయ్యే సార్స్‌`కోవ్‌`2 అనే వైరస్‌ వల్ల పలు బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారికి అధిక ఇన్ఫెక్షన్‌ వ్యాపించే అవకాశం ఉందని తెలిపింది. ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకే ఛాన్స్‌ ఎక్కువని తేల్చింది. ఓ బ్లడ్‌ గ్రూపు ఉన్నవారికి ఈ ప్రమాదం కొంత తక్కువేనని ప్రకటించింది.వైరస్‌ నివారణలో భాగంగా చైనా కరోనా బాధితుల శరీరంలో చోటుచేసుకున్న ప్రతి అంశాన్ని అధ్యయనం నిశితంగా పరిశీలించింది. ఈ సందర్భంగా ఉహాన్‌, షెంజహెన్‌ నగరాల్లో చికిత్స పొందుతున్న 2000 మంది కరోనా బాధితుల రక్త నమూనాలు సేకరించింది. వాటితోపాటు ఆయా నగరాల్లో వైరస్‌ సోకకుండా ఆరోగ్యం ఉన్న వ్యక్తుల రక్త నమూనాలను కూడా తీసుకుంది. ఈ సందర్భంగా ‘ఓ’ గ్రూప్‌ వ్యక్తులు కరోనా వైరస్‌ను ఎదుర్కోగలుగుతున్నారని తెలుసుకున్నారు. ‘ఏ’ బ్లడ్‌ గ్రూప్‌ కలిగిన వ్యక్తుల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. తమకు వచ్చిన బాధితుల్లో ఎక్కువ మంది ‘ఏ’ బ్లడ్‌ గ్రూప్‌ కలిగినవాళ్లే ఉన్నారని తెలిపారు. వీరికి ఇన్ఫెక్షన్‌ వేగంగా సోకడమే కాకుండా తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.బ్లడ్‌ గ్రూప్‌ ఓ కణాలతో పోల్చినప్పుడు బ్లడ్‌ గ్రూప్‌ ఏ కణాలు సార్స్‌`కోవ్‌`2 బారిన పడే అవకాశం ఉందని డాక్లర్లు కూడా చెబుతున్నారు. కరోనా వేరియంట్లు సోకడానికి కూడా వీరికే ఎక్కువ అవకాశముందని అంటున్నారు. ఓ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారితో పోలిస్తే ఏ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారికి కరోనా ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం 20 శాతం ఎక్కువని ఈ అధ్యయనం తెలిపింది. అలా అని ఓ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వారికి వ్యాధి సోకదనేం కాదు. వారికి కూడా వ్యాపిస్తుంది. కాకపోతే ఏ బ్లడ్‌ గ్రూప్‌ వారితో పోలిస్తే కాస్త తక్కువ. దీన్ని నివారించేందుకు కరోనా టీకా, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *