కడపలో సునీత పోస్టర్ల కలకలం

కడపలో వైఎస్‌ సునీత పోస్టర్లు కలకలం రేపాయి. వివేకా కుమార్తె సునీతా రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటూ ప్రొద్దుటూరులో పోస్టర్లు అంటించారు.రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతకు స్వాగతం పలుకుతున్నామంటూ వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం తెల్లవారుజామున ప్రత్యక్షమైన గోడపత్రాలు కలకలం రేపాయి. వీటిని ఎవరు అంటించారనే వివరాలు అందులో లేకపోవడంతో రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి.గోడలకు అంటించిన పోస్టర్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, లోకేశ్‌, శ్రీనివాసరెడ్డి, బీటెక్‌ రవి సహా మాజీ మంత్రి వివేకానందరెడ్డి, సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చిత్రాలు ముద్రించి పలుచోట్ల అంటించారు.తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని పోరాడుతున్న సునీత తెదేపాలో చేరుతున్నారని ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో సునీతకు టీడీపీ నుంచి నైతికంగా మద్దతు ఇస్తున్నట్లు ప్రచారంలో ఉంది. వివేకా హత్య తర్వాత సునీతా రెడ్డి తన కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించకపోవడంతో సిబిఐ దర్యాప్తు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.మరోవైపు సిబిఐ దర్యాప్తుకు రకరకాల అటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో సునీత కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా హైకోర్టు, సుప్రీం కోర్టులలో న్యాయపోరాటం చేస్తున్నారు. సునీత తరపున లీగల్‌ ఫైట్‌ కారణంగానే సిబిఐ దర్యాప్తులో వేగం పెరిగింది. కేసును నీరుగార్చేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నా వాటిని ఎప్పటికప్పుడు సునీత అడ్డుకుంటున్నారు.ఈ క్రమంలో సునీత టీడీపీలో చేరుతున్నారంటూ కడపలో పోస్టర్లు అంటించడం ఎవరి పని అనే చర్చ మొదలైంది. సునీత రాజకీయాల్లోకి వస్తారని గత కొద్ది నెలలుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రొద్దుటూరులో అంటించిన వాల్‌ పోస్టర్లతో టీడీపీకు సంబంధం లేదని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ పోస్టర్ల ప్రచారానికి దిగి ఉంటుందని ఆరోపించారు.మరోవైపు పోస్టర్ల వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పందించాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. సునీతపై దురాలోచనతో గోడపత్రాలు అంటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు.కడపలో పోస్టర్లు అంటించడానికి కారణమై?న బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అదనపు ఎస్పీ ప్రేరణకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి గోడపత్రాలు అంటించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీల్లో నిక్షిప్తమైనట్లు గుర్తించిన పోలీసులు వారు ఎవరన్నది ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించి విచారించే ప్రయత్నంచ ?స్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *