01 వంగవీటి రాధా కోసం కమలం వ్యూహాలు
విజయవాడ, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
ఉత్తరాదిలో ఒక వెలుగు వెలుగుతున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో కూడా స్థానం సంపాదించుకోడానికి చేయని ప్రయత్నం లేదు. పన్నని వ్యూహం లేదు. ఉత్తరాది నేతల చేతుల్లో ఉండే పార్టీగా పేరు పడిన బీజేపీ దక్షిణాదిలో ఒక్క కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉంది. తెలంగాణలో పాగా వేసేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు తరచూ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని వివిధ నగరాలు ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్‌ లో బీజేపీ ఉనికే నామమాత్రం అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా బీజేపీ నేతలు ఏపీని కూడా ఎలాగైనా చిక్కించుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రేశ్‌ ను అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీని విభజిత ఏపీ ప్రజలు నిట్ట నిలువునా పాతేశారు. అలాగే ఏపీ విభజనకు తోడ్పడి, ఆ తరువాత రాష్ట్రానికి రావలసిన విభజన హావిూలకు ఎగనామం పెట్టిన బీజేపీ అన్నా కూడా ఆంధ్ర ప్రజలలో ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అందుకే బీజేపీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఏపీలో విజయం సాధించిన దాఖలాలు దాదాపు మృగ్యం. గతంలో కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టినా బీజేపీకి ఏవిూ ఒరగలేదు. తర్వాత అదే సామాజికవర్గానికే చెందిన సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించినా బీజేపీ పెద్దల పాచిక పారలేదు. ఎన్ని రకాల పిల్లి మొగ్గలు వేసినా బీజేపీ ఆటలు ఏపీలో అరటిపండు మాదిరిగానే మిగిలిపోయాయి(ఆటలో అరటి పండు). ఈ నేపథ్యంలోనే బీజేపీ మరో కొత్త వ్యూహానికి పదును పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలు, తరగతుల్లోని నాయకులకు తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో ఎన్నికల ఏదో ఒక మేరకు ప్రభావితం చేయగల కాపు సామాజికవర్గం ఓట్లను వచ్చే ఎన్నికల నాటికి అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వివిధ మార్గాల్లో యత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే కాపు సామాజికవర్గంలో బలీయమైన మద్దతు ఉన్న వంగవీటి రాధాకు తాము అనుకూలమనే సంకేతాలు బీజేపీ నేతలు పంపుతున్నారు. దివంగత కాపు నేత వంగవీటి రంగా కుమారుడిగా రాధాకు ఆ సామాజికవర్గంలో మంచి పలుకుబడి ఉందనేది నిస్సందేహం. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధా అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీలో చేరి, అదే పార్టీలో కొనసాగుతున్నారు.టీడీపీలో వంగవీటి రాధా ఉన్నప్పటికీ ఆయనకు సరైన గుర్తింపు లేదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో అప్పుడప్పుడు వినవస్తుంటాయి. టీడీపీలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి తనకు ఉన్నట్లు ఏనాడూ రాధా స్వయంగా బయటికి చెప్పలేదు. అయినప్పటికీ వంగవీటి రాధాను తమ వైపు తిప్పుకుని కాపు సామాజికవర్గం ఓట్లను రాబట్టుకోవాలనే యోచనతో బీజేపీ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడ రాజకీయ వర్గాల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.‘వంగవీటి రాధా ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కష్టం. టీడీపీలో ఉన్నానని రాధా చెబుతున్నా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్‌ వస్తుందనే గ్యారంటీ లేదు. అందుకే రాధా మా పార్టీలోకి వస్తే.. ఆయన భవిష్యత్తు బాగుంటుంది’ అని విజయవాడలోని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీ ఏపీ చీఫ్‌ సోము వీర్రాజు కూడా రాధా ప్రొఫైల్‌ గురించి వాకబు చేసినట్లు చెబుతున్నారు. రాధాయే గనుక బీజేపీలోకి వస్తే.. ఆయన కోరుకున్న స్థానంలో పార్టీ టిక్కెట్‌ ఇప్పించే బాధ్యత సోము వీర్రాజు తీసుకున్నారంటున్నారు. ఈ విషయమే రాధాకు ఏదో ఒక విధంగా చేరవేసి, ఆయనను బీజేపీలో చేర్చుకునే యత్నాలు మొదలయ్యాయని సమాచారం. బీజేపీ యత్నాలు సఫలమై, ఆ పార్టీలో రాధా చేరితే.. ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండబోతోందో చూడాలి మరి.
RRRRRRRRRRRRRRRRRR
02 టీచర్లకు ఇబ్బందిగా మారిన ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌
విజయవాడ, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
సెప్టెంబర్‌ 1న మిలియన్‌ మార్చ్‌ పేరుతో ఏపీలోని సీపీఎస్‌ ఉద్యోగులు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు ఉద్యోగ సంఘాల్లోని పలువురు టీచర్లు సిద్ధం అవుతున్నారు. అయితే టీచర్ల హాజరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ వారిని ఇరుకున పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఆందోళనల్లో పాల్గొనే టీచర్లను గుర్తు పట్టే ప్రయత్నాల్లో నిఘా వర్గాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అటు తాము ప్రతిపాదించిన జీపీఎస్‌ విధానంలో మార్పు చేర్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే మంత్రి బొత్స ప్రకటించారు. ఓపీఎస్‌ విధానంలోనూ కొంత మేర తగ్గడానికి ఉద్యోగులు అంగీకరించారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 95 శాతం హావిూలను మేర నెరవేర్చిందని.. నెరవేర్చని 5 శాతం హవిూలల్లో సీపీఎస్‌ రద్దు అంశం ఒకటి అని తెలిపారు.అటు విజయవాడలో సెప్టెంబర్‌ 1న తలపెట్టిన మిలీనియం మార్చ్‌పై నెల్లూరులోని యూటీఎఫ్‌ కార్యాలయంలో నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బాబురెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబురెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హావిూనే నెరవేర్చాలని తాము కోరుతున్నామని.. పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులకు పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామన్నారు. సీపీఎస్‌ వల్ల ఉద్యోగులకు చాలా నష్టం కలుగుతుందన్నారు. రాజస్థాన్‌ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు సీపీఎస్‌ స్థానంలో ఓపీఎస్‌ను అమలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపులకు పోకుండా ఇప్పటికైనా ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRR
03 రామిరెడ్డి ఫ్యామిలీలో లుకలుకలు
కర్నూలు, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
కాటసాని రామిరెడ్డి. బనగానపల్లి ఎమ్మెల్యే. ఇక్కడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీఆర్పీ నుంచి ఒకసారి.. 2019లో వైసీపీ నుంచి శాసనసభ్యుడయ్యారు రామిరెడ్డి. మరో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి తమ్ముడు. గతంలోనే ఇద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు వచ్చాయి. ఒకరు కాంగ్రెస్‌లో మరొకరు టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ వైసీపీలోనే కొనసాగుతున్నా.. రామిరెడ్డి కుటుంబంలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి.రామిరెడ్డి అన్న కుమారుడు కాటసాని రమాకాంత్‌ రెడ్డి అవుకు మండలం గుండ్ల సింగవరం సర్పంచ్‌ గా వున్నారు. ఈ మధ్య రమాకాంత్‌ రెడ్డి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టింగ్‌ పెట్టారు. వైసీపీ కి గుడ్‌ బై?. సారి సీఎం జగన్‌ అంటూ ఆయన కామెంట్స్‌ చేశారు. త్వరలో మరో పార్టీలో చేరేందుకు నిర్ణయించారట. త్వరలోనే మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేస్తారట. గుర్తింపు ఉన్న మరో పార్టీలో చేరితే తన వాణి బాగా వినిపించవచ్చనే నిర్ణయానికి వచ్చారట రమాకాంతరెడ్డి. కాటసాని కుటుంబంలో గొర్లగుట్ట వద్ద ఏడుగురిని ఒకేసారి హత్య చేసిన తర్వాత.. రమాకాంత్‌ రెడ్డి తండ్రి కాటసాని శివరామిరెడ్డి బాధ్యతలు భుజాన వేసుకొని ఫ్యాక్షన్‌ గొడవలకు బలయ్యారు. ఇపుడు తనకు రాజకీయ ఎదుగుదల లేకుండా చేశారనే అసంతృప్తిలో రమాకాంత్‌ రెడ్డి ఉన్నారట. కాటసాని రామిరెడ్డి ప్రస్తుతం తన కుమారుడు ఓబులరెడ్డిని ప్రోజెక్ట్‌ చేస్తున్నారని, ఇలాగైతే తాము ఎప్పుడు ఎదుగుతామనే అభిప్రాయంతో ఉన్నారట.కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి కూడా వైసీపీ కి గుడ్‌బై చెప్పేసారు. గతంలో మల్లికార్జున రెడ్డి తండ్రి టీడీపీలో వున్నారు. కాటసాని రామిరెడ్డి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన తరువాత మల్లికార్జున రెడ్డి ఇటొచ్చారు. చాలా కాలంగా రామిరెడ్డితో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారట. సొంత కుటుంబ సభ్యులకు ప్రయారిటీ ఇస్తూ.. తనకంటే జూనియర్లకు పదవులు కట్టబెడుతున్నారని.. అలాంటప్పుడు వైసీపీలో ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తూ వెళ్లిపోయారట. కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్‌ రెడ్డి , నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.రమాకాంత్‌ రెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యుల ద్వారా ఎమ్మెల్యే రామిరెడ్డి మంతనాలు చేస్తున్నారట. కానీ రమాకాంత్‌రెడ్డి ఒప్పుకోవడం లేదట. మొత్తానికి వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు దూరం కావడం హాట్‌ టాపిక్‌ అయింది. మరి.. పార్టీ పెద్దలు సమస్య గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపడతారో లేదో చూడాలి.
RRRRRRRRRRRRRRRRRRRRR
04 మార్కెట్లో కొత్త రకం మామిడండి…
ఒంగోలు, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
పునారస్‌ మామిడికి ప్రస్తుతం గిరాకీ వచ్చింది. మామిడి వేసవి సీజన్‌ పూర్తయిన తరువాత వచ్చే మామిడికాయల రకం ఈ పునారస్‌.. గతంలో కొద్దిగా వచ్చే ఈ కాయలకు గిరాకీ ఉండడంతో ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా ఈ చెట్లను అధికంగా నాటారు. దీని కారణంగా ప్రస్తుతం ఈ సీజన్‌లో పునారస్‌ మామిడి కాయలు అధికంగా వచ్చాయి. ఉలవపాడు మార్కెట్‌ నుంచి ఈ కాయలు ప్రస్తుతం భారీగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఉలవపాడు కేంద్రంగా వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు ఇక్కడకు వస్తారు.ఇక్కడ ఉన్న దళారులు రైతుల నుంచి కాయలను కొనుగోలు చేసి మార్కెట్‌లో తూకం వేసి బస్తాలు, ట్రేలలో లారీలు, మినీ ట్రక్కులు, ఆటోల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేస్తారు. ఈ ఏడాది మార్కెట్‌లో దాదాపు 10 కేంద్రాల నుంచి కాయల ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా తమిళనాడు, కేరళకు ఈ మామిడికాయలు తరలివెళ్తాయి. పచ్చళ్లకు అధికంగా ఈ కాయలను వినియోగిస్తారు. ఈ ఏడాది రేటు కూడా కాస్త అధికంగానే ఉంది. ఈ వేసవిలో మామిడి కాయలకు పండు ఈగ సోకి కాయల్లో పురుగులు రావడంతో రైతులు నష్టపోయారు. ఈ సమయంలో పునారస్‌ చెట్లు ఉన్న రైతులు ఈ ఏడాది రేటు అధికంగా ఉండడంతో ఊరట ఇచ్చినట్టయింది. నాలుగేళ్ల క్రితం నుంచి పోలిస్తే ఈ ఏడాది పునారస్‌ మామిడి కాయల ఎగుమతులు భారీగా పెరిగాయి. రైతులు సీజన్‌ కాని సమయంలో వస్తున్న కాయలు కావడంతో ఇటీవల కాలంలో ఎక్కువగా సాగు చేశారు. ఉలవపాడు ప్రాంతంలో దాదాపు 4000 ఎకరాలకు పైగా ఈ తోటలు ఉన్నాయి. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 8 వేక ఎకరాల్లో పునారస్‌ తోటలు ఉన్నట్లు సమాచారం. కానీ ప్రతి ఏడాదికి వీటి సాగు శాతం పెరుగుతుంది. ఈ ఏడాది గత నెల నుంచి రోజుకు సుమారు 50 నుంచి 80 టన్నుల కాయలు ఎగుమతులు చేస్తున్నారు. ఈ ఏడాది కేజీ 40 నుంచి రూ.50 వరకు పునారస్‌ మామిడి రేటు పలుకుతుంది. గతంలో 25 నుంచి చిన్నగా పెరుగుతూ చివరి దశలో రూ.50కు చేరుకునేది. ఈ సారిమాత్రం రూ.40 నుంచి రూ.50 మధ్యనే ఎగుమతులు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ మామిడికాయలు చెన్నై, తిరువనంతపురం, కోయంబేడు, కోయంబత్తూరుకు తరలివెళుతున్నాయి. రోజుకు సుమారు 30 నుంచి 50 లక్షల మధ్య ఉలవపాడు మార్కెట్‌లో వ్యాపారం జరుగుతుంది. కేరళలో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వచ్చే నెల 8 వరకు జరిగే ఓనమ్‌ పండుగకు ఉలవపాడు పునారస్‌ కాయలు ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అక్కడ పెట్టే పచ్చడికి దీనిని ఉపయోగిస్తారు. ఈ సమయంలో అంటే సెప్టెంబరులో ఇంకా భారీగా రేట్లు పెరుగుతాయి. ఇక్కడ నుంచి ఓనమ్‌ పండుగకు ప్రత్యేకంగా గ్రేడ్‌ చేసిన కాయలను తరలిస్తారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRR
05 ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధార్‌
విజయవాడ, ఆగస్టు30, (న్యూస్‌ పల్స్‌)
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ రానుంది. ఈ ప్రక్రియను త్వరలో ప్రారంభించడానికి వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేపట్టడానికి ఏరియా, జిల్లా, బోధన ఆస్పత్రులకు ట్యాబ్‌లు, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌లను సమకూర్చారు. ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలకు బర్త్‌ రిజిస్ట్రేషన్‌ తరహాలోనే శిశు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చేపట్టనున్నారు.ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌లకు యూఐడీఏఐ ఓ పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌పై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ మొదలవుతుంది.యూఐడీఏఐ ఐదేళ్ల లోపు పిల్లలకు నీలిరంగులో తాత్కాలిక ఆధార్‌ను జారీ చేస్తుంది. ఇందుకు శిశువుల బయోమెట్రిక్‌ డేటాతో పనిలేదు. పిల్లల ఫొటో, తల్లిదండ్రుల పేరు, చిరునామా, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ తదితర వివరాల ఆధారంగా శిశువుకు తాత్కాలిక ఆధార్‌ జారీ చేస్తారు.
RRRRRRRRRRRRRRRRRRR
06 గుంటూరులో పరాకాష్టకు చేరిన పోరు
మౌనంగా అధిష్టానం
గుంటూరు, ఆగస్టు30, (న్యూస్‌ పల్స్‌)
సొంతపార్టీలో వర్గపోరును కంట్రోల్‌ చేయాలంటే ఏ పార్టీకైనా కష్టమైనా పనే. ఓ వర్గానికి మద్దతు ఇస్తే.. మరో వర్గం అలకబూనితే పార్టీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఒక్కోసారి హైకమాండ్‌ కూడా మౌనం వహిస్తుంది. అదే పోరు తీవ్ర స్థాయికి చేరితే హైకమాండ్‌ ఎంటర్‌ అవ్వాల్సి వస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని అధికారపార్టీలో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న వర్గపోరు హైకమాండ్‌ కు తలనొప్పిగా మరిందంటున్నారు ఆజిల్లా నేతలు.. ఇంతకీ ఆ ఇద్దరు నేతల్లో హైకమాండ్‌ మద్దతు ఎవరికుంది.. ఈవర్గపోరు నేపథ్యంలో అధిష్టానం వ్యూహామేంటి..గుంటూరు జిల్లా తాడికొండ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సొంత నేతల మధ్య తగాదా రోజురోజుకీ హీటెక్కిపోతోంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వర్గాలు సై అంటే సై అంటున్నాయి. తాడికొండ నీదా నాదా? అనే రేంజ్‌లో ఇరు వర్గాలు రోడ్డెక్కాయి. ఎమ్యెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వర్గీయులు పోటాపోటీ నిరసనలతో స్థానికంగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తాడికొండ నియోజకవర్గంలో డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ను అడినషనల్‌ కోఆర్డినేటర్‌గా నియమించడంపై ఉండవల్లి శ్రీదేవి వర్గం భగ్గుమంటోంది. మాణిక్యవరప్రసాద్‌ కు వ్యతిరేకంగా ఉండవల్లి శ్రీదేవి గ్రూప్‌ తాడికొండలో భారీ ర్యాలీ నిర్వహించింది. శ్రీదేవి వర్గీయులు ర్యాలీ ప్రారంభించే సమయంలో ఒక్కసారిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వర్గం ఎంట్రీ ఇచ్చింది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ కు మద్దతుగా.. ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో తాడికొండలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కారణంగా తాడికొండలో వైసీపీ నష్టపోయే ప్రమాదం ఏర్పడుతోందంటున్నారు శ్రీదేవి అనుచరులు. తమకు సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్ట్‌ ఉందని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఉండవల్లి శ్రీదేవి వల్ల తాడికొండలో అరాచకం జరుగుతోందంటున్నారు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అనుచరులు. మూడున్నరేళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని, డొక్కా నాయకత్వంలో డెవలప్‌మెంట్‌ జరుగుతోందంటున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన అధికార పార్టీ కార్యకర్తలు, చివరికి కొట్టుకునేవరకు వెళ్తున్నారు. ఇరువర్గాలు కూడా తగ్గేదేలే అంటున్నారు. శ్రీదేవి వర్గం రోడ్లపైకి వస్తే, డొక్కా వర్గం కూడా రోడ్లపైకి వస్తోంది. వాళ్లు ప్రెస్‌విూట్‌ పెడితే, వీళ్లూ పెడుతున్నారు. ఇలా తాడికొండ నియోజకవర్గం మొత్తం డొక్కా మాణిక్యవరప్రసాద్‌, శ్రీదేవి వర్గాల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ఈవర్గపోరు అధిష్టానానికి పెద్ద సమస్యగా మారిందంటున్నారు జిల్లా నేతలు.
RRRRRRRRRRRRRRRRRRR
07 గందరగోళంలో పోలవరం
ఏలూరు, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గందర గోళంలో పడిరది. ప్రాజెక్టును ఎప్పటికి పూర్తిచేస్తామో చెప్పలేమని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పదే పదే చెబుతున్నారు. ప్రతిపక్షనాయకుడి హోదాలో జగన్‌ ఇచ్చిన హావిూలకు, ప్రస్తుతం సీఎంగా ఆయన మాటలకు పొంతన లేకుండా పోయింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అప్పట్లో జగన్‌ చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్నదానికి ఏమాత్రం పొంతన లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ఇంత ఆలస్యమా అని నిందించారు. అంచనాలు పెంచేశారని ఆగ్రహించారు. నిర్వాసితుల ముఖాల్లో ఆనందం చూసేందుకు వారి డిమాండ్లు నెరవేర్చలేరా అని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడలేరా? అని నిలదీశారు.అలాంటి జగన్‌ తన మాట ఇప్పుడు మార్చేశారు. కాడి కింద పడేశారు. మడమ తిప్పేశారు, మాట తప్పేశారు. ఇదంతా నేను ఒక్కణ్ణ్ని చేసేది కాదు కదా కేంద్రాన్ని అడుగుతా.. ఒత్తిడి చేస్తా.. వాళ్లు నిధులిస్తే విూకు అందిస్తా.. లేకపోతే నేనేం చేయగలను అని బేలగా ప్రకటించి చేతులెత్తేశారు. అధికారంలోకి రాగానే పోలవరం అవినీతిని తేల్చేస్తానంటూ ఓ కమిటీని జగన్‌ నియమించారు. ఆ కమిటీ రేపో మాపో అవినీతి వరద లోతుల్ని తేల్చేస్తుందని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. కమిటీ నివేదిక ఇచ్చినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.జగన్‌ అధికారంలోకి రాగానే పోలవరం పనులను ఆపేశారు. 2019 నవంబరులో రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో గుత్తేదారును మార్చి, మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీకి పనులు అప్పగించారు. ఆ తర్వాతైనా పోలవరం పనులు వేగం పుంజుకున్నాయా? అంటే అదీ లేదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయలేదు. దీంతో 2019, 2020లలో డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట భారీగా ఇసుక కోత ఏర్పడి ప్రాజెక్టు భవితవ్యానికి పెను సవాల్‌ విసిరింది.పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసంపైనా జగన్‌ ఆడిన మాట తప్పారు. పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన వారికి రూ.5 లక్షలు ఇస్తామని నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ఇప్పటికీ ఆ ప్రకటనకు అతీగతీ లేదు. పునరావాస ప్యాకేజీ రూ. 10 లక్షలకు పెంచుతామని ప్రతిపక్ష నేతగా జగన్‌ హావిూ ఇచ్చారు. ప్రస్తుతం గరిష్ఠంగా ఎస్టీలకు రూ.6.86 లక్షలు ఇస్తున్నారు. గిరిజనేతరులకు రూ.6.36 లక్షలే ఇస్తున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై రకరకాల గడువులు చెప్పారు. 2021 డిసెంబర్‌ నాటికి పూర్తిచేస్తామని తొలుత ప్రకటించారు. ఆనక 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం పూర్తిచేసి నీళ్లిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ మాటలన్నీ నీటిమూటలయ్యాయి.పోలవరం ప్రాజెక్టుపై జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేశారు. ప్రాజెక్టు పూర్తిచేస్తామని రెండేళ్లుగా నమ్మించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందంటే సమస్యలు ఎవరి హయాంలో తలెత్తాయనే ప్రశ్నలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలంటే నిధులే కీలకం. ఇప్పటికీ రెండో డీపీఆర్‌ కు ఆమోదం లేదు. 2019 ఫిబ్రవరిలో 55 వేల 549 కోట్ల రూపాయలకు సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలు ఆమోదించింది. ఆ తర్వాత కేంద్రం దీన్ని రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీకి అప్పజెప్పింది. ఆ కమిటీ 47 వేల 726 కోట్ల రూపాయలకు అంచనాలు ఆమోదించింది. పోలవరం తాజా అంచనాలకు ఇంతవరకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపలేదు. కేంద్రం కొర్రీలపై కొర్రీలు వేస్తున్నా ఏపీ సర్కార్‌ పరిష్కరించుకోలేకపోతోంది. నాడు డీపీఆర్‌ ఆమోదించు కోలేకపోయారని విమర్శించిన జగన్‌ ఇప్పుడు.. ‘పోలవరం నిధులు కేంద్రం ఇవ్వడం లేదు.. మనం కిందా విూద పడుతున్నాం. వెయ్యి కోట్లో, 2 వేల కోట్లో అయితే నేనే ఇచ్చేసేవాణ్ణి. వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాలి. నేనేం చేయగలను’ అని ఎదురు ప్రశ్నిస్తుండడం గమనార్హం.ఏపీలో అన్ని ఎంపీ స్థానాల్లోనూ వైసీపీని గెలిపిస్తే.. ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రం నుంచి అన్నీ తెస్తా అని ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్‌ రాష్ట్రపతి ఎన్నిల్లోనూ, పలు కీలక బిల్లుల విషయంలో కేంద్రానికి బేషరతుగా ఎందుకు మద్దతు ఇస్తున్నారు? రాజ్యసభలో, లోక్‌ సభలో ఎందుకు మద్దతిస్తున్నారు? పోలవరం డీపీఆర్‌`2 ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి ఎందుకు చేయడం లేదు.. అనే విమర్శలు వెల్లువెత్తుతున్నా జగన్‌ స్పందించడం లేదు.పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు మూడేళ్లుగా అవస్థలు పడుతున్నాయి. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరి వరదనీరు వెనక్కి ఎగదన్ని ముంపు గ్రామాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. నిర్వాసితుల వరద కష్టాలు కళ్లారా చూసినా వరదల సమయానికి కూడా వైసీపీ ప్రభుత్వం కనీసం తొలిదశ పునరావాసం ఎందుకు పూర్తి చేయలేకపోయిందనే ప్రశ్నలు ప్రతిపక్ష టీడీపీ సంధిస్తోంది. తొలిదశలో 20 వేల 946 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 8 వేల 272 కుటుంబాలకే కల్పించింది. పునరావాస కాలనీలు ఇంకా పూర్తికాలేదు. పునరావాస ప్యాకేజీ అందలేదు. వరద ముంపును తట్టుకోలేక నిర్వాసితులు గోకవరం, జంగారెడ్డిగూడెం, చర్ల వంటి చోట్లకు వలస వెళ్లి అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. నెలకు 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకు అద్దెలు భరిస్తున్నారు. జగన్‌ చెప్పినట్లు ‘మా ముఖాల్లో ఆనందం చూడటం అంటే ఇదేనా?’ అని నిర్వాసితులు నిలదీస్తున్నారు. ఏటా వరదల ముందు అందరినీ తరలించేస్తామని మూడేళ్లుగా ప్రణాళికలు రచిస్తున్నా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
RRRRRRRRRRRRRRRR
08 మరో యాత్రకు కమలం సమాయాత్తం
తిరుపతి, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
యాత్రలు పలు రకాలు. భక్తులు దూరప్రాంతాల్లోని పెద్దపెద్ద దేవాలయ దర్శనానికి చేసే యాత్రలు, హిమాలయాలకు వెళ్లే జనం యాత్ర, అయ్యప్ప దీక్షలుపట్టి వెళ్లవారి యాత్ర. ఇప్పుడు రాజకీయపరమైన కాషాయరంగుతో కొత్తగా వినపడుతున్నది బీజేపీ యాత్ర. ఈ యాత్ర రాజకీయపరమై దండయాత్రకు కాస్తంత తక్కువ స్థాయిది. దీనికి కార్యకర్తలు, పెద్ద పెద్ద పార్టీ పతాకాలతో వీలయినన్ని రకరకాల బళ్ల విూద నాయకుని వెంట వేలంవెర్రిగా చేసే యాత్ర. దీనికి లక్ష్యం కేవలం రాజకీయ లబ్ధి. కేవలం ఆయా ప్రాంత పాలకుల విూద గొంతు చించుకోవడానికి, నినాదాలతో హోరెత్తిండం దాని లక్ష్యం.రాజకీయంగా తమ స్థిరత్వాన్ని నిరూపించుకోవడానికి, తమ సత్తాను ప్రజలకు, పాలకవర్గీయులకు గట్టిగా తెలియజేయడానికి, తమను మించినవారు వేరెవ్వరూ లభించరన్న ప్రచారం చేసుకోవడంలో ఉవ్వె త్తున భారీ ప్రచారహోరుతో చిన్నా చితకా నాయకులు ఊరేగే యాత్ర. దీనికి కేవలం తమ పార్టీ నీడలో బాగా ప్రశాంతంగా ఉండవచ్చన్న నమ్మకం కలిగించడానికి వీలయినన్ని తిట్ల దండకంతో విపక్షాలవిూద విరుచుకుపడే అవకాశం ఉంటుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి అధికారంలోకి రావడానికి బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఎలాగయినా రెండు రాష్ట్రాల సీఎంలు ప్రజాభిమానాన్ని పొందని నాయకులుగా ప్రచారం చేసి తమ పార్టీయే ప్రజాసంక్షేమాన్ని నిజంగా కోరుకుంటోందన్నది ప్రచార హోరుతో ప్రజల్ని ఆకట్టు కుంటూ అధికారంలోకి వచ్చేయాలన్న ఆకాంక్షతో బీజేపీ రెచ్చి పోయి రాజకీయ యాత్రలు చేపడుతోంది. ఏదో ఒకసమస్యను సృష్టించడమో, ఉన్నదాన్ని కాస్తంత విమర్శల కారం పూసి పాలకపక్షాన్ని మరింత విసిగెత్తించి అసహనాన్ని అనుకూలం చేసుకోవడంలో బీజేపీ నాయకుల మేధోశక్తి మరెవరికీ ఉండదు. అది వారికి వెన్నతో పెట్టినవిద్య. నిన్న మొన్నటివరకూ తెలంగాణాలో భారీ ప్రదర్శనలు, సమావేశాలతో ఊదరగొట్టారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని, పాలనా విధానాన్ని, పథకాల అమలు అన్నింటా ప్రజల్ని మోసం చేశారని ఘాటుగా విమర్శిస్తూ ప్రజల అభిమానాన్ని పొందేందుకు బీజేపీ సీనియర్‌ నాయకులు కూడా ఢల్లీి నుంచి తెలంగాణా యాత్రలు చేశారు. అక్కడ మునుగోడు ఉప ఎన్నిక లక్ష్యంతో ప్రజల్ని ఓటర్లను తమ వేపు తిప్పుకోవడానికి వేయాల్సిన వలలన్నీ పన్ని వేశారు, వేస్తున్నారు. ఇపుడు కాస్తంత సమయం తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ వేపు మరో యాత్రకు బీజేపీ సిద్ధ పడిరది. రాయలసీమ ప్రాంతంలోని పెండిరగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ మరోయాత్ర కు రాష్ట్ర బిజేపీ నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు యాత్రకు నాయకత్వం వహించనున్నారు. బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 25 చోట్ల బహి రంగ సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానా లకు వ్యతిరేకంగానూ, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నాయకులు వివరిం చను న్నారు. కేవలం తమకు దేశంలో ప్రతిపక్షం ఉండకూడదన్న యావతోనే ఇటువంటి యాత్రలతో విపక్షాలను భయాందోళనకు గురిచేయడానికి, ప్రజలను మరింత సందిగ్ధంలో పడేయడానికి పూనుకున్నారేగాని వాస్త వానికి కేంద్రంలో తమ పాలన విషయంలో తలెత్తుతున్న వ్యతిరేకతలను పట్టించుకోవడం మేలు. కానీ వారికి దక్షిణాదిన ఎలాగయినా పట్టు సాధించాలన్న లక్ష్యమే జీవిత లక్ష్యంగా మారింది.
RRRRRRRRRRRRRRRRRRRRలీలీలీ
విఘ్నాలు తొలగించే నాయకుడు వినాయకుడు
`నీలాపనిందలు పోగొట్టే వినాయక వ్రతకథ
`ఏ కార్యక్రమం చేపట్టినా తొలి పూజ గణేశుడికే
వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను హిందువులు జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వినాయక వ్రతం, పూజా విధానం ఎలా చేయాలో నా మిత్రుడు, మంథని కి చెందిన వేదపండితులుచెబుతున్నారు.
వినాయక చవితి రోజున ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి, ఇంటిని అలంకరించారు. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత..‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతిసానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’శ్లోకం: య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం అని చదవాలి. పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్దం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.పూజకు కావాల్సిన సామాగ్రిపసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.పూజా విధానం..ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరంఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమఃఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి.
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సితారామాభ్యాం నమః, నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తభూతోచ్చాటనఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే అనే మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుక వేసుకొవాలి.ప్రాణాయామం: ఓం భూః, ఓం భువః, ఓగ్‌ సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓగ్‌ సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌, ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‌అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి. సంకల్పం:మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభేశోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ణాయా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ: ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూ ద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్ధక్షిణదిగ్భాగే, ??.. నదీ సవిూపే??? ( శ్రీ శైలస్య) నివాసిత గృహే అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక, చాంద్రమానేన శ్రీ వికారినామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, (భాద్రపద) మాసే, (శుక్ల) పక్షే, (చతుర్థ్యాం) తిథి ఇందు వాసరే, శుభ నక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం, శుభతిధౌ శ్రీమాన్‌???? గోత్ర: ???.నామధేయ (వారివారి గోత్రం, పేరు చదువుకోవాలి) ధర్మపత్నీ?????? సమేతోహం సకుటుంబస్య క్షేమస్ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్హ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్ధం సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్ధం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్ధిస్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్ధం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడిచేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి.భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్‌ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజేఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవమ్‌ ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‌ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్‌ ధ్యాయేత్తం విఘ్ననాయకం.షోడశోపచార పూజధ్యాయేత్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. శ్రీ మహా గణాధిపతయే నమః ధ్యాయామిఅత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్బవ.. ఆవాహయామి:మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనంచారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం.. ఆసనం సమర్పయామి:గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం గంధ పుష్పాక్షతైర్యుతం.. ఆర్ఘ్యం సమర్పయామి:గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన.. పాద్యం సమర్పయామి:అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ, తుభ్యం దత్తంమయా ప్రభో.. ఆచమనీయం సమర్పయామి: దధిక్షీర సమాయుక్తం థామద్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోస్తుతే.. మధుపర్కం సమర్పయామి:స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత.. పంచామృత స్నానం సమర్పయామి:గంగాదిసర్వతీర్థేభ్యః ఆహృతైరమలిర్ణలైః స్నానం కురుష్వభగవానుమాపుత్ర నమోస్తుతే.. శుద్దోదక స్నానం సమర్పయామి: రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ..వస్త్రయుగ్మం సమర్పయామి:రాజితం బహ్మసూత్రంచ కాంచనం చో త్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక.. యజ్ఞోపవీతం సమర్పయామి:చంద నాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యాతాం.. గంధాన్‌ సమర్పయామి:అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాంస్తండులాన్‌ శుభాన్‌, గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే.. అక్షతాన్‌ సమర్పయామి:సుగంధాని సుపుష్పాణి జాజీకుంద ముఖానిచ ఏక వింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే.. పుష్పాణి పూజయామి:అథాంగ పూజ.. పుష్పాలతో పూజించాలి.గణేశాయ నమః ` పాదౌ పూజయామిఏకదంతాయ నమః ` గుల్ఫౌ పూజయామిశూర్పకర్ణాయ నమః ` జానునీ పూజయామివిఘ్నరాజాయ నమః ` జంఘే పూజయామిఅఖువాహనాయ నమః ` ఊరూ పూజయామిహేరంబాయ నమః ` కటిం పూజయామిలంబోదరాయ నమః ` ఉదరం పూజయామిగణనాథాయ నమః ` నాభిం పూజయామిగణేశాయ నమః ` హృదయం పూజయామిస్థూలకంఠాయ నమః ` కంఠం పూజయామిగజవక్త్రాయ నమః ` వక్త్రం పూజయామివిఘ్నహంత్రే నమః ` నేత్రం పూజయామిశూర్పకర్ణాయ నమః ` కర్ణౌ పూజయామిఫాలచంద్రాయ నమః ` లలాటం పూజయామిసర్వేశ్వరాయ నమః ` శిరః పూజయామివిఘ్నరాజాయ నమః ` సర్వాణ్యంగాని పూజయామిఏకవింశతి పత్రపూజఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి. సుముఖాయనమః ` మాచీపత్రం పూజయామి,గణాధిపాయ నమః ` బృహతీపత్రం పూజయామి?ఉమాపుత్రాయ నమః ` బిల్వపత్రం పూజయామి,గజాననాయ నమః ` దుర్వాయుగ్మం పూజయామిహరసూనవేనమః ` దత్తూరపత్రం పూజయామి,లంబోదరాయనమః ` బదరీపత్రం పూజయామి,గుహాగ్రజాయనమః ` అపామార్గపత్రం పూజయామి,గజకర్ణాయనమః ` తులసీపత్రం పూజయామి,ఏకదంతాయ నమః ` చూతపత్రం పూజయామి,వికటాయ నమః ` కరవీరపత్రం పూజయామి,భిన్నదంతాయ నమః ` విష్ణుక్రాంతపత్రం పూజయామి,వటవేనమః ` దాడివిూపత్రం పూజయామి,సర్వేశ్వరాయనమః ` దేవదారుపత్రం పూజయామి,ఫాలచంద్రాయ నమః ` మరువకపత్రం పూజయామి,హేరంబాయనమః ` సింధువారపత్రం పూజయామిశూర్పకర్ణాయనమః ` జాజీపత్రం పూజయామి,సురాగ్రజాయనమః ` గండకీపత్రం పూజయామి,ఇభవక్త్రాయనమః ` శవిూపత్రం పూజయామి,వినాయకాయ నమః ` అశ్వత్థపత్రం పూజయామి,సురసేవితాయ నమః ` అర్జునపత్రం పూజయామి,కపిలాయ నమః ` అర్కపత్రం పూజయామి,శ్రీ గణేశ్వరాయనమః ` ఏకవింశతి పత్రాణి పూజయామి.అష్టోత్తర శతనామ పూజావళిఓం గజాననాయ నమఃఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీప్తాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమఃఓం లంబజఠరాయ నమఃఓం హయగ్రీవాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాట్పతయే నమఃఓం శ్రీపతయే నమఃఓం వాక్పతయే నమఃఓం శృంగారిణే నమఃఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బల్వాన్వితాయ నమఃఓం బలోద్దతాయ నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమఃఓం భావాత్మజాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చావిూకర ప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపాస్యాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వ నేత్రే నమఃఓం నర్వసిద్దిప్రదాయ నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం కుంజరాసురభంజనాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థఫలప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం మహోదరాయ నమఃఓం మదోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళసుస్వరాయ నమఃఓం ప్రమదాయ నమఃఓం జ్యాయసే నమఃఓం యక్షికిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమఃఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం జ్యోతిషే నమఃఓం అక్రాంతపదచిత్ప్రభవే నమఃఓం అభీష్టవరదాయ నమఃఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్త రూపాయ నమఃఓం పురాణపురుషాయ నమఃఓం పూష్ణే నమఃఓం పుష్కరోత్‌ క్షిప్తహరణాయ నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అపాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యై నమఃఓం సారాయ నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం విశదాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్తదేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం బ్రహ్మవిద్యాది దానభువే నమఃఓం విష్ణువే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విష్వగ్దృశేనమఃఓం విశ్వరక్షావిధానకృతే నమఃఓం కళ్యాణగురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం పరజయినే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమఃఅగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్‌అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహేదశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ.. ధూపమాఘ్రాపయామిసాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే.. దీపందర్శయామి?సుగంధాసుకృతాంశ్చైవమోదకాన్‌ ఘృతపాచితాన్‌, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్‌, భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.. నైవేద్యం సమర్పయామి.సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్‌ స్వీకురుష్వ వినాయక.. సువర్ణపుష్పం సమర్పయామి.పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం.. తాంబూలం సమర్పయామి.ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ.. నీరాజనం సమర్పయామి.అథ దూర్వాయుగ్మ పూజా.. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి.ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి.నమస్కారం,
ప్రార్థనప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన.. ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి,అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వ భద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన.. పునరర్ఘ్యం సమర్పయామి,ఓం బ్రహ్మవినాయకాయ నమఃనమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితంమే వరం దేహి వరత్రచ పరాంగతిమ్‌.వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ.. నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా.వినాయక వ్రత కథవ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరవాత వాటిని శిరసుపై వేసుకోవాలి.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదుల వల్ల రాజ్యాన్ని, సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్య, తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది రుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి ‘రుషివర్యా, మేము రాజ్యాధికారాన్నీ సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి, పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి’ అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు… వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలూ కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు.‘ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి ‘తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది, సమస్త కోరికలూ తీరి, సకల శుభాలనూ విజయాలనూ వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి’ అని కోరాడు. అందుకు శివుడు ‘నాయనా! సర్వసంపత్కరం, ఉత్తమం, ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆరోజు ఉదయమే నిద్రలేచి, స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతోగానీ, వెండితోగానీ లేదా మట్టితోగానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను, రకమునకు ఇరవైఒకటి చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి, యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి.బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తిచేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకీ అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరిచేతా ఆచరింపబడిరది’అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే` నీ శత్రువులను జయించి సమస్త సుఖాలనూ పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే… తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడ గలిగింది. శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితోబాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పసాగాడు.పూర్వం గజముఖుడయిన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ‘స్వావిూ నువ్వు నా ఉదరమందే నివసించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడిరచమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారిjైున హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడిరచాడు.గజాసురుడు పరమానందభరితుడై ‘ఏమి కావాలో కోరుకోండి… ఇస్తాను’ అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సవిూపించి ‘ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు’ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ‘స్వావిూ, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్లాడు.తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పిచడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది. శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది. పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది.దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్లింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు….ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిరచాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీ దేవి, జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు…గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. అతడి శక్తి సామర్ధ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బందిపడుతూ కైలాసం చేరుకున్నాడు.
శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా నుజ్జవుతాయని విఘ్ననాధుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతి దేవి.. పాపాత్ముడా నీ దృష్టిసోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు.. కాబట్టి నిన్నుచూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురు గాక అని శపించింది.ఋషి పత్నులకు నీలాపనిందలుపార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తఋషులు భార్యలతో కలసి యజ్ఞం చేస్తూ, అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల విూద మోహం కలిగింది. కోరిక తీరక, శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు, వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్థుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు.తర్వాత పార్వతీదేవితో ‘అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది. కావున శాపాన్ని ఉపసంహరించుకో’ అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ‘ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు’ అని శాపాన్ని సవరించింది. ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి, సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది.శమంతకోపాఖ్యానంద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ‘స్వావిూ! ఈ రోజు వినాయక చవితి. పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు. నేను వెళ్తాను’ అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు.రోజుకు పది బారువుల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది. మణిని నోట కరచుకుని పోతూన్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు.శమంతకమణిని కొండగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషంవల్ల తన విూద నింద పడిరదనుకున్నాడు. శమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు. ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి.అలా వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి, దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది. కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు.శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు. శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు.ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో ‘విూరు సమర్థులు కనుక విూపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు. మావంటి వారికి ఏది గతి?’ అన్నారు.
‘భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి, ఆరోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు’ అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ నాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు.ఈ కథను చదివి గాని, విని గాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
RRRRRRRRRRRRRRRRRRRRRRR
రిషిసునాక్‌ పదవికి అడ్డుగోడగా జాత్యాంహకారం
విశ్లేషణ)
బ్రిటిష్‌ ప్రధాన మంత్రి ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వానికై జరుగుతున్న పోరులో మొదట్లో దూసుకుపోయిన భారత సంతతికి చెందిన అభ్యర్థి రిషి సునాక్‌ ఆ తర్వాత అనూహ్యంగా వెనుక పడిపోయారు. ఇప్పటికే లిజ్‌ ట్రస్‌ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. బహుశా మరి కొద్దీ రోజులలో ఆమె అధికారికంగా ప్రధాని పదవి చేపట్టవచ్చు. ఎన్నికలలో ఇటువంటి జయాపజయాలు అత్యంత సహజమే. అయితే రిషి సునాక్‌ వెనుకబడటానికి గల కారణాలు రాజకీయమైనవి కాకుండా, వర్ణ వ్యవస్థకు సంబంధించినవని సర్వత్రా భావిస్తున్నారు. పాశ్చాత్య సమాజంలో పేరుకుపోయిన జాత్యహంకారానికి ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయని చెప్పవచ్చు. సునాక్‌ ‘తెల్లవాడు’ కాకపోవడం కారణంగా ఆ దేశపు ప్రధాని కాలేకపోతున్నారని అనడంలో సందేహం లేదు.అధికార పార్టీ ఎంపిలలో జరిగిన వివిధ పోల్‌లలో ఆయన అందరికన్నా ముందున్నారు. లిజ్‌ ట్రస్‌ మూడవ స్థానంలో ఉన్నారు. కానీ సాధారణ పార్టీ సభ్యుల ఎంపిక విషయం వచ్చేసరికి ఆమె దూసుకుపోతున్నారు. భారత దేశం సుదీర్ఘకాలం పలు విదేశీ పాలనాలను చూసింది. మిగిలిన వారంతా ఇక్కడ సంపద దోచుకోవాలని, తమ సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని చూశారు. కానీ ప్రజలపట్ల జాత్యహంకారాన్ని కేవలం బ్రిటిష్‌ వంటి ఐరోపా దేశాల వారు మాత్రమే ప్రదర్శించారని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఆనాడు భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడానికి తిరస్కరించడానికి ప్రధాన కారణం ‘నల్లవారు‘ పరిపాలన చేసుకోలేరని, తాము లేకపోతే ముక్కలుగా చెల్లాచెదురైపోతారనే దురహంకార భావన. తమ మాట సాగాలని పోతూపోతూ దేశాన్ని ముక్కలు చేసి, పలు వేర్పాటు కుంపట్లు పేర్చి మరీ వెళ్లారు. రవి అస్తమించని సామ్రాజ్యం కూలిపోయినా ఇటువంటి సంకుచిత మనస్తత్వం నుండి వారింకా బైటపడలేదని ఈ ప్రధాని ఎన్నిక స్పష్టం చేస్తుంది.తెల్లవారి’ సామ్రాజ్యంగా భావించే మొత్తం పాశ్చాత్య ప్రపంచం లో నలుపు, ఆసియా లేదా మైనారిటీ జాతులవారు తెల్లవారు అత్యధికంగా ఉన్న దేశాల నేతలుగా ఎన్నికైన సందర్భాలు చాలా అరుదని ఈ సందర్భంగా గమనించాలి. ఆ విధంగా ఎన్నికైనది అమెరికాలో బరాక్‌ ఒబామా, పోర్చుగల్‌ ప్రధాన మంత్రి, గోవా సంతతికి చెందిన ఆంటోనియో కోస్టా, తండ్రి భారతీయుడైన ఐరిష్‌ మాజీ ప్రధాని లియో వరద్కర్‌ మాత్రమే కనిపిస్తారు. ఆ జాబితాలో రిషి సునాక్‌ చేరే అవకాశం ఇప్పుడు వచ్చింది. అమెరికాలో నిత్యం నల్లవారిపై అమానుష దాడులు చూస్తున్నాము. తాజాగా నలుగురు భారత సంతతికి చెందిన మహిళలపై జరిగిన దాడి చూశాము. మొదటిసారి ‘నల్లవాడు’ బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా కాగలిగినా తాను అధ్యక్ష స్థానంలో ఉంటూ కూడా పలు సందర్భాలలో ‘వర్ణ వివక్షత’కు గురయ్యానని ఆయనే వెల్లడిరచారు. ఇప్పటికీ ఆ దేశ న్యాయవ్యవస్థలో తీర్పులలో ‘వర్ణ వివక్షత’ను పరిగణనలోకి తీసుకొంటున్నట్లు ఆయనే వాపోయారు.కరోనా సమయంలో రిషి సునాక్‌ వ్యవహరించిన తీరు చూసి ఆ దేశ ప్రజలు ఎన్నో విధాలుగా ప్రశంసించారు. కాబోయే ప్రధానిగా కొనియాడారు. ప్రస్తుతం ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఇద్దరిలో సామర్ధ్యం, మేధస్సు, విషయం పరిజ్ఞానం వంటి అన్ని విషయాలలో రిషి సునాక్‌ మొదటి స్థానంలో ఉన్నారని అందరూ అంగీకరిస్తారు. సునాక్‌ వెనుకబడడానికి ఆయన పన్నులు పెంచడం, ఆయన భార్య ‘నాన్‌ ? డొమిసైల్‌’ హోదా, కేబినెట్‌ మంత్రిగా ఉంటూ కూడా గ్రీన్‌ కార్డు కలిగి ఉండడం వంటి కొన్ని కారణాలు చెబుతున్నారు. అయితే ఆయన ఏ విషయంలో కూడా ఆ దేశంలోని చట్టాలను ధిక్కరించి వ్యవహరించక పోవడం గమనార్హం. అయితే చట్టపర అంశాలకన్నా రాజకీయ అంశాలు భిన్నమైనవి అనడంలో సందేహం లేదు. భారత దేశంలో సహితం దళితుల పట్ల ఇటువంటి వివక్ష అత్యున్నత స్థాయిలలో సహితం కొనసాగడం ఈ సందర్భంగా గమనార్హం. 1977లో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మొత్తం 300 మంది ఎంపిలలో సుమారు 200 మంది (జనసంఫ్‌ు, లోక్‌దళ్‌) జగజీవన్‌ రామ్‌ పేరును ప్రధానిగా ప్రతిపాదించారు. ఆయనను ప్రధానిగా చేసుంటే ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకొనేవారు. సవిూప భవిష్యత్తులో గాంధీ కుటుంబం అధికారంలోకి రాకుండా ఆయన అడ్డుకోనేవారు. పరిపాలనా సామర్థ్యంలో ఆయన ఎవ్వరికీ తీసిపోరు. అయితే ఆయన దళితుడు కావడంతో ఆయన ప్రధాని కాలేకపోయారు. ‘అభిప్రాయ సేకరణ’ పేరుతో మొరార్జీ దేశాయ్‌ని ప్రధానిగా చేశారు. మొరార్జీ రాజీనామా తర్వాత తిరిగి జగజీవన్‌ రామ్‌కు అవకాశం వచ్చినా నాటి రాష్ట్రపతి సంజీవరెడ్డి పడనీయలేదు. దేశ చరిత్రలో మొదటిసారి ప్రధాన మంత్రి ఎవ్వరు అనే అంశంపై జరిగిన 1980 ఎన్నికలలో జగజీవన్‌ రామ్‌ కేవలం దళితుడు కావడంతో జనతా పార్టీ ఓటమి చెందింది. సవిూప భవిష్యత్‌లో ఓ దళితుడు భారత ప్రధాని కాగలరని ఊహించే పరిస్థితులు ప్రస్తుతం లేవు.రిషి సునాక్‌ తదుపరి ప్రధానమంత్రి కాకపోతే, దేశానికి ‘చెడ్డపేరు’ వస్తుందని, ‘జాత్యహంకారంగా భావించబడుతుంది’ అని ఒక ప్రముఖ కన్జర్వేటివ్‌ దాత హెచ్చరించారు. అధికార పక్షానికి 1.3 మిలియన్ల పౌండ్ల విరాళం ఇచ్చిన రామి రేంజర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.సెప్టెంబర్‌ 5న ఫలితాలు వెలువడినప్పుడు బహుశా లిజ్‌ ట్రస్‌ ప్రధానిగా కావచ్చు. ఆమెకు గట్టి పోటీ ఇచ్చిన సునాక్‌కు విదేశీ వ్యవహారాలు లేదా హోం వంటి మరో కీలక మంత్రిత్వ శాఖను ఇచ్చి సంతృప్తి పరచే ప్రయత్నం చేయవచ్చు. ప్రధాన మంత్రి పదవి తర్వాత కీలకమైన నాలుగు మంత్రిత్వ శాఖలలో ఒకటి పొందవచ్చు. ఇప్పటికే ఆర్ధిక వ్యవహారాలు పర్యవేక్షించారు. ఏదేమైనా ఓ ‘నల్లవాడు’ ను తమ దేశపు ప్రధాన మంత్రిగా అంగీకరించడానికి బ్రిటిష్‌ సమాజం ఇంకా సిద్ధంగా లేదనే స్పష్టమైన సందేశం ఈ ఎన్నికల ద్వారా వెల్లడి చేసే అవకాశం ఉంది. ఏదేమైనా, సునాక్‌ బ్రిటన్‌లోని భారతీయ సమాజాన్ని దేశంలోని అత్యున్నత పదవికి చాలా దూరం తీసుకువచ్చారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRR
09 జాతీయపార్టీ ఏర్పాటు దిశగా అడుగులు
న్యూఢల్లీి, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
దేశంలో మరో జాతీయపార్టీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్‌ రోజురోజుకు క్షిణించడం, ప్రత్యామ్నాయంగా ఏపార్టీ బలపడకపోతుండంతో.. పొలిటికల్‌ స్పేష్‌ ని ఉపయోగించుకునేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కూడా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వేగంగా ఆదిశగా అడుగులు వేయలేకపోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ మినహిస్తే దేశ వ్యాప్తంగా ప్రజలకు నోటెడ్‌ అయిన నాయకులు సంఖ్య పరిమితంగానే ఉంది. దీంతో కాంగ్రెస్‌ లో సుదీర్ఘకాలం పనిచేసి, గతంలో కేంద్రమంత్రిగా సేవలందించడంతో పాటు.. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొంది.. ఇటీవలే హస్తం పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్‌ జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. తన మనసులోని మాటను ఆయన ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తన వ్యూహంతో పాటు.. భవిష్యత్తులో తాను ఏం చేయబోతున్నాను అనేదానిపై గులాంనబీ ఆజాద్‌ క్లారిటీ ఇచ్చారు. మరోసారి కాంగ్రెస్‌ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విూనింగ్‌ లెస్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాహుల్‌ గాంధీ తీరుపై మరోసారి మండిపడ్డారు గులాంనబీ ఆజాద్‌. రాజీవ్‌ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీల పనితీరుతో రాహుల్‌ గాంధీకి ఎటువంటి పోలిక లేదన్నారు. తాను పార్టీలో ఉండటం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌ నాయకులకు ఇష్టం లేదని.. తాను పార్టీ విడిచి వెళ్లిపోవాలని వారు కోరుకున్నారని చెప్పారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని.. తాను భవిష్యత్తులో ఓ పార్టీని ఏర్పాటుచేసి.. జాతీయ స్థాయిలో విస్తరిస్తానని గులాం నబీ ఆజాద్‌ తన భవిష్యత్తు వ్యూహాన్ని వెల్లడిరచారు. జాతీయపార్టీ ఏర్పాటుకు అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని.. దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. తాను కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే వీడానని, పార్టీ మూల సిద్ధాంతాన్ని కాదని స్పష్టం చేశారు. మనిషి పేరు మార్చుకున్నంత మాత్రన.. రక్తం, రూపు రేఖలు మారవు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జమ్మూ కశ్మీర్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను ప్రారంభించే జాతీయపార్టీ కార్యకలాపాలు మొదట జమ్ము కశ్మీర్‌ లోనే మొదలవుతాయన్నారు. జమ్మూ కశ్మీర్‌ లో ఎన్నికలొస్తే ప్రచారంలో పాల్గొంటానని చెప్పడంతో వీలైనంత త్వరగా ఆయన పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో తనకు 8 రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తే 7 రాష్ట్రాల్లో గెలిచామని.. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ నాయకత్వంలో అన్ని ఓటములే అంటూ ఘాటూగా స్పందిచారు. తాను పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ బలోపేతానికి సీనియర్లతో మాట్లాడాలని ఎన్నోసార్లు రాహుల్‌ గాంధీకి సూచించానని.. తన మాటలను రాహుల్‌ గాంధీ లెక్క చేయలేదన్నారు. సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమని, ఆమె తనకు ఎంతో గౌరవం ఇచ్చేవారని, ఆప్యాయంగా ఉండేవారని గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. రాహుల్‌ గాంధీ ఏమి చేస్తున్నారో సోనియాగాంధీ పట్టించుకోలేదని గులాంనబీ ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.
RRRRRRRRRRRRRRRRRRRRR
10 మిషన్‌ మూన్‌ వాయిదా….
న్యూయార్క్‌, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
చందమామపైకి ఆర్టెమిస్‌ 1 పేరుతో అమెరికన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన మూన్‌ మిషన్‌ వివిధ కారణాల వల్ల వాయిదా పడిరది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ ప్రయోగానికి ఆటంకాలు ఎదురయ్యాయని తెలుస్తోంది. ఆర్టెమిస్‌`1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ` నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.అయితే ఈ ప్రయోగానికి ఉపయోగించే ఇంధన ట్యాంకర్‌?లో లీకేజీలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఈ కారణంగా పలుమార్లు ప్రయోగానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరిస్తూ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు నాసా తొలుత ప్రకటించింది. అయితే, చివరికి రాకెట్‌ ప్రయోగాన్ని వాయిదా వేయక తప్పలేదు. అయితే, అనుకున్న విధంగా సోమవారం(ఆగస్టు 29)న ప్రయోగం నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. తదుపరి తేదీపై త్వరలోనే స్పష్టత ఇస్తామని నాసా వెల్లడిరచింది.ఫ్లోరిడాలోని నాసా కెనెడీ అంతరిక్ష కేంద్రంలో ఇప్పటికే లాంచ్‌పాడ్‌పై రాకెట్‌ను రెడీగా ఉంచారు. పిడుగులు తాకినా రాకెట్‌కుగాని, ఓరియన్‌ క్యాప్సూల్‌కుగాని నష్టం వాటిల్లలేదని నాసా తెలిపింది. రాకెట్‌ ప్రయోగం ఇక పూర్తవుతుందని భావించిన నేపథ్యంలో రాకెట్‌?లో ఇంధనం లీక్‌ అయినట్లు గుర్తించారు. సూపర్‌ కోల్డ్‌ హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ లీక్‌ అవ్వడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేశారు. రీహార్సల్స్‌? నిర్వహించినప్పుడు ఇంధన లీకేజీ జరిగింది. ఉదయం, నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు లేదా లోపాలు గుర్తించినట్లు నాసా అధికారులు వెల్లడిరచారు. వాస్తవానికి ఈ మిషన్‌ వ్యవధి.. 42 రోజులు, 3 గంటల.. 20 నిమిషాలు పడుతుంది. 1.3 మిలియన్‌ మైళ్లు ప్రయాణిస్తుంది. అక్టోబర్‌ 10న వ్యోమనౌక కాలిఫోర్నియా తీరానికి చేరువలో ఫసిఫిక్‌ మహాసముద్రంలో పడుతుంది. ప్రయోగం తిరిగి ఎప్పుడు నిర్వహిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
11 బీచ్‌ సైడ్‌ విల్లాను కొనుగోలు చేసిన అంబానీ
ముంబై, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ దుబాయ్‌లో 80 మిలియన్ల డాలర్ల విలువ గల బీచ్‌`సైడ్‌ విల్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నగరంలోనే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్‌ అని ఒప్పందం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తెలిపారు. దుబాయ్‌ కృత్రిమ ఐలాండ్‌ అయిన పామ్‌ జుమేరా వద్ద ఉన్న ఈ ప్రాపర్టీని అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ కోసం ఈ సంవత్సరం ప్రారంభంలో కొనుగోలు చేశారు. ఇది ప్రైవేట్‌ డీల్‌ కాబట్టి వివరాలు బయటకు రానివ్వలేదు. ఈ బీచ్‌`సైడ్‌ మాన్షన్‌ పామ్‌ జుమేరా ఐలాండ్‌కు ఉత్తర భాగంలో ఉంది. 10 బెడ్‌రూమ్‌లు, ఒక ప్రైవేట్‌ స్పా, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ దీంట్లో ఉన్నాయి. అయితే ఈ ప్రాపర్టీ కొనుగోలుదారులు ఎవరో చెప్పకుండానే లగ్జరీ విల్లాకు సంబంధించిన వివరాలను స్థానిక విూడియా నివేదించింది.దీర్ఘకాల ‘‘గోల్డెన్‌ వీసాలు’’ అందించడం ద్వారా, విదేశీయులకు ఇంటి యాజమాన్యంపై పరిమితులను సడలించడం ద్వారా ధనవంతులకు దుబాయ్‌ ఇష్టమైన మార్కెట్‌గా అభివృద్ధి చెందుతోంది. బ్రిటీష్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు డేవిడ్‌ బెక్‌హామ్‌ తన భార్య విక్టోరియా, బాలీవుడ్‌ మెగాస్టార్‌ షారుక్‌ ఖాన్‌ అంబానీకి ఇరుగుపొరుగుగా అవతరించారు. వారికి కూడా అక్కడ నివాసాలు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం అంబానీకి చెందిన 93.3 బిలియన్ల డాలర్ల సంపదకు ముగ్గురు వారసులలో అనంత్‌ ఒకరు. 65 ఏళ్ల వయస్సు గల ముకేష్‌ అంబానీ ప్రపంచంలోని 11వ అత్యంత సంపన్నుడు. తన సామ్రాజ్యాన్ని గ్రీన్‌ ఎనర్జీ, టెక్‌, ఇ`కామర్స్‌లో విస్తరించిన వైవిధ్యీకరణ తర్వాత నెమ్మదిగా తన పిల్లలకు పగ్గాలను అప్పగిస్తున్నారు.కుటుంబం విదేశాల్లో తన రియల్‌ ఎస్టేట్‌ ఫుట్‌ ప్రింట్‌ను పెంచుకుంటోంది. ముకేష్‌ వారసులు రెండో ఇంటి కోసం పశ్చిమ దేశాల వైపు చూస్తున్నారని సమాచారం. గత సంవత్సరం రిలయన్స్‌ యూకేలో స్టోక్‌ పార్క్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేయడానికి 79 మిలియన్ల డాలర్లు వెచ్చించింది. ఇందులో పెద్ద కుమారుడు ఆకాష్‌ కోసం జార్జియన్‌ కాలం నాటి భవనం ఉంది. అతను ఇటీవలే టెలికాం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. అతని కవల సోదరి ఇషా న్యూయార్క్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్‌ ప్రాపర్టీ డీల్‌ రహస్యంగా ఉంది. రిలయన్స్‌కు సంబంధించినన ఆఫ్‌షోర్‌ ఎంటిటీలో ఒకటి ఈ డీల్‌ను నిర్వహిస్తుంది. అంబానీల ప్రాథమిక నివాసం ముంబయిలోని 27 అంతస్తుల ఆకాశహర్మ్యంలో మూడు హెలిప్యాడ్‌లు, 168 కార్ల పార్కింగ్‌, 50 సీట్ల సినిమా థియేటర్‌, గ్రాండ్‌ బాల్‌రూమ్‌. మ్మిది ఎలివేటర్‌లతో ఉంటుంది.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
12 గణేష్‌ మండపానికి 316 కోట్ల ఇన్సూరెన్స్‌
ముంబై, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలంటే సందడి మామూలుగా ఉండదు. మండపాల దగ్గర్నుంచి విగ్రహాల వరకు ఆ కోలాహలమే వేరు. మండపాలు, విగ్రహాల కోసం వేలు, లక్షల్లోనే కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు నిర్వాహకులు. భారీ సెట్టింగ్స్‌తో మండపాలు నిర్మించి, అత్యంత ఖరీదైన గణనాథులను ప్రతిష్టిస్తున్నారు. గణేష్‌ ఉత్సవాలకు దేశంలోనే పేరుగాంచిన ముంబైలో ఓ గణేష్‌ మండపానికి ఏకంగా 316కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్‌ చేయించారు నిర్వాహకులు. ఇదిప్పుడు టాక్‌ ఆఫ్‌ ముంబైనే కాదు, టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారింది. ముంబై కింగ్స్‌ సర్కిల్‌లోని జీఎస్‌బీ సేవా మండల్‌ ఏర్పాటుచేసిన మండపం ముంబైలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. దాంతో, మండపానికి 316కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్‌ చేయించారు. కేవలం బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు 32కోట్ల ఇన్సూరెన్స్‌ చేశారు.మిగతా 263కోట్ల రూపాయలు మండపం కోసం. పూజారులు, వాలంటీర్లు, పార్కింగ్‌, సెక్యూరిటీ, ఇతర వర్కర్స్‌ ఈ బీమా కిందకి వస్తారు. అగ్నిప్రమాదం, భూకంపం ముప్పు, ప్రకృతి విపత్తుల కోసం మరో కోటి రూపాయల ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. మండపంలోని ఫర్నిచర్‌, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఈ బీమాలోకి వస్తాయి. మండపం ఆర్గనైజింగ్‌ టీమ్‌తోపాటు గణేష్‌ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడినీ బీమా పరిధిలోకి తీసుకొచ్చారు.వినాయకచవితి మొదలైన రోజు నుంచి పదిరోజులపాటు ఈ ఇన్సూరెన్స్‌ ఉంటుందన్నారు జీఎస్‌బీ సేవా మండల్‌ నిర్వాహకులు. ఏటా ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నాం, అయితే, ఈసారి రికార్డుస్థాయిలో పెద్దమొత్తానికి బీమా చేయించామని చెబుతున్నారు. ప్రతి భక్తుడికీ భద్రత కల్పించడం తమ బాధ్యత, అందుకే, అందరికీ ఇన్సూరెన్స్‌ వర్తించేలా బీమా తీసుకున్నామంటున్నారు నిర్వాహకులు. కాగా, ఈ గణేష్‌ న్యూస్‌ నెట్టింట వైరల్‌గా మారింది.
RRRRRRRRRRRRRRRRRRRలీలీ
13 దాడి చేస్తున్న సీజనల్‌ వ్యాధులు
వరంగల్‌, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
సీజనల్‌ వ్యాధుల దాడి మళ్లీ మొదలైంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌తో పాటు ఇతర వైరల్‌ జ్వరాలు ఒకేసారి అటాక్‌ చేస్తున్నాయి. మొదట నార్మల్‌ ఫీవర్‌గానే మొదలవుతోంది. సాధారణ జ్వరమే కదా? అనుకునేలోపే విశ్వరూపం చూపిస్తోంది. హైదరాబాద్‌ను విషజ్వరాలు హడలెత్తిస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. రోగులతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటమే ఆందోళన కలిగించే అంశం!గాంధీ, ఫీవర్‌, నిలోఫర్‌ ఆసుపత్రి ఏదైనా.. పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. సీజనల్‌ వ్యాధులు నగరాన్ని పట్టిపీడిస్తున్నాయి. వాతావరణ మార్పులతో పాటు ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. గత పది రోజులుగా ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు.. అందరూ ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ, చికెన్‌ గున్యాతో ఆస్పత్రుల బాట పడుతున్నారు రోగులు. సాధారణంగా వచ్చే ఓపీల కంటే ఇప్పుడు రెట్టింపవడం ఆందోళన కలిగిస్తోంది.ఒక్క ఫీవర్‌ ఆసుపత్రిలో ఈ నెల రోజుల్లో 160 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 12 వందలకు పైగా ఓపీలు నమోదవుతున్నాయి. నగరంలో ఉన్న మిగతా.. ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అంటే సీజనల్‌ వ్యాధుల ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా ఆస్పత్రుల్లో ఇన్‌ పేషేంట్లతో జనరల్‌ వార్డ్‌ పూర్తిగా నిండి పోయింది. పేషెంట్లకు బెడ్లు సరిపోవడం లేదు. ఇతర వార్డుల్లోనూ, లేదంటే ఒకే బెడ్‌ విూద ఇద్దరిని ఉంచి ట్రీట్మెంట్‌ చేయాల్సిన పరిస్థితలులు ఏర్పడుతున్నాయి.సీజనల్‌ వ్యాధుల ప్రభావం చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంది. నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి పేషేంట్లు నిలోఫర్‌ ఆసుపత్రికి వస్తుంటారు. దీంతో అక్కడ బెడ్స్‌ దొరక్క ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కో బెడ్‌ పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. కొంత మంది రోగులకు రెండు, మూడు రకాల వైరల్‌ ఫీవర్స్‌ ఉండటంతో.. ట్రీట్మెంట్‌ చేయడం కొంచెం కష్టంగా మారుతోంది.మాములుగా ఇది వైరల్‌ ఫీవర్‌ వచ్చే సీజన్‌. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సెప్టెంబర్‌ లాస్ట్‌ వరకు వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
RRRRRRRRRRRRRRRRRRR
14 ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీ
వరంగల్‌, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకి మోత’ అన్నట్లుగా తయారైంది తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి. సొంత నేతల వర్గపోరు పార్టీ ఇమేజ్‌ను క్రమంగా డ్యామేజ్‌ చేస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా రాజకీయం సాగుతున్న వేళ అధికార పార్టీలో ఇంటి నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ఊతమిచ్చేలా మారుతున్నాయి. టీఆర్‌ఎస్‌ జెండాను మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీగా సాగుతున్న స్టేషన్‌ ఘన్‌ పూర్‌ రాజకీయం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వర్గపోరు కారు పార్టీలో కుమ్ములాటకు ఆజ్యం పోస్తుందనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశించినవే అనే గుసగుసలు జోరందుకున్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య పోరు పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చేలా ఉందని వీరి విషయంలో అధినేత కేసీఆర్‌ సైతం కంట్రోల్‌ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.తాజాగా హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో స్టేషన్‌ ఘన్‌ పూర్‌ నియోజకవర్గానికి చెందిన పలువురికి మంజూరైన పింఛన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య హాజర్యయారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేల ద్వారానే చేరుతాయని, ఎమ్మెల్సీల నుంచి కాదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడాలంటే ఎమ్మెల్యేలతోనే కుదురుతుంది కానీ ఎమ్మెల్సీలతో సాధ్యం కాదని పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక కల్యాణ లక్ష్మీ రావాలన్నా మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న అందుకు ఎమ్మెల్యేగా తాను ప్రతిపాదిస్తేనే జరుగుతుంది కానీ, ఎమ్మెల్సీ చేతిలో ఏవిూ ఉండదని చెప్పుకొచ్చారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు తనను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని ఐదోసారి కూడా గెలిపిస్తారని రాజ్యయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికేతరులు ఇక్కడ చేసేదేమి ఉండదని చెబుతూ ఎమ్మెల్సీ పాత్ర ఏవిూ లేదని చెప్పడం రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.
నిజానికి తమ వర్గాలు రెండు కలిసే ఉన్నామని పైకి చెబుతున్నప్పటికీ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరి మధ్య కనిపించని శతృత్వం కంటిన్యూ అవుతోందనే ఉందనే టాక్‌ ఉంది. ఈ ఇద్దరు నేతలు పోటీ పడి నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పార్టీలో అనతి కాలంలోనే మంచి గుర్తుంపు తెచ్చుకున్న రాజయ్య టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేసి ఆ పై బర్తరఫ్‌ అయ్యారు. ఇక టీడీపీ హయాంలో మంత్రిగా కొనసాగిన కడియం శ్రీహరి సైతం తన క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి సైలెంట్‌ కిల్లింగ్‌ వెపన్‌గా మారిందనే టాక్‌ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఈ ఇద్దరూ దళిత నాయకులు కావడం ఇద్దరూ సీనియర్లే కావడంతో రాజకీయం రోజు రోజుకూ హీటెక్కుతోంది. కొన్నాళ్లుగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే విషయం బహిరంగ రహస్యమే. గతంలో పలు సందర్భాల్లో వీరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరస్పరం సహకారం అందించున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే తిరిగి గ్యాప్‌ ఏర్పడిరది. అది నానాటికి పెరిగి రచ్చకెక్కుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఇద్దరు నేతల మధ్య టీఆర్‌ఎస్‌ పార్టీ కేడర్‌ అమోమయానికి గురవుతుండగా వీరి ఎపిసోడ్‌కు అధినేత కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎలా చెక్‌ పెడతారనేది ఆసక్తిగా మారింది.
RRRRRRRRRRRRRRRRRRR
15 తొర్రూరులో రెండో పెద్ద జాతీయ పతాకం
వరంగల్‌, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతీయ పతాకాన్ని తొర్రూరులో ఆవిష్కరించారు.. 100 అడుగుల ఎత్తులో ఎగుర వేసిన జాతీయ జెండాను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేతుల విూదుగా ఆవిష్కరించారు..ఈ సందర్భంగా విద్యార్థులు, గిరిజనులతో మంత్రి ఎర్రబెల్లి డ్యాన్స్‌లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతీయ పతాకం హైదరాబాద్‌ లో ఉంది.. ప్రస్తుతం రెండో అతిపెద్ద జాతీయ పతాకాన్ని పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని తొర్రూరు పట్టణంలో స్థాపించారు.జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ ఆవరణలో 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ త్రివర్ణ పతాకాన్ని స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆవిష్కరించారు. ఇంతపెద్ద జాతీయ పతాకాన్ని తన చేతుల విూదుగా ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఈ సందర్భంగా స్థానిక, విద్యార్థులు, కళాకారులతో కలిసి సంబరంగా డ్యాన్స్‌లు చేశారు. ఈ జాతీయ జెండా 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో రెప రెప లాడుతుంది.. సుమారు 20 లక్షల రూపాయల నిధులతో బారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. దీని భద్రతా కోసం ఫెన్సింగ్‌, గార్డెనింగ్‌, సి.సి కెమెరా ల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు..తెలంగాణ లో ఇది రెండో అతిపెద్ద జాతీయ పతాకం కాగా?ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మాత్రం ఇదే ప్రధమం.. దేశానికి స్వాతంత్య్రం కోసం, ఐక్యత కోసం తన, మన, ధన, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని వారి త్యాగాల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలనే గొప్ప సంకల్పంతో తొర్రూరు లో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు మంత్రి ఎర్రబెల్లి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు నిర్వహించుకున్నామన్నారు.. ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద జెండా జమ్ము కాశ్మీర్‌ లో లేప్‌ా లో వుంది..తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌ లోని సంజీవయ్య పార్కు లో 291 అడుగుల జెండా ను ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఇప్పుడు రాష్ట్రంలో రెండవది, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొదటిది మనం ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకంగా ఉన్నదన్నారు..బారతీయుల ఐక్యతను చాటేవిదంగా ఏర్పాటు చేశారు ఈ జాతీయ పెద్ద జెండా ఆవిష్కరణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRRR
16 కేసీఆర్‌ కొత్త ఎత్తు రాజకీయ వ్యవసాయం
హైదరాబాద్‌, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
ఎంత మందికి గుర్తుందో ఏమో కానీ, 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, ఒక అమూల్యమైన ప్రకటన చేశారు. ఇకపై తెరాస ఎంత మాత్రం ఉద్యమపార్టీ కాదు, ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీ అన్నది ఆ ప్రకటన. ఇక ఆతర్వాత ఏమి జరిగింది, ఇప్పుడు ఏమి జరుగుతోంది గమనిస్తే, ఈ ఎనిమిదేళ్లలో ఆయన అదే మాట విూద నిలబడ్డారు.అందుకే, ఉద్యమ‘శుద్ధి’ కార్యాన్ని ఓ పవిత్ర కర్తవ్యంగా ముందుకు తీసుకుపోతున్నారు. పుష్కర కాలం పైగా సాగిన, ఉద్యమంలో తన వెంట నిలిచి, ఉద్యమంలో కీలక భూమికను పోషించిన ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ ఉద్వాసన పలికారు. మంత్రివర్గంలోనూ ఉద్యమ ‘మచ్చ’ లేని వారిని ఏరి కోరి తీసుకున్నారు. మొత్తం 16 మంది మంత్రులలో పది మంది ఉద్యమం వాసనలు లేని వారే ఉన్నారు. అంతవరకు ఎందుకు, ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ప్రాణత్యాగం చేసిన 1200ని స్మరించుకునే స్థూప నిర్మాణం ఎనిమిదేళ్లు అయినా ఇంకా పూర్తి కాలేదు. అంటే, ప్రపంచమంతా మెచ్చిన ఒక మహోన్నత ఉద్యమ చరిత్రను సమూలంగా తుడిచేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోమారు, జాతీయ రాజకీయాలకు నిచ్చెనలు వేసే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌, కారాణాలు ఏవైనా జాతీయ రాజకీయాల్లో తమ కంటూ ఒక స్థానం సంపాదించుకునేందుకు, చాల కాలంగా చాలా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు మొదలు, ఏకంగా సొంత పార్టీ ఏర్పాటు వరకు అన్ని ఆప్షన్స్‌ ట్రై చేసి చూశారు. కానీ, ఏదీ వర్కౌట్‌’ కాలేదు. శరత్‌ పవార్‌ నుంచి స్టాలిన్‌ వరకు, మమతా బెనర్జీ మొదలు సోరెన్‌ దాకా, దేవె గౌడ నుంచి అరవింద్‌ కేజ్రివాల్‌ వరకు అందరినీ కలిశారు, చర్చలు జరిపారు.అయినా ఫలితం కనిపించలేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్‌ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యసాయ రంగ సమస్యలు ఎజెండాగా జాతీయ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన సమావేశాల ప్రధాన లక్ష్యం అదే అని పరిశీలకులు అంటున్నారు. ఇక్కడ మళ్ళీ కేసేఆర్‌, తెలంగాణ ఉద్యమాన్ని ఆలంబన చేసుకునే ప్రయతనం చేస్తున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమ పంధాలో రైతుల సమస్యలను రాజకీయాలతో ముడివేసే ప్రయత్నం చేశారని అంటున్నారు.నిజానికి, రాష్ట్రంలో రాజకీయంగా, ఇతరత్రా ఎదురవుతున్న సమస్యల నుంచి బయట పడేందుకే, కేసీఆర్‌ రైతు రాగం ఎత్తుకున్నారని విపక్షాలతో పాటుగా స్వపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థతి ఎంత అధ్వాన్నంగా వుందో వేరే చెప్పనక్కరలేదని అంటున్నారు. అయితే, కేసీఆర్‌ మాత్రం, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు పథకాలు అమలవుతున్నాయన్న ఓ ప్రచారాన్ని ఇప్పటికే దేశ వ్యాప్తంగా చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేస్తామని ప్రకటించారు.రైతు సెంటిమెంట్‌ను పట్టిస్తే.. ఇక ఎదురే ఉండదని కేసీఆర్‌ గట్టి నమ్మకం . ఉత్తరాది రైతులు కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కేసీఆర్‌ నమ్ముతున్నారు. సకల జనుల సమ్మె తరహాలో సకల రైతుల సమాహారంగా నిరసనలు, దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తే .. దానికి నాయకత్వం వహిస్తే.. జాతీయ స్థాయికి వెళ్లినట్లేనని కేసీఆర్‌ భావిస్తున్నారు. అయితే, కేసీఆర్‌ అంతిమ లక్ష్యం జాతీయ రాజకీయాలు కాదు, రైతుల సమస్యలకు పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో ఉద్యమ నిర్మాణం అసలే కాదు, ఆయన ముందున్న తక్షణ సమస్య, సవాలు 2023 తెలంగాణ శాసన సభ ఎన్నికలు … ఆ గండం గట్టెక్కేటందుకే … ఈ రైతు గోస.. అంటున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRRR
17 మిస్డ్‌ కాల్స్‌ తో కోట్లు స్వాహా
హైదరాబాద్‌, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
అధిక లాభాలు వస్తాయని.. షార్ట్‌ టైమ్‌లో కరోడ్‌పతి కావాలని ఆన్‌లైన్‌లో ఊరించే ఆఫర్లను నమ్మితే.. బంగారుకత్తితో గొంతుకోసుకోవడమే. ఆన్‌లైన్‌ గేమింగ్‌తో ఎందరో జీవితాలు బలయ్యాయి. తాజాగా ఆన్‌లైన్‌ ట్రేడ్‌ యాప్‌ డేంజర్‌ బెల్‌ తెరపైకి వచ్చింది. ఇలా పెట్టుబడి పెడితే అలా రెట్టింపు ఖాయమనే ప్రకటనలు నమ్మితే కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టారు కేటుగాళ్లు. కానీ తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎంట్రీతో ఆ గ్యాంగ్‌కు రంగుపడిరది.సైబర్‌ క్రైమ్స్‌ చేయడంలో నేరగాళ్లది ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్‌. ఒకరు జస్ట్‌ ఎస్‌ఎంఎస్‌ తో అకౌంట్‌లు ఖాలీ చేసేస్తే.. ఇంకొకడు మిస్ట్‌ కాల్‌తో బ్యాంకు ఖాతాను గుల్ల చేసేస్తాడు. సైబరాబాద్‌ పోలీసులకు చిక్కిన నలుగురు సైబర్‌ నేరగాళ్లు ఏకంగా మూడు వేల మందికి టోకరా కొట్టేసారు. నిందితుల నుంచి స్వాదీనం చేసుకున్న నోట్ల కట్టలను చూస్తే.. పోలీసులే ఆశ్చర్యపోయారు.డబ్బులు ఎవరికీ ఉరికే రావన్న నిండు నిజాన్ని నమ్మకపోతే ఆశలకు తరుగు తప్పదు. మోసపోవడమే కాకుండా అప్పుల ఊబిలో విలవిల్లాడక తప్పదు. నెట్‌చాటున నిత్యం ఎన్నెన్నో మోసాలు. ఊరించే ఫోటోలు.. నరాలను జివ్వుమన్పించే మసాలా వీడియోలు.. హోలో అంటూ కైపెక్కించే హోయలు.. ఇలాంటి మోసాలు ఓ రకం. లింకులు పంపి ఖాతాలను కొల్లగొట్టే దగా మరో రకం. ఈ రెండిరటికి మించిన మరో రకం మ్యాటర్‌ తాజాగా కలకం రేపింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ట్రేడిరగ్‌ మాఫియా కోట్లలో దోపిడి కి పాల్పడినవైనం తెరపైకి వచ్చింది. పోలీసింగ్‌లో దేశంలోనే నెంబర్‌ వన్‌ బ్రాండ్‌గా నిలిచిన తెలంగాణ పోలీసుల తడాఖాతో రాజస్థాన్‌ గ్యాంగ్‌కు రంగుపడిరది.కట్టలుగా కట్టలుగా నోట్లు.. వీటి విలువ దాదాపు పది కోట్లు. రాజస్థాన్‌ సైబర్‌ క్రైమ్‌ గ్యాంగ్‌ను కటకటాల బాటపట్టించిన సైబరాబాద్‌ పోలీసులు సీజ్‌ చేసిన సొమ్ము ఇది. ఆన్‌లైన్‌ ట్రేడిరగ్‌ పేరిట ఫేక్‌ యాప్‌ను క్రియేట్‌ చేసి తెలంగాణకు చెందిన వందల మందిని కోట్లలో ముంచారు ఈ కేటుగాళ్లు. ట్రేడిరగ్‌ యాప్‌లో పెట్టుబడి పెడితే లచ్చిందేవి లగెత్తుకొచ్చినట్టు లాభాలే లాభాలని ఊరించి.. కోట్లలో క్యాష్‌ వసూలు చేశారు. పెట్టుబడి పెట్టడమే కానీ రాబడి రూటు కన్పించక పోవడంతో డౌట్‌ పడిన కొందరు బాధితులు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తీగ లాగితే రాజస్థాన్‌, యూపీల్లో ట్రేడిరగ్‌ యాప్‌ డొంక కలింది.ఈ కేటుగాళ్లను పట్టుకునేందుకు రాజస్థాన్‌లో 3 నెలల పాటు అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ప్రజల నుంచి డబ్బు కొట్టేసిన ఈ కేటుగాళ్లు రాజస్థాన్‌లో బడా బిజినెస్‌ మెన్‌లుగా వెలుగొందడం చూసి షాక్‌ అయ్యారు. మొత్తంగా వారి ఆటకట్టించి, నలుగురు కేటుగాళ్లను పట్టుకున్నారు. తాజాగా వారిని హైదరాబాద్‌కు వచ్చి.. స్వాధీనం చేసుకున్న మనీని విూడియా ముందు ప్రదర్శించారు. వారిపై కేసు నమోదు చేసి డిమాండ్‌కు తరలించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
RRRRRRRRRRRRRRRRRRRRRR
18 రాజాసింగ్‌ పై బీజేపీ మౌనం… దేనికి సంకేతం
హైదరాబాద్‌, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
హాస్య నటుడు మునావర్‌ ఫారూఖీ హైదరాబాద్‌ నగరంలో నిర్వహించిన షో సందర్భంగా ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జాతీయ స్థాయిలో చర్చలకు కారణమై బీజేపీ నుండి బహిష్కరణకు గురైన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సొంత పార్టీ నాయకులే పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా తీవ్ర దుమారం చెలరేగింది. పాతబస్తీలో అల్లర్లకు ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌పై నగర పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపారు. అయితే 2018లో శాసనసభకు జరిగిన ఎన్నికలలో బీజేపీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌.కాగా అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో రఘునందన్‌ రావు, ఈటెల రాజేందర్‌లు పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో అసెంబ్లీలో మొత్తం బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరగా ప్రస్తుతం రాజాసింగ్‌ బహిష్కరణకు గురయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నుండి కొన్ని రోజుల వరకు ప్రాతినిథ్యం వహించి శాసనసభా పక్ష నేతగా ఉన్న రాజాసింగ్‌ను పార్టీ నుండి బహిష్కరించినప్పటికీ అటు పార్టీలో, ఇటు సొంత నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ నాయకులు నోరు మెదపకపోవడం గమనార్హం. రాష్ట్రంలో బీజేపీకి అంతగా ఫాలోయింగ్‌ లేని సమయంలో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన ప్రస్తుతం గడ్డుకాలం ఎదొర్కుంటుండగా.. రాజాసింగ్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతమని పార్టీ అగ్రనాయకులు పేర్కొంటున్నారు.బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి జైలుకు పంపించినప్పటికీ సొంత పార్టీ నేతలు ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు. ఆయనకు మద్ధతుగా నిలిచే వారు లేకుండా పోయారు. ఉప ఎన్నికలలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచేంత వరకు రాష్ట్ర బీజేపీ నుండి ఆయన ఒక్కరే ఎమ్మెల్యే. హిందూ ధర్మం గురించి నిత్యం ఆయన వీడియోలు రికార్డు చేసి సోషల్‌ విూడియాలో పోస్టు చేసేవారు. ఆయనకు తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది.ఇప్పుడదంతా ఏమైందనేది ఆయన అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేస్తే కనీసం సొంత పార్టీ నేతలు కూడా నోరు మెదపకపోవడం చూస్తోంటే ఆయనను పార్టీ వదులుకోవాలని చూస్తోందనేది వారి వాదన. ఇటీవల రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో కేవలం పదుల సంఖ్యలో గోషామహల్‌ నియోజకవర్గంలో ఆందోళనలు నిర్వహించారు. అనంతరం వారు కూడా పట్టించుకోవడం మానేశారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌ చరిష్మా తగ్గిందా ? లేక ఆయనకు చెక్‌ పెట్టేందుకే చూస్తున్నారా ? అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు .ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదై జైలులో ఉంటే ఆయనకు కార్పొరేటర్ల రూపంలో సొంత నియోజకవర్గంలో కుంపటి తయారైందనే చర్చ జోరుగా నడుస్తోంది. ఆరు డివిజన్లు ఉన్న గోషామహల్‌ నియోజకవర్గంలో గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఐదు డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు, ఒక్క డివిజన్‌లో ఎంఐఎం కార్పొరేటర్‌ విజయం సాధించారు. అయితే ఇటీవల పార్టీ నుండి బహిష్కరణకు గురైన రాజాసింగ్‌కు సంఫీుభావం ప్రకటించేందుకు బదులుగా.. నియోజకవర్గంలోని బీజేపీ కార్పొరేటర్లలో ముగ్గురు కార్పొరేటర్లు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని వారి అనుచరుల వద్ద సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.ఇప్పటి వరకు నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్యే జైలు పాలైన సమయంలో వారు ఇలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకుంటున్న వారిలో ఇద్దరు కార్పొరేటర్లు మొదటి సారిగా గ్రేటర్‌ ఎన్నికలలో విజయం సాధించిన వారే కావడంతో నియోజకవర్గం ప్రజలు వీరి వ్యాఖ్యలను ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తం విూద హిందూ ధర్మం పేరుతో నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజాసింగ్‌ పార్టీకి మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ ఆయనను పార్టీలో తిరిగి చేర్చుకోకుండా రాబోయే ఎన్నికలలో తమకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్న కార్పొరేటర్ల కోరికను అగ్ర నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది నియోజకవర్గ ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు .
RRRRRRRRRRRRRRRR
19 మునుగోడులో షర్మిళ పార్టీ
హైదరాబాద్‌, ఆగస్టు 30, (న్యూస్‌ పల్స్‌)
మునుగోడు ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నిలవనున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ఆ పార్టీ శ్రేణులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. ఎవరిని బరిలోకి దింపాలనే విషయంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. దీనిపై పార్టీ కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాల్సి ఉండటంతో ఎవరైతే బాగుంటుందనే దానిపై పార్టీ తర్జన భర్జన పడుతున్నది. గతేడాది ఫిబ్రవరిలో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన షర్మిల ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. నేరుగా సాధారణ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని ప్రకటించారు. కాగా ఇప్పుడు మునుగోడు బైపోల్‌లో నిలవాలని అనుకోవడం వెనుక ఉన్న కారణాలేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇద్దరూ వైఎస్సార్‌కు విధేయులుగా ఉన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అంటే వారికి అమితమైన అభిమానం. షర్మిల నిర్వహించిన నిరాహారదీక్ష సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఫోన్‌ చేసి మరీ తన మద్దతు ప్రకటించారు. అలా వైఎస్సార్‌ కుటుంబానికి విధేయుడిగా ఉన్న వ్యక్తిపై షర్మిల పార్టీ నుంచి అభ్యర్థిని బరిలోకి దింపాలని అనుకుంటున్నారు. గతంలో హుజురాబాద్‌ ఎన్నికల్లో బరిలో నిలుస్తారా ? అన్న ప్రశ్నకు అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో తాము పాల్గొనేది లేదని తేల్చి చెప్పిన షర్మిల ఇప్పుడు మునుగోడు ఎన్నికల బరిలో తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టాలనుకోవడం చర్చనీయాంశమైంది.వైఎస్సార్‌ టీపీ నుంచి మునుగోడు బరిలో ఎవరిని నిలుపుతారనేది సస్పెన్స్‌గానే మారింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పోటీలో ఉంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బలమైన అభ్యర్థి గురించి అన్వేషణ సాగుతున్నట్లు తెలుస్తున్నది. అభ్యర్థి ఎంపికపై అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. హస్తం పార్టీ నుంచి తమ పార్టీలోకి లాగి వారికి టికెట్‌ కేటాయించాలని వైఎస్‌ షర్మిల ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి షర్మిల పార్టీలో ప్రభావం చూపగలిగేంత బలమైన అభ్యర్థులెవరూ లేరు. ఒకవైపు బరిలో నిలవాలనుకుంటున్నా అభ్యర్థి ఎంపిక వారికి క్లిష్టతరంగా మారనున్నది. అందుకే కాంగ్రెస్‌ నేతలకు గాలం వేస్తున్నట్లు టాక్‌. తెలంగాణలో పార్టీ ఏర్పాటు తర్వాత మొదటిసారి ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న షర్మిల పార్టీ విజయఢంకా మోగిస్తుందా ? అపజయాన్ని మూట గట్టుకుంటుందా? అనేది వేచి చూడాల్సిందే.
RRRRRRRRRRRRRRRRRRRRRRRలీలీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *