రైలు ప్రమాదంలో

ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా, 900 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌, బెంగళూరు`హౌరా ఎక్స్‌ ప్రెస్‌ పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో రైలులో ఉన్న ప్రయాణికులు ఈ ప్రమాదం జరిగిన భయానక దృశ్యాన్ని వివరించారు.ప్రమాదం జరిగిన సమయంలో తాను నిద్రిస్తున్నానని ఓ ప్రయాణికుడు విూడియాకు తెలిపాడు. రైలు బోల్తా పడగానే ఒక్కసారిగా కళ్లు తెరిచి చూశాను. అప్పటికే నాపై 10`15 మంది పడి ఉన్నారు. వారి మధ్యలో నేను ఇరుక్కుపోయాని. నా చేతులు, కాళ్ళకు గాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఎలాగోలా వారిని నెట్టుకొని బయటకు వచ్చాను. అక్కడ చూస్తే నాకు భయానక దృశ్యాలు కనిపించాయి. చాలా మంది శవాలపై పడి ఉన్నారు. ఒకరి చేతిని కోల్పోయి రోధిస్తున్‌నారు. మరొకరి కాలు పూర్తిగా చితికిపోయింది. తలచుకుంటే భయమేస్తోంది. ‘‘ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఇతర నేతలుగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు.ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ జెనా తెలిపారు. అక్కడ 600`700 రెస్క్యూ బలగాలు పనిచేస్తున్నాయి. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగుతాయి. క్షతగాత్రులను రక్షించి వారికి చికిత్స అందించడమే మా ప్రాధాన్యత.హౌరా వెళ్తున్న 12864 బెంగళూరు`హౌరా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ కు చెందిన పలు బోగీలు బహంగా బజార్‌ వద్ద పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన బోగీలు 12841 షాలిమార్‌`చెన్నై కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ ను ఢీకొనడంతో దాని బోగీలు కూడా బోల్తా పడ్డాయి. కోరమాండల్‌ ఎక్స్‌ ప్రెస్‌ బోగీలు పట్టాలు తప్పడంతో గూడ్స్‌ రైలు ప్రమాదానికి గురైంది.ప్రమాదం కారణంగా చాలా రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించింది. మరికొన్నింటిని రద్దు చేసింది. ఆ రైళ్ల జాబితాను కూడా విడుదల చేసింది.
12 లక్షల పరిహారం
అధికారికంగా మృతుల సంఖ్యను అధికారులు ప్రకటించకపోయినా.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ.10 లక్షల రూపాయలు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. తీవ్రగాయాలు లేదా వైకల్యం ఏర్పడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ట్వీట్‌ చేశారు.జరిగిన ప్రమాదంపై ఒడిషా సీఎస్‌ ప్రదీప్‌ జేనా స్పందించారు. ఘటనలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైనట్లు ప్రదీప్‌ జేనా స్పష్టం చేశారు. ఒఢశాి సీఎం నవీన్‌ పట్నాయక్‌ తో తమిళనాడు సీఎం స్టాలిన్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. ఖరగ్‌ పూర్‌, చెన్నై, బాలాసోర్‌ లలో అత్యవసర సహాయక కేంద్రాలను రైల్వే ఏర్పాటు చేసింది. జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ ఖర్‌, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ రాహుల్‌ గాంధీ తీగ్ర్రాÊఙÊఙంతి వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *