బాలినేని శాంతించినట్టేనా

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి .. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా పార్టీ వ్యవహారాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి రీజనల్‌ కోఆర్డినేటర్‌ పదవి ఇచ్చారు. అయితే ఆ తర్వాత కనీసం ప్రోటోకాల్‌ కూడా ఇవ్వకపోతూండటంతో అసంతృప్తికి గుర్యయారు. తన పదవికి రాజీనామా చేశారు. గతంలో జగన్‌ పిలించి .. రీజినల్‌ కోఆర్డినేటర్‌ గా కొనసాగాలని కోరారు. కానీ బాలినేని మాత్రం అంగీకిరంచలేదు. తన నియోజకవర్గానికే పరిమితమవుతానని ప్రకటించారు. అనూహ్యంగా మరోసారి సీఎం జగన్మోహన్‌ రెడ్డి పిలవడంతో… జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని రీజినల్‌ కోఆర్డినేటర్‌ గా మళ్లీ పని చేయాలని సూచించేందుకన్న ప్రచారం జరిగింది. అయితే సమావేశం తర్వాత విూడియాతో మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. రీజినల్‌ కోఆర్డినేటర్‌ పదవులపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా రాజకీయాలపై అన్ని విషయాలను సీఎం జగన్‌తో చర్చించానన్నారు. జిల్లాలో ఇద్దరి విషయంలో మాత్రం ఇబ్బంది ఉందని.. ఆ ఇద్దరి గురించి జగన్‌ తో చర్చించాన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని హావిూ ఇచ్చాని నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించారన్నారు.జిల్లాలో తాను ఎదుర్కొంటున్నా ఇబ్బందుల పై కూడా సీఎం కి వివరించాననని.. ప్రోటోకాల్‌ అనేది పెద్ద విషయం కాదన్నారు. ప్రోటోకాల్‌ పై ఫిర్యాదు చేయడానికి ఏముంటుందని వ్యాఖ్యానించారు. కొత్తగా రీజినల్‌ కోఆర్డినేటర్‌ పదవి కూడా చర్చ జరగలేదు. ..గతంలోనే ఆ పదవి వద్దని రాజీనామా చేశా.. నియోజకవర్గ మిడ్‌ దృష్టి పెట్టమన్నారని తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సీఎం సానుకూలంగా స్పందించారన్నారు పార్టీ మార్పు అనేది ప్రచారం మాత్రమేనని అందులో ఎలాంటి నిజం లేదని బాలినేని స్పష్టం చేశారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీకి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. నెల్లూరులో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌ అయ్యారు, చిత్తూరు, కడపలో కూడా పరిస్థితి పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉందని చెప్పలేం. కుప్పంని కూడా టార్గెట్‌ చేసి చిత్తూరులో క్లీన్‌ స్వీప్‌ చేయాలనుకుంటున్న జగన్‌, అక్కడ ఇన్‌ చార్జ్‌ కాస్త గట్టిగా పని చేయాలనుకుంటున్నారు. ఇటీవల ఆ మూడు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. దీంతో జగన్‌ మరింత కేర్‌ తీసుకోవాలనుకుంటున్నారు. విజయసాయికి ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *