పురందరేశ్వరీ దూకుడు వెనుక…

విజయవాడ, ఆగస్టు 17
వచ్చే ఎన్నికలకు కూడా సోము వీర్రాజునే బీజేపీ ఏపీ అధ్యక్షునిగా కొనసాగిస్తారు.. ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని అప్పట్లో అనుకున్నారు రాష్ట్ర పార్టీ నేతలు. వివిధ సందర్భాల్లో జాతీయ నాయకత్వం కూడా ఇదే తరహా సంకేతాలిచ్చింది. ముఖ్యంగా కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడి వెళ్లే సందర్భంలో అయితే.. సోమునే ఏపీ సుప్రీం అంటూ క్లారిటీ ఇచ్చేసింది. కన్నా నిష్క్రమణ తర్వాత సోము అనుచరులైతే? ఇక మా లీడర్‌దే హవా అన్న నిర్ణయానికి వచ్చేశారు. కానీ.. ఆ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. ఊహించని విధంగా పురంధేశ్వరిని ఏపీ బీజేపీ చీఫ్‌గా నియమించింది పార్టీ అధినాయకత్వం. పురంధేశ్వరి ప్రకటించిన కొత్తల్లో బీజేపీలోని రెండు వర్గాలూ షాకయ్యాయట.అసలు ఈమె రేస్‌లోకి ఎలా వచ్చారు? పురంధేశ్వరి ఏం మాయ చేశారు..? అని మొత్తం కేడర్‌ స్టన్‌ అయ్యారట. అసలు ఏ కోణంలో ఆలోచించి ఆమెకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పజెప్పారని తెగ శోధించారట. వాళ్ళు శోధించి సాధించింది ఏవిూ లేకపోయినా? ఇప్పుడిప్పుడే విషయాలు బయటికి వస్తున్నాయట. లీడర్స్‌కు, కేడర్‌కు క్లారిటీ వస్తోందట. ఎన్టీఆర్‌ కుమార్తె అని ఇచ్చారని కొందరు.. చంద్రబాబును ఢీ కొట్టడానికే ఆమెకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పారని మరికొందరు.. బీజేపీలోని టీడీపీ`వైసీపీ వర్గాలకు కాకుండా బ్యాలెన్స్‌ చేసేందుకు పురంధేశ్వరిని నియమించారని ఇంకొందరు.. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించేశారు. కానీ.. తాజాగా బయటికొస్తున్న విషయాల్ని పరిశీలిస్తే.. పార్టీ అధినాయకత్వం ఈ ఈక్వేషన్లల్లో వేటినీ పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ఒకే ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పురంధేశ్వరిని పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా నియమించినట్టు తెలిసింది.ఆ ఈక్వేషన్‌ మరేదో కాదు.. పవన్‌ కళ్యాణ్‌. ఎస్‌? పవన్‌ కళ్యాణ్‌ కోసమే పురంధేశ్వరికి ఏపీ పగ్గాలు అప్పజెప్పిందట బీజేపీ అధిష్టానం. అదేంటి? అలా ఎలా జరుగుతుంది అంటే.. పవన్‌ను దూరం చేసుకోకూడదనే ఉద్దేశ్యంతోనే బీజేపీ అధినాయకత్వం పురంధేశ్వరిని నియమించినట్టు సమాచారం. గతంలో సోము వీర్రాజు అధ్యక్షునిగా ఉన్న సందర్భంలో పవన్‌ కళ్యాణ్‌తో కానీ.. జనసేనతో కానీ గ్యాప్‌ వచ్చిన ప్రతిసారీ.. తెర వెనక పురంధేశ్వరే సమస్యలు పరిష్కరించారట. రెండు పార్టీల మధ్య గ్యాప్‌ తగ్గించే ప్రయత్నం చేశారట. దీంతో పవన్‌కు కూడా ఆమె అంటే.. సాఫ్ట్‌ కార్నర్‌ ఉందట. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు జనసేన లాంటి మాస్‌ ఇమేజ్‌ ఉన్న పార్టీని వదులుకోవడం ఇష్టం లేక సోము వీర్రాజును తప్పించి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా అప్పాయింట్‌ చేశారనేది పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఉన్న లేటెస్ట్‌ టాక్‌. పార్టీ వర్గాలు కూడా ఇప్పుడు ఇదే అంశంపై క్లారిటీకి వస్తున్నాయి. నిజమనే అయి ఉండవచ్చంటున్నాయి. దీనికి తగ్గట్టే పురందేశ్వరి నిర్ణయాలు చర్యలు ఉంటున్నాయి. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే జనసేన కేడర్‌తో కలిసి బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది. ఆమె కూడా ఒకటికి రెండు సార్లు.. జనసేన బీజేపీతో పొత్తులో ఉందనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర నాయకులకు కూడా ఇదే విషయం చెబుతున్నారు. భవిష్యత్‌ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని.. జనసేనతో పొత్తు అంశంపై ఇప్పటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పార్టీ అధినాయకత్వం భావించడంతో పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు దక్కాయన్నది లేటెస్ట్‌ వెర్షన్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *