మంత్రి కేటీఆర్‌ ను భర్తరఫ్‌ చేయాలి

పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ శుక్రవారం ఉదయం కరీనంగర్‌ జైలునుంచి విడుదల అయ్యారు. అయనకు హనమకొండ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సంజయ్‌ బయటకు రానున్న విషయం తెలియగానే జూ లు వద్దకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు వచ్చాయి. దీంతో పోలీసులు జైలు పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేశారు. జైలు బయట వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు.
బండి సంజయ్‌ విూడియాతో మాట్లాడాతూ మంత్రి కేటీఆర్‌ ను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు. టీఎస్పిఎస్సి, టెన్త్‌ పేపర్‌ లీకేజీలపై సిట్టింగ్‌ జడ్జితో విచారించాలని డిమాండ్‌ చేశారు. ఒక్కో నిరుద్యోగికి లక్ష రూపాయలు ఇవ్వాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కల్వకుంట్ల కుటుంబమే లీకుల, లీక్కర్‌ వీరుల కుటుంబమని సంజయ్‌ ఆరోపించారు. అటు వరంగల్‌ సీపీ పై సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీపీ రంగనాథ్‌ చెప్పినవన్నీ నిజాలేనా అని ప్రశ్నించారు. నిజాయితీ ఉంటే ఫోటో పక్కన పెట్టి మూడు సింహలపై ప్రమాణం చేయాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *