ఆర్మూర్‌ లో గలీజ్‌ దందా

నిజామాబాద్‌ నగర శివారులోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాంనగర్‌లో 45 రోజుల క్రితం టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పీడీఎస్‌ బియ్యం పట్టుబడిరది. అయితే అక్కడ దాడి నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు షాక్‌ తగిలింది. ఏకంగా పీడీఎస్‌ బియ్యం దందా నిర్వహిస్తున్న నిర్వాహకుడు ప్రతి నెల రూ.15 వేల మామూళ్ళు ఇస్తున్న ఎలా రైడ్‌ చేస్తారని అడిగిన ప్రశ్నకు అధికారులకు దిమ్మతిరిగిపోయింది.నిజామాబాద్‌ సరిహద్దులోని బోధన్‌ పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద ఉన్న పాన్‌షాప్‌ గుట్కా విక్రయాలకు ఫేమస్‌. అక్కడ స్థానిక పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ దాడులు జరుగవు. ఎందుకంటే బోధన్‌ పట్టణానికి చెందిన ఓ హోంగార్డు దాడులు జరుగనివ్వమని ప్రతినెల ముగ్గురు నలుగురు నిర్వాహకుల నుంచి ప్రతి నెల మామూళ్ళు వసూల్‌ చేసి అధికారులకు చేరవేస్తున్నట్టు సమాచారం. ఆర్మూర్‌ రహదారిపై ఉన్న ప్రముఖ గ్రామంలో ఆర్మూర్‌ బల్దియాకు చెందిన ఒక కౌన్సిలరే పేకాట ఆడిస్తున్నాడు.అంటే ప్రతి నెల అధికారులకు మామూళ్ళు ఇచ్చి మేనేజ్‌ చేస్తున్నామని, పేకాట పైన దాడులు జరుగవని పేకాట దందాను నిరాటకంగా సాగించడం విశేషం. గతంలో రెండుసార్లు నిఘా సంస్థల దాడిలో పట్టుబడిన తర్వాత ఏకంగా అధికారులను లైన్‌లోకి వెళ్లి మామూళ్లు ఇస్తున్నానని బహిరంగంగా చెబుతున్నారు. నిజామాబాద్‌ నగరంలోని గత ఎడాది రౌడీషీట్‌ ఓపెన్‌ ఐనా యువకుడి గుండాయిజం పెరుగడంతో అతనిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపారు.అతడు జైలు నుంచి విడుదల తర్వాత అనుచరులు, బంధువుల ద్వారా పేకాట, మట్కా నిర్వహణలో ఫేమస్‌ అయ్యాడు. అయితే సధరు యువకుడు నిఘా సంస్థల అధికారి పోటోను తన సెల్‌ ఫోన్‌ డిపి గా పెట్టుకోవడం మొదలుకొని సోషల్‌ విూడియా వేదికగా తనకు అధికారుల అండా ఉందని తనను ఎవ్వరు ఏమి చేయలేరని చెబుతు ఇల్లీగల్‌ దందాలో మునిగి తెలుతున్నాడు.నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కె.ఆర్‌.నాగరాజు నేరాల నియంత్రణలో, చోరి కేసులో చేదించడంలో చీకటి దందాల నియంత్రణలో దూసుకుపోతున్నారు. ఆయన సక్సెస్‌ రేషియో గతంలో పని చేసిన అధికారుల కంటే ఎక్కువగా ఉంది. గడిచిన 8 నెలల కాలంలోనే మునుపెన్నడూ లేని విధంగా చీకటి దందాలు(ఇల్లీగల్‌) పై ఉక్కుపాదం మోపారు. తన పరిధిలోని ఏసీపీలు మొదలుకుని ఎస్‌హెచ్‌వోల వరకు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. నేరాలు నియంత్రణ కొరకు కేవలం సవిూక్షలకు పరిమితం కాకుండా కేసుల ఛేదన నిందితుల అరెస్టుకు ఆయన నిర్వీరామంగా పాటుపడుతున్నారు.నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా కేసుల చేదనకు ప్రత్యేక టీంల ఏర్పాటుతో పాటు నిందితులను పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. పోలీసు కమిషనర్‌ నేరాల నియంత్రణ కోసం ఓ వైపు కష్టపడి పని చేస్తుండగా నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన కొందరు నిఘా అధికారులు మాత్రం అమ్యామ్యాలకు అలవాటు పడి పోలీసు శాఖకు చెడ్డపేరు తెస్తున్నారు.పోలీసు కమిషనరేట్‌ ఏర్పాటు ముందు ఐడి పార్టీ, క్యూఆర్‌టి, ఎస్‌బి, ఇంటెలిజెన్స్‌ లాంటి సంస్థలు మాత్రమే ఉండేవి. కమిషనర్‌గా ఏర్పాటు తర్వాత ఇల్లీగల్‌ దందాలైనా పేకాట, మట్కా, పీడీఎస్‌ బియ్యం రవాణా, ఇసుక అక్రమ రవాణా, లక్కీ డ్రాలు, గంజాయి, బెట్టింగ్‌ లాంటివి నియంత్రించడానికి కొత్త కమిషనరేట్‌ ఏర్పడగానే టాస్క్‌ ఫోర్స్‌ టీంను ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా టాస్క్‌ ఫోర్స్‌ టీం సమర్థవంతంగానే పని చేసింది. తర్వాత దాడుల అనంతరం వారిపై ఆరోపణలు వచ్చాయి.టాస్క్‌ ఫోర్స్‌ పై ఆరోపణలు రావడంతో ఎన్నడూ లేని విధంగా మట్కా నిర్వాహకులపై ఉక్కుపాదం మోపేందుకు తొలిసారిగా సీసీఎస్‌ ను రంగంలోకి దించారు కమిషనర్‌. తర్వాత కాలంలో లక్కిడ్రాల దందాపై ఏకంగా ఎస్‌బి అధికారులే దాడుల్లో పాల్గొన్నారంటే నిఘా సంస్థల పై వచ్చిన ఆరోపణలు ఉదాహరణగా చెప్పవచ్చు. గతంలో టాస్క్‌ ఫోర్స్‌ లో పని చేసిన ఒక సీఐ హయాంలో జరిగిన దాడులు రికార్డులకు ఎక్కాయి. తర్వాత సదరు అయ్యవారు అక్కడ నుంచి బదిలీ అనంతరం ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. ఆయన అనంతరం కూడా సమర్థవంతులైన అధికారులు వచ్చినా ఆరోపణలు మాత్రం పోలేదు. టాస్క్‌ ఫోర్స్‌ సీఐ గా పని చేసిన వ్యక్తి ఏకంగా ఇసుక అక్రమ రవాణాలో టిప్పర్లు పెట్టి వసూలు చేశాడని ఆరోపణలున్నాయి. తర్వాత సైతం లక్కీ డ్రా, పేకాట, మట్కా, గుట్కా, మొరం, ఇసుక అక్రమ రవాణాలో మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు పెరిగాయి. అందుకే ఇటీవల దాడుల సంగతి ఏమో కానీ నిఘా సంస్థల పేర్లపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లిగల్‌ దందాలపై దాడుల అనంతరం సధరు దందాల నిర్వహకులు నిఘా అధికారులతో ఫ్రెండ్షిప్‌ చేయడం షూరు అయి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగే వరకు వెళ్లి నెల వారి మామూళ్లకు దారి తీసినట్లు సమాచారం.అందుకే ఇల్లీగల్‌ దందాలపై గతంలొ నిత్యం దాడులే దాడులు జరుగగా చీకటి వ్యాపారాలు బంద్‌ కాకున్న వారికి మాత్రం లక్షల్లో అమ్యామ్యాలు ఉండటం గమనార్హం. పోలీస్‌ శాఖలో కొందరు సీతయ్య ఎవరి మాటా వినరు అన్నట్టుగా ఉంటే కొందరు మాత్రం వారి వేంటే ఉంటు మేతయ్యలుగా అవతారం ఎత్తి పోలీస్‌ శాఖ పరువును గంగలో కలుపుతున్నారు. జిల్లాలో ఏళ్ల తరబడి పనిచేసిన వారిని నిఘా విభాగాలలో ఉంచి వారికి అధికారం కట్టబేట్టడమే అసలు అవినీతి, ఆరోపణలకు ప్రధాన కారణం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *