వన్‌ నేషన్‌..వన్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ సాధ్యం కాదా…

అకాల వర్షంతో రైతన్న కుదేలయ్యాడు. ఏ రైతును కదిలించినా కన్నీళ్ళే వస్తున్నాయ్‌. వరుస అకాల వర్షాలతో రైతులు బోరుమంటున్నారు. కళ్లెదుటే చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షంతో అన్నదాతల నెత్తిన పిడుగుపడిరది. పెట్టిన పెట్టుబ డులు వర్షార్పణం అయ్యాయి. పంటలు వస్తే అప్పులు తీర్చుకుని కొత్త పంటలు వేద్దామన్న ఆశతో ఉన్న అన్నదాతను అకాల వర్షం దొంగ దెబ్బతీసింది. ఈ నెలలోనే వరుసగా మూడు మార్లు అకాల వర్షం అన్నదాతపై కోలుకోలేని దెబ్బ తీసింది. ఉభయ తెలుగు రాష్టాల్ల్రోనూ ఇదే పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండిరచిన పంట.. చేతికొచ్చే సమయంలో నీళ్లపాలవుతుండం ఒక రివాజుగా మారిపోయింది. నష్టాల అంచనాలతో కాలక్షేపం చేయకుండా… కాలయాపన జరక్కుండా అన్నదాతను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా పంట నష్టాలను గుర్తించాలి. రైతులకు భరోసా ఇవ్వాలి.ఈదురుగాలులు వాన, వడగళ్ల దెబ్బతో పంట పొలంలో ఉన్న వరి చేనులో గింజలన్నీ నేలపాలయ్యాయి.. ఇక కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలన్నీ వర్షం ధాటికి తడిసిపోయాయి. పలు మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం వరద పాలైంది. పలుచోట్ల టార్పాలిన్‌ కవర్లను కప్పి అన్నదాతలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. రెక్కల కష్టమిలా వర్షార్పణం కావడంతో కలత చెందారు.గత నెలలో అకాల వర్షాల ధాటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15,801 ఎకరాల పంట 33 శాతానికిపైగా నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు. ఇటీవల రెండ్రోజులుగా కురిసిన వానలతో నాలుగు జిల్లాల పరిధిలో మరో 40 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో కరీంనగర్‌ జిల్లాలోనే 23 వేల ఎకరాలకుపైగా నష్టం వాటిల్లింది. ఇక ఇదే విషయంపై ప్రతిపక్షలు కేసీఆర్‌ పై విరుచుకుపడ్డారు.ఎనిమిదేళ్ల పరిపాలనలో నష్టపోయిన రైతాంగానికి ఒక్క రైతుకైనా పరిహారం ఎందుకు ఇవ్వలేదన్నారు. నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం వల్లే, ఆ కేంద్రాలను తెరవక పోవడం వల్లే నేడు చాలా మంది రైతులు నష్ట పోయారన్నారు. పండిరచిన ధాన్యం కొంటానన్నావ్‌ కొనుగోలు కేంద్రాలు ప్రారంబించవు.. అన్నీ కోతలేనా కేసీఆర్‌. కనీస మద్దతు ధరకు తోడుగా ఏనాడైనా వరికి రూ.500 రూపాయల బోనస్‌ చెల్లించావా అని ప్రశ్నించారు.మొక్కజొన్న, వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే పంట నష్టం జరిగింది. . ఇప్పటికైనా సమగ్ర పంటల బీమా ను కూడా వన్‌ నేషన్‌ వన్‌ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పద్ధతికి మార్చాలి. దేశంలో ఉన్న ఇన్సూరెన్స్‌ కంపెనీలతో చర్చించి సమగ్ర పంటలబీమా పథకం రచించాలి. భుత్వం ప్రకారం ఉత్పత్తి ప్రమాదం నుంచి రైతులను రక్షించడమే కాకుండా ఈ పథకాలు ఆహార భద్రత, పంటల వైవిధ్యం, వ్యవసాయ రంగం వృద్ధి, పోటీతత్వాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ పథకాలు ఖరీఫ్‌ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వార్షిక వాణిజ్య/ఉద్యాన పంటలకు 5 శాతం అతి తక్కువ ప్రీమియంతో పంట నష్టాలని కవర్‌ చేస్తాయి. 50:50 నిష్పత్తి ఆధారంగా ప్రీమియం బ్యాలెన్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షేర్‌ చేసుకుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా నోటిఫై చేసిన ప్రాంతాలు, పంటలకి ఇవి వర్తిస్తాయి. అంతేకాకుండా రుణం పొందిన రైతులకు ఈ పథకాలు తప్పనిసరిగా ఉంటాయి. రుణం పొందని రైతులకు స్వచ్ఛందంగా ఉంటాయి. దీంతో పాటు ప్రధానమంత్రి బీమా యోజన,ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన ఉండనే ఉన్నాయి.పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా సాయం అందేలా చూడాల్సిన అవరసరం ఉంది. అప్పుడు ప్రభుత్వాలు మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోగలుగుతాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *