రామగుండంలో అవిశ్వాస తీర్మానం

కరీంనగర్‌, జూన్‌ 30
రామగుండం కార్పొరేషన్‌ లో గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నేతల రహస్య సమావేశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రామగుండంలో 50 డివిజన్‌ లు ఉండగా 2020లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ 18 సీట్లు, కాంగ్రెస్‌11, బీజేపీ 6, ఫార్వర్ట్‌ బ్లాక్‌ 9, స్వతంత్రులు ఆరుగురు గెలుపొందారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా అనిల్‌ కుమార్‌ ఉండగా బీజేపీ నుంచి 3, కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు, స్వతంత్రులు, ఫార్వర్డ్‌ బ్లాకు చెందిన మొత్త 37 మంది అభ్యర్థుల మద్దతుతో ఎన్నికయ్యారు. అనిల్‌ కుమార్‌ మేయర్‌ గా ఎన్నికై కార్పొరేటర్స్‌ మేయర్‌ కు వ్యతిరేకంగా సమావేశమై బహిరంగంగానే కొంతమంది కార్పొరేటర్‌ లతో సన్నిహితంగా ఉండటంతో చాలా సార్లు అధికార పార్టీ విమర్శలు తమ డివిజన్స్‌ గుప్పించారు. ఇటీవల అభివృద్ధి పనుల ఆలస్యం, తదితర సమస్యల పరిష్కారానికి 11 మంది కార్పొరేటర్స్‌ ఫోరం అని మేయర్‌ కు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారు.నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం మూడేళ్ల పదవీకాలం పూర్తికావాల్సి ఉంది. దీంతో రోజులు ఆగిన అసంతృప్తులు నేడు మేయర్‌ లేని సమయంలో సమావేశం నిర్వహించి భవిష్యత్‌ ర్యాచరణ రూపొందించుకోవడం హాటాపిక్‌ గా మారింది, రామగుండంలో సోమారపు సత్యనారాయణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గత పాలకవర్గ సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణను పదవి నుంచి దింపి జాలి రాజమణికి పదవి కట్టబెట్టారు.అప్పుడు ఎమ్మెల్యే సత్యనారాయణ నెగ్గిపించారు. కాగా ప్రస్తుతం మేయర్‌ పనితీరుపై అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయం కాబట్టి రాజకీయంగా పెనుదుమారం రేపే అవకాశం ఉండటంతో అవిశ్వాసంపై ఎమ్మెల్యే విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. మేయర్‌ ఎన్నికైన ప్రోద్బలంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టి ఎమ్మెల్యే చందర్‌ సైతం అసంతృప్తిగానే ఉన్నా కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం చూపుతున్నట్లు తెలుస్తోంది. మేయర్‌ గా ఎన్నికైన అనిల్‌ కుమార్‌ పనితీరుపై అనేక విమర్శలున్నాయి.బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు రహస్య సమావేశంలో పాల్గొని మేయర్‌ పనితీరుకు వ్యతిరేకంగా మాట్లాడుకున్న విషయం చర్చనీయాంశంగా మారింది. గత వారంలో ఎన్టీపీసీ రామగుండంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో డిప్యూటీ మేయర్తో పాటు 23 మంది కార్పొరేటర్లు సమావేశమయ్యారు. పలు విషయాలపై మేయర్‌ సహకరించడం ప్రధాన ఆరోపణగా పలువురు అధికారులు సమావేశం జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే తమ డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంలో జాప్యం చేయడంతో పాటు కార్పొరేటర్ల సమావేశం కొనసాగింది.కోరుకంటి చందర్‌, మేయర్‌ అనిల్‌ కుమార్‌ అసమ్మతి కార్పొరేటర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు మేయర్‌ పై అవిశ్వాసం పెట్టేందుకు సమావేశం ఏర్పాటు చేశారా లేదా అభివృద్ధి పనుల జాప్యంపైనా అని తెలియాల్సి ఉంది. ఈనేపథ్యంలో రామగుండం కార్పొరేటర్లు నిర్వహించుకున్న సమావేశం మేయర్‌ పై అసంతృప్తి… అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తు జరుగుతున్న రహస్య సమావేశాలు, ఫోరంగా ఎవరికి పలు విధాలుగా మండలి సమావేశం జరగడం, కార్పొరేషన్లో మేయర్‌ పై విమర్శలు గుప్పించటం చూస్తుంటే మేయర్‌ సీటుకు ముప్పువాటిల్లేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *