షాదీ మాటే వద్దు గురు…

కాలం మారింది. కాలంతో పాటు మనిషి జీవితంలో తీరు మారింది. అమ్మాయిలూ ఎదిగారు. ఒకప్పుడు ఆడపిల్ల పెళ్లంటే గుండెల విూద కుంపటిలా భావించేవారు! ఒక అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరుపోతుందనే ఫీలింగ్‌ సగటు తల్లిదండ్రులకు ఉండేది! ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాలు ఆడపిల్లకు మెచ్యూరిటీ రాకముందే పెళ్లి చేసే దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవి! మొన్నటి వరకు ఎక్కడ చూసినా బాల్య వివాహాల ఘటనలే! అయితే.. మనుషుల్లో మార్పు, సమాజంలో చైతన్యం, ఆడపిల్లలు చదువుకోవాలనే తపన మొదలైనవి బాల్య వివాహాలకు అడ్డుగా నిలిచాయి. జీవితంలో పెళ్లి చాలా ప్రధానమైనది. పెళ్లీడు రాగానే మూడు ముళ్లు వేయించడం వారి నుంచి తర్వాత తరాన్ని ఆశించడం అనాదిగా జరుగుతున్న సాంప్రదాయం. ఐదు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. పారిశ్రామిక విప్లవం, ప్రపంచీకరణ, ఆర్థిక స్వేచ్ఛ, ప్రైవేటీకరణ, కార్పొటీకరణ, సాంకేతిక విప్లవం, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రభావం వల్ల పెళ్లి చేసుకునే వయసు 30 ఏండ్ల నుంచి 40కి మారింది. మారుతున్న జీవన విధానాల ప్రకారం ఉన్నత చదువులు చదివే యువత సరైన సమయంలో పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. పెళ్లి అంటే భారం అని, అది ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు, వ్యక్తి గత స్వేచ్ఛకు ఆటంకం అనే భావన వారిలో ఉంది. ఇదీ గాక ఒంటరి జీవితానికి అలవాటు పడటం, సహజీవనం అన్న సంస్కృతి పెచ్చు విూరడంలాంటి పరిస్థితులు కూడా యువతకు పెళ్లి విూద శ్రద్ధ లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల విూద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల దేశంలో పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం(మినిస్ట్రీ ఆఫ్‌? స్టాటిస్టిక్స్‌? అండ్‌ ?ప్రోగ్రామ్‌? ఇంప్లిమెంటేషన్‌) ఇటీవల జారీ చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. ‘జాతీయ యువజన విధానం?2014’ ప్రకారం 15 నుంచి 29 ఏండ్ల వయసు వారిలో పెండ్లి కాని వారు17 శాతం ఉంటే, 2019 నాటికి 23 శాతానికి పెరిగారు. ఇదే సమయంలో వివాహం కాని పురుషుల సంఖ్య 20.8 నుంచి 26.1 శాతానికి, పెండ్లి కాని యువతుల సంఖ్య 13 నుంచి19 శాతానికి పెరిగింది. పెండ్లి కాని యువకుల సంఖ్య దేశంలో జమ్మూ కాశ్మీర్‌?లో ఎక్కువ ఉన్నట్లు కేంద్రం తాజా రిపోర్టులో పేర్కొంది.18 ఏళ్లు వచ్చినా, ఆ తర్వాత కూడా అమ్మాయికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలనే ఆసక్తిని ప్రోత్సహిస్తారు. అవసరమైతే పెళ్లి వాయిదా వేస్తామన్నా అభ్యంతరం తెలపడం లేదు. అమ్మాయికి పాతికేళ్లు వచ్చిన వివాహం గురించి అస్సలు ఆలోచించడమే లేదు.ఇప్పటికీ అక్కడక్కడా బాల్య వివాహాలు, యువతులు ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు, అయితే వివాహ వయస్సుపై భారతదేశ రిజిస్ట్రార్‌ జనరల్‌ కార్యాలయం నిర్వహించిన జాతీయ నమూనా సర్వేలో, మహిళల సగటు వివాహ వయస్సు దేశం 22.7 సంవత్సరాలుగా వెల్లడైంది. ఈ సర్వే 2020లో జరిగినప్పటికీ, వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను కార్యాలయం తాజాగా విడుదల చేసింది. జాతీయ సగటు కంటే తెలంగాణ మెరుగైన స్థానంలో ఉందని తేలింది. సర్వే గణాంకాలను పరిశీలిస్తే, 2017 నాటికి దేశంలో మహిళల సగటు వివాహ వయస్సు 22.1 సంవత్సరాలు. 2020 నాటికి అది 22.7 సంవత్సరాలకు చేరుకుంది. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అనుసరించి ఆడపిల్లల వివాహ వయస్సు ముడిపడి ఉన్నందున వివిధ రాష్ట్రాల మధ్య సగటు వయస్సులో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. వివాహ సగటు వయసుకు సంబంధించి తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 2020 నాటికి 24.3 ఏళ్లు, గ్రావిూణ ప్రాంతాల్లో 22.8 ఏళ్లుగా తేలింది.ఈ పరిణామాల క్రమంలో దేశంలో అమ్మాయిల సగటు పెళ్లి వయసు పెరిగిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. 2017 వివరాల ప్రకారం ఉన్న 22.1 ఏళ్ల సగటు కాస్త బెటరైంది. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపిన జాతీయ నమూనా సర్వేలో దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏళ్లుగా వెల్లడైంది. 2020లో ఈ సర్వే జరిగినప్పటికీ వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను ఆ కార్యాలయం ఇటీవల విడుదల చేసింది. అత్యధికంగా 26 ఏళ్లకు కశ్మీరీ యువతులకు పెళ్లిళ్లు జరుగుతుంటే, అత్యల్పంగా 21 ఏళ్లలోపే జార్ఖండ్‌, బెంగాల్‌ అమ్మాయిలు మ్యారేజీ చేసుకుంటున్నట్టు తేలింది.దేశంలో మహిళలకు చట్టబద్ధమైన కనీస వివాహ వయస్సును పురుషులకు ప్రస్తుతం ఉన్న 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఇది ప్రస్తుతం పార్లమెంటరీ స్టాండిరగ్‌ కమిటీ పరిశీలనలో ఉంది. అయితే దేశంలో కనీస వివాహ వయస్సును మార్చాలంటే కేంద్రం 6 చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ది ఇండియన్‌ క్రిస్టియన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌`1872, ది పార్సీ మ్యారేజ్‌ అండ్‌ డైవోర్స్‌ యాక్ట్‌`1936, ది ముస్లిం పర్సనల్‌ లా (షరియత్‌) అప్లికేషన్‌ యాక్ట్‌`1937, ది స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌`1954, ది హిందూ మ్యారేజ్‌ యాక్ట్‌`1955, ది ఫారిన్‌ మ్యారేజ్‌ యాక్ట్‌`1969 సవరించాల్సి ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *