రెండు ప్రతిపక్ష పార్టీల నిరుద్యోగ చిచ్చు

తెలంగాణలో నిరుద్యోగ సమస్య రెండు ప్రతిపక్ష పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. అప్పటి వరకు రాజకీయ వైరుధ్యం కాని, వ్యక్తిగత వైరం కానీ లేని ఆ పార్టీల నేతలు ఒకే ఒక్క సంఘటనతో బద్ధ శత్రువులుగా మరారు. పరస్పర విమర్శలు చేసుకున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పై ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి పోరాడాలని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇటీవల పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడారామె. నిరుద్యోగ సమస్య పై పోరాటంలో రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ తనతో కలిసి రావాలని బహిరంగ లేఖలు రాశారు. అనంతరం టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులను వారి కార్యాలయాల్లో కలిసి చర్చించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాలకు మనుగడ లేకుండా చేసేందుకు తెలంగాణ సర్కార్‌ పోలీసులను ప్రయోగిస్తోందని, కేసీఆర్‌ ను అడ్డుకోవాలంటే టి సేవ్‌ వేదికగా ప్రతిపక్షాలు ఒక్కటై తీరాలని అన్నారు షర్మిల. ఆమె విపక్ష నేతల్ని కలిసిన సందర్భంలోనే కొత్త వివాదం ఒకటి తెరవిూదికి వచ్చింది.ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని, అధికార పక్షం ప్రతిపక్షాలను విమర్శించడం సాధారణం. ప్రతిపక్ష పార్టీలు కూడా సిద్ధాంత వైరుధ్యాల కారణంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారు. కానీ ఒక రాజకీయ పార్టీ ఆఫీస్‌కి వెళ్ళి నేరుగా అక్కడే? ఆ పార్టీ పెద్దనే విమర్శించడం.. అదే పెద్దతో తిరిగి తిట్టించు కోవడం మాత్రం ఎక్కడా జరగదు. కానీ? ఈ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు షర్మిల.సీపీఎం ఆఫీస్‌కు వెళ్ళి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శినే విమర్శించి వచ్చారు. దాని విూదే ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. వేళ్ళ విూద లెక్కపెట్టేంత రాజకీయ అనుభవం కూడా లేని వారు దశాబ్దాల అనుభవం ఉన్న వారిని విమర్శించడం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం అని దుమ్మెత్తి పోస్తున్నారట లెఫ్ట్‌ నేతలు. పార్టీ కార్యాలయానికి వెళ్లి? వచ్చిన విషయం, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల విూద మాట్లాడకుండా విధానాలను వేలెత్తి చూపడం ఏంటని మిగతా రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నాయి. వైఎస్సార్‌ టీపీ వ్యవహార శైలి గురువింద గింజ సామెతను గుర్తు చేస్తోందంటున్నాయి.కానీ షర్మిల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో వాగ్వాదానికి దిగడం వెనుక అసలు కారణం వేరే ఉందట. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వైఎస్‌ షర్మిల తన పాదయాత్ర సందర్భంగా ప్రకటించారు. అంతకు ముందు పలు సభల్లో అదే మాట చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో పార్టీ క్యాంపు కార్యాలయాన్ని కూడా నిర్మించుకుంటున్నారామె. అయితే తాజాగా వామపక్షాలు రాబోయే ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీ చేస్తాయో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. సీపీఐ కొత్తగూడెం స్థానంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో, సీపీఎం పాలేరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. కాలానుగుణంగా బీఆర్‌ఎస్‌ తో పొత్తు పెట్టుకోవాలా? లేదా? అనే అంశాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పార్టీ అగ్ర నాయకులు. కాగా పాలేరు నియోజకవర్గంలో తమ్మినేని వీరభద్రంకు గట్టి పట్టుంది. ఒకవేళ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే తమ్మినేని విజయం సాధించడం ఖాయమన్నది లోకల్‌ టాక్‌. అయితే పాలేరు నుంచే షర్మిల కూడా పోటీ చేయనున్నట్లు ముందే ప్రకటించడంతో ఇద్దరు ప్రత్యర్థులుగా భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.ఎన్నికల కంటే ముందే సీపీఎంను ప్రజల ముందు ఎండగట్టాలని భావిస్తున్నారట షర్మిల. అందుకే కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విూడియా ముందే సీపీఎం వైఖరిని తప్పుపట్టారట. ఈ సంఘటనతో షర్మిల దుందుడుకు స్వభావం, కమ్యూనిస్టు పార్టీల విషయంలో అవగాహనా రాహిత్యం, అధికార పార్టీ విూద ఏహ్య భావం మాత్రమే కనిపించాయి కానీ.. రాజకీయ పరిపక్వత కనిపించలేదంటున్నారట పరిశీలకులు. ఆమెలో ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోరాటాలు చేసే మనస్తత్వం కనిపించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనతో పాలేరు నియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా తమ్మినేని, షర్మిల కనిపిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *