దీదీ గుండెల్లో పార్దా టెన్షన్‌

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌. రాజకీయ పోరాటాలకు పెట్టింది పేరు.అన్నిటినీ మించి,కేంద్ర ప్రభుత్వంపై కాలు దువ్వే విషయంలో ఆమె అందరికంటే ముందుంటారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీని, డోంట్‌ కేర్‌ పద్దతిలో దూషించడంలో అయినా, దుర్భాషలాడడంలో కేసీఆర్‌ అయినా కేజ్రీవాల్‌ అయినా ఆమె తర్వాతనే. చివరకు అల్‌ పవర్ఫుల్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా, (వ్యంగ్యంగానే అయినా) వామ్మో .. మమత అన్నారంటే ఆమె ఎంత పవర్ఫుల్‌ లీడరో అర్థం చేసుకోవచ్చును. అలాగే, ఆమె ఎవరికీ భయపడరు. భయం అంటే ఏమిటో ఆమెకు తెలియదని అంటారు. అది నిజమే కావచ్చును. కానీ, అంతటి మమత బెనర్జీ కూడా ఇప్పుడు భయపడుతున్నారా, అంటే, మంత్రి పార్థా ఛటర్జీ అరెస్టు విషయంలో ఆమె స్పందించిన తీరు చూస్తే, నిజంగానే ఆమె భయపడుతున్నారని అనుకోవలసి వస్తోందని అంటున్నారు. ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన కుంభకోణంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటుగా ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీని కూడా అరెస్ట్‌ చేశారు. ఆమె నివాసంలోనే, ఈడీ నోట్ల కట్టలు కాదు కరెన్సీ కుప్పలు స్వాధీనం చేసుకుంది. నోట్ల కట్టలు అలా కుప్పలు పోయడం చూసిన జనం, ముక్కున వేలేసుకుంటున్నారు.అదలా ఉంచితే, మంత్రి పార్థా ఛటర్జీని అరెస్ట్‌ తర్వాత మమతా బెనెర్జీ పూర్తిగా రెండు రోజులు పెదవి విప్పలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. అరెస్ట్‌ అయిన మంత్రి నాలుగు సార్లు ఫోన్‌ చేసినా, రిప్లై అయినా ఇవ్వలేదు. అంటే, ఆ కుంభ కోణం తన మెడకు చుట్టుకుంటుందనే భయమేదో ఆమెను వెంటాడుతోడని అనుకోవచ్చును.అంతే కాదు, మంత్రి అరెస్ట్‌ పై రెండు రోజుల ఆలస్యంగా స్పందించినా, అందులోమ ఢీ అంటే ఢీ అనే దీదీ కనిపించలేదని అంటున్నారు. గతంలో డీజీపీ కార్యాలయంలో సోదాలు చేసేందుకు వెళ్ళిన సిబిఐ అధికారుల పై మమత బెజేర్జీ విరుచు పడ్డారు. స్వయంగా రోడ్డెక్కి నిరసన తెలిపారు. కానీ మంత్రి పార్థా ఛటర్జీ విషయంలో మాత్రం, రోడ్‌ షో లు లేవు సరికదా, తప్పులు చేసేవారికి, అవినీతికి పాల్పడేవారికి తాను ఎప్పుడూ మద్దతు పలకనని అన్నారు, తప్పుచేసినవారు ఎలాంటివారైనా, వారు తప్పుచేసినట్లు నిరూపితమైనా, యావజ్జీవ శిక్ష పడినా తాను ఏవిూ అనుకోనన్నారు. ఇటువంటి అవినీతి వ్యవహరాల్లోకి తనను లాగొద్దని.. ఎందుకంటే తాను ప్రభుత్వం నుంచి వచ్చే వేతనం కూడా తీసుకోవడంలేదని తెలిపారు. అంటే, మమత బెనర్జీ భయపడుతున్నారు అనుకుంటే తప్పులేదని అంటున్నారు. ఈ కేసులో మంత్రి ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేయడంతోపాటు ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. సోదాల్లో మంత్రికి మరిన్ని అక్రమాస్తులన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరితోపాటు మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సుకాంత ఆచార్యను కూడా అరెస్ట్‌ చేశారు. 2014`2021 మధ్యలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన పార్థా విూద ఆరోపణలు రావడంతో సుదీర్ఘంగా 26 గంటలపాటు ఆయన్ను విచారించిన ఈడీ తమ అదుపులోకి తీసుకుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *