తెలంగాణలో డీకే ఆపరేషన్‌

తెలంగాణలో రాజకీయ సవిూకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ ఆపరేషన్‌ తెలంగాణ ప్రారంభించింది. కొత్త పాత్తుల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వైఎస్సార్‌ కుమార్తె షర్మిలతో మంతనాలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రియాంక గాంధీ ` షర్మిల మధ్య ఫోన్‌ లో మంతనాలు జరిగాయని తెలుస్తోంది. ఇప్పుడు వైఎస్‌ కుటుంబానికి సన్నిహితుడైన డీకే శివకుమార్‌ రంగంలో కి దిగారు. షర్మిలను ఒప్పించే ప్రయత్నాలు జరుగున్నాయి. ఇదే సమయంలో రేవంత్‌ కు పార్టీ ట్విస్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ పై కాంగ్రెస్‌ గురి:ఈ సారి ఎలాగైనా తెలంగాణలోకి అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్‌ లక్ష్యం. ఇందుకోసం పార్టీ వీడిన నేతలను తిరిగి రావాలంటూ రాయబారాలు మొదలయ్యాయి. ఎవరైతే రేవంత్‌ కారణంగా తాము పార్టీ వీడామని చెబుతున్నారో..వారి విషయంలో హైకమాండ్‌ పూర్తి భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏ వ్యవహారమైన పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచిస్తున్నారు. పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని హావిూ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జూపల్లి వచ్చే వారం కాంగ్రెస్‌ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్‌ లో నుంచి బీజేపీ లోచేరిన నేతలతోనూ చర్చలు మొదలయ్యాయి ఇక, తెలంగాణలో భావసారూప్య పార్టీలతో కలిసి వెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. అందులో భాగంగా షర్మిలతో మంతనాలు ప్రారంభించిందితెలంగాణలో బీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా షర్మిల పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్‌ ఇమేజ్‌ ను సొంతం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమైన రెడ్డి, ఎస్సీ ఓట్‌ బ్యాంక్‌ షర్మిల చీల్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో రేవంత్‌ సైతం రెడ్డి వర్గం ఓట్‌ బ్యాంక్‌ పైన ఫోకస్‌ చేసారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతగా ఆయన గురించి ప్రస్తావన చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు షర్మిలను తమ వైపు తిప్పుకుంటే తెలంగాణతో పాటుగా భవిష్యత్‌ లో ఏపీలోనూ కలిసి వస్తుందని కాంగ్రెస్‌ అధినాయకత్వం అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ను రంగంలోకి దింపింది. ఇప్పటికే రెండు సార్లు షర్మిలతో డీకే శివకుమార్‌ చర్చలు చేసారు. రేవంత్‌ అభ్యంతరాలు:షర్మిల సైతం ఢల్లీి నుంచి మిస్డ్‌ కాల్స్‌ వస్తున్నాయంటూ పరోక్షంగా పొత్తు చర్చలను ప్రస్తావించారు. ఇప్పుడు డీకేతో సమావేశం గురించి వీడియో ప్రత్యేకంగా డీకే కార్యాలయం విడుదల చేయటం కూడా షర్మిలతో పొత్తు ఖరారు సంకేతాలను స్పష్టం చేస్తోందనే అభిప్రాయం ఉంది. కానీ, షర్మిలతో పొత్తును రేవంత్‌ వ్యతిరేకిస్తున్నారు. షర్మిలతో పొత్తు పెట్టుకుంటే బీఆర్‌ఎస్‌ కు అస్త్రంగా మారుతోందని వాదిస్తున్నారు. రాష్ట్రం లో షర్మిల ప్రభావం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, షర్మిల తో పొత్తు విషయంలో రేవంత్‌ కు పార్టీ ట్విస్ట్‌ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రేవంత్‌ అభిప్రాయం కంటే డీకే రోడ్‌ మ్యాప్‌ కే పార్టీ హైకమాండ్‌ ప్రాధాన్యత ఇస్తోంది. ఫలితంగా త్వరలోనే కాంగ్రెస్‌ ` షర్మిల పొత్తు అంశం పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *