కైరోలో 11వ శతాబ్దపు చారిత్రక కట్టడాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమో ఈజిప్టులో పర్యటిస్తున్నారు. కైరోలోని 11 శతాబ్ధపు నాటి చారిత్రక కట్టడం అల్ అఖీమ్ మసీదును ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. కాగా మూడు నెలల క్రితమే భారత దేశానికి చెందిన దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో ఈ మసీదును పునరుద్ధరించారు. ప్రధాని మోదీ మసీదును కలియ తిరుగుతూ సందర్శించారు. ఈ మసీదును 1012లో నిర్మించారు. వెయ్యేండ్ల చరిత్రగల ఈ మసీదు గోడలపై చెక్కిన శాసనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు.

కాగా..గుజరాత్‌లోని చాలా యేండ్లుగా ఉంటున్న బొహ్రా కమ్యూనిటీతో ప్రధాని మోదీ సన్నిహిత సంబంధాలున్నాయి. మోదీ ఈ మసీదు సందర్శనకు ఇది కూడా ఓ ముఖ్యకారణం. ఈ మసీదు బొహ్రా కమ్యూనిటీకి ఓ ముఖ్యమైన సందర్శన స్థలం.దావూదీ బొహ్రా ముస్లింలు.. ఇస్మాయిలీ తయ్యిబి విధానాన్ని అనుసరించే ఇస్లాం అనుచరుల విభాగం. ప్రధాని కాకముందు నుంచే మోదీకి బొహ్రా ముస్లింలతో ప్రత్యేక అనుబంధం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *