ట్విట్టర్‌ కు పోటీగా ధ్రెడ్‌…

న్యూయార్క్‌, జూలై 7
ట్విట్టర్‌ కు పోటీగా మెటా నుండి థ్రెడ్స్‌ అంటూ సరికొత్త యాప్‌ వచ్చింది. ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌ ను ప్రారంభించిన నాలుగు గంటల్లోనే 5 మిలియన్ల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. థ్రెడ్స్‌ యాప్‌ ను చూస్తే ఇంతకు ముందు ఎక్కడో చూశాం అనే భావన మనకు కలుగుతుంది. వాడితే.. ఇంతకు ముందు వాడాము అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది దాదాపు ట్విట్టర్‌ ను పోలి ఉంది. థ్రెడ్స్‌లో వెబ్‌ లింక్‌లు, ఫొటోలు, వీడియోలను, 500 వరకు వర్డ్స్‌ను పోస్ట్‌ చేయవచ్చు. థ్రెడ్స్‌ ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే విూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వెరిఫైడ్‌ అయి ఉంటే థ్రెడ్స్‌ యాప్‌లోనూ అకౌంట్‌ ఆటోమేటిక్‌గా ధ్రువీకరించబడుతుంది. యాప్‌ను యాపిల్‌ స్టోర్‌ నుంచి సైతం ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. థ్రెడ్స్‌ యాప్‌లో ఇన్‌ స్టాగ్రామ్‌ ఐడీతో లాగిన్‌ చేసుకోవచ్చు. థ్రెడ్స్‌ ట్విట్టర్‌ లాగే టెక్స్ట్‌ ఆధారిత సోషల్‌ విూడియా యాప్‌. ప్రస్తుతం ట్విట్టర్‌ను ఉపయోగిస్తున్న వారికి థ్రెడ్స్‌ను వాడడంలో పెద్దగా సమస్యలుండవని అంటున్నారు. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్‌తో సహా 100 కంటే ఎక్కువ దేశాల్లో ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. థ్రెడ్‌స్‌ యాప్‌ కోసం డీ సెంట్రలైజ్డ్‌ సోషల్‌ విూడియా ప్రోటోకాల్‌ సంస్థ యాక్టివిటీ పబ్‌తో మెటా చేతులు కలిపింది. ఈ సంస్థ వెబ్‌ సర్వర్‌లకు వెబ్‌బ్రౌజర్‌లు యాప్‌ ఇంటర్‌ ఫేస్‌కు అనుసంధానం చేసేలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. జుకర్‌బర్గ్‌ సారధ్యంలోని మెటా సెలెక్టెడ్‌ సెలబ్రిటీలు, క్రియేటర్లు, సోషల్‌ విూడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లతో ప్రయోగాత్మకంగా ఈ యాప్‌ను కొన్ని నెలలుగా పరీక్షించినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *