తెలంగాణను వణికిస్తున్న వైరల్‌ ఫీవర్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 30
లంగాణలో డెంగ్యూ, ఇతర వైరల్‌ ఫీవర్స్‌ టెన్షన్‌ పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నగరాన్ని వైరల్‌ ఫీవర్స్‌ వణికిస్తున్నాయి. సీజనల్‌ వ్యాధుల కాలం కావడంతో డెంగ్యూ దోమలు మరింత ఎక్కువగా వ్యాప్తి చెంది జనాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఒళ్లు నొప్పులు, జ్వరంతో జనాలు అల్లాడిపోతున్నారు. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే వైరల్‌ ఫీవర్‌ అని రిపోర్ట్‌ వస్తోంది. రాష్ట్రంలోని డెంగ్యూ కేసుల్లో 40శాతం హైదరాబాద్‌లో నమోదవుతున్నాయి. దీంతో బెంబేలెత్తిపోతున్నారు సిటీ జనాలు.క్లీన్‌ హైదరాబాద్‌ పేరుతో ఉఊఓఅ ఎన్ని చర్యలు చేపట్టినా.. దోమలు నివారణ మాత్రం కష్టతరంగా మారుతుంది. జనాలపై దండయాత్ర చేసి.. రక్తం పీల్చి అనారోగ్యం పాలు చేస్తున్నాయి. ఇతర అనారోగ్య సమమ్యలు ఉంటే ఒక్కోసారి డెంగ్యూ లేదా ఇతర వైరల్‌ ఫీవర్స్‌ కారణంగా ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. సీటీలో పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంటుంది. చాలా చోట్ల నిత్యం డ్రైనేజ్‌లు లీకవుతూ ఉంటాయి. ఇక కుంటలు.. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్స్‌ ఇలా 30వేలకు పైగా డెంగ్యూ డేంజర్‌ పాయింట్లు ఉన్నాయి. ఇవన్నీ కేవలం స్లమ్‌ ఏరియాలే కాదు.. బంజారా హిల్స్‌, జూబ్లీ హిల్స్‌ లాంటి ఖరీదైన ప్రాంతాల్లోనూ ఉన్నాయి. లార్వాను గుర్తించడంలో ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా ఆ ప్రాంతంలో ప్రజలు వైరల్‌ ఫీవర్స్‌ బారిన పడే అవకాశం ఉంది. డెంగ్యూకు కారణమైన ఒక్కో టైగర్‌ దోమ వేల సంఖ్యలో లార్వాను ప్రొడ్యూస్‌ చేస్తోంది.డెంగ్యూకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్‌ లేదు. జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. విపరీతంగా నీరసం ఉంటుంది. కొన్నిసార్లు ప్లేట్‌లెట్స్‌ సంఖ్య కూడా విపరీతంగా పడిపోతుంది. కాలానుగునంగా వచ్చే వ్యాధులే అయినప్పటికీ చాలా ప్రమాదకర వ్యాధులు. దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వాతావరణ మార్పులతో జనాలు రోగాల బారిన పడుతుంటే వానాకాలం ప్రభావంతో దోమల బెడద కూడా పెరిగింది. వర్షాల తీవ్రత పెరిగితే దోమకాటుతో మలేరియా లాంటి జ్వారాలు జనాల్ని పట్టిపీడిరచే అవకాశాలు ఉన్నాయి. వాటి నివారణకు అధికారులు పర్‌ఫెక్ట్‌ యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *