రాజస్థాన్‌ లో 30 ఏళ్ల ఆనవాయితీయే

జైపూర్‌, డిసెంబర్‌ 4
రాజస్తాన్‌ విషయానికొస్తే ఇక్కడ గడిచిన 30 ఏళ్లుగా అట్టు తిరగేసినట్లు ప్రజలు తీర్పు ఇస్తున్నారు. అంటే ఐదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూడొచ్చు. ఐదేళ్లకంటే ఎక్కువ కాలం ఏ పార్టీ అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అశోక్‌ గెహ్లాట్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో తాము ప్రవేశపెట్టిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ముప్పైఏళ్ల ఆనవాయితీకి గండికొట్టి మరోసారి కాంగ్రెస్‌ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు.కానీ వీటన్నింటికీ తెరదించుతూ ప్రజలు బీజేపీకే పట్టం గట్టినట్లు తెలుస్తోంది. ఉదయం కౌంటింగ్‌ ప్రారంభమైన మొదటి రౌండు మినహా కాంగ్రెస్‌ ఎక్కడా ఆధిక్యంలో కనిపించడం లేదు. ఇప్పటికీ బీజేపీ 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు కూడా తమ ప్రాభవాన్ని చూపిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ విజయం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు అన్ని రౌండ్లు పూర్తౌెనట్లు కనిపిస్తోంది. మిగిలిన రౌండ్లలో కాంగ్రెస్‌ ఆధిపత్యం చేపించినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.బీజేపీకి విజయం దాదాఫు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న ఆధిక్యంలో నుంచి బీజేపీ కొంత తగ్గినా మ్యాజిక్‌ ఫిగర్‌ 101 ఎప్పుడో దాటేసింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో తమ గెలుపుపై ఎలాంటి భయంలేకుండా సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా స్పందిస్తూ మోదీ హవా రాజస్తాన్‌లో కొనసాగుతుందని చెప్పారు. ఒకవేళ అంతటి క్లిష్ఠమైన పరిస్థితులే తలెత్తితే ఇతరుల నుంచి గెలిచిన ఇండిపెండెంట్లను తమ పార్టీలోకి ఆహ్వానించి ప్రభుత్వాన్ని సులభంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోగలిగింది. దీని ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుందని చెప్పక తప్పదు.
రాజస్థాన్‌ సీఎం రేసులో జైపూర్‌ యువరాణి
మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 115 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌ కేవలం 67 స్థానాలకే పరిమితమైంది. ఇక రాజస్థాన్‌లోని విద్యాధర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి, రాజ్‌సమంద్‌ పార్లమెంటు సభ్యురాలు దియా కుమారి ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి సీతారాం అగర్వాల్‌పై ఏకంగా 71,368 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మాట్లాడిన దియా కుమారి రాజస్థాన్‌తో సహా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజనే కారణమన్నారు. ‘మోదీ మాయాజాలం’ ఈ రాష్ట్రాల్లో బాగా ప్రతిధ్వనించిందని, కాషాయ పార్టీని అధికారం వైపు మళ్లించిందని ఆమె ఉద్ఘాటించారు. ‘ఈ విజయం క్రెడిట్‌ ప్రధాని మోడీ, అమిత్‌ షా జీ, ఏఖ నడ్డా జీ, రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలందరికీ చెందుతుంది. రాజస్థాన్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కూడా మోడీ జీ మ్యాజిక్‌ బాగా పనిచేసింది. రాష్ట్రంలో సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తాం.. రాష్ట్రంలో ఇప్పుడు శాంతిభద్రతలు కనిపిస్తాయి. సీఎం ఎవరనేది పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయిస్తుంది’ అని దియా కుమారి తెలిపారు.రాజస్థాన్‌ ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం వసుంధర రాజేతో పాట జైపూర్‌ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి పేరు కూడా బాగా వినిపిస్తోంది. జైపూర్‌ను పాలించిన ఆఖరి మహరాజు మాన్‌ సింగ్‌ ఎఎ మనవరాలైన దియాకుమారి ఢల్లీి, ముంబై, జైపూర్‌లో విద్యాభ్యాసం చేశారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఆమె ఫైన్‌ ఆర్ట్స్‌ చదివారు. గ్రాడ్యుయేట్‌ డిప్లామా పూర్తి చేశారు. ఫిలాసఫీలో ఆమె డాక్టరేట్‌ అందుకున్నారు. 2013లో బీజేపీలో చేరిన దియా కుమారి.. అదే ఏడాది సవాయ్‌ మాధోపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 సాధారణ ఎన్నికల్లో రాజ్సామండ్‌ నుంచి ఎంపీగా పోటీచేసిన దియాకుమారి సుమారు ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు ఎంపీగా కొనసాగుతూనే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఘన విజయం సాధించి ఏకంగా ముఖ్యమంత్రి రేసులో నిలిచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *