జాతీయపార్టీ ఏర్పాటు దిశగా అడుగులు

దేశంలో మరో జాతీయపార్టీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కాంగ్రెస్‌ రోజురోజుకు క్షిణించడం, ప్రత్యామ్నాయంగా ఏపార్టీ బలపడకపోతుండంతో.. పొలిటికల్‌ స్పేష్‌ ని ఉపయోగించుకునేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కూడా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వేగంగా ఆదిశగా అడుగులు వేయలేకపోతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ మినహిస్తే దేశ వ్యాప్తంగా ప్రజలకు నోటెడ్‌ అయిన నాయకులు సంఖ్య పరిమితంగానే ఉంది. దీంతో కాంగ్రెస్‌ లో సుదీర్ఘకాలం పనిచేసి, గతంలో కేంద్రమంత్రిగా సేవలందించడంతో పాటు.. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొంది.. ఇటీవలే హస్తం పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్‌ జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. తన మనసులోని మాటను ఆయన ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తన వ్యూహంతో పాటు.. భవిష్యత్తులో తాను ఏం చేయబోతున్నాను అనేదానిపై గులాంనబీ ఆజాద్‌ క్లారిటీ ఇచ్చారు. మరోసారి కాంగ్రెస్‌ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విూనింగ్‌ లెస్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాహుల్‌ గాంధీ తీరుపై మరోసారి మండిపడ్డారు గులాంనబీ ఆజాద్‌. రాజీవ్‌ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీల పనితీరుతో రాహుల్‌ గాంధీకి ఎటువంటి పోలిక లేదన్నారు. తాను పార్టీలో ఉండటం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌ నాయకులకు ఇష్టం లేదని.. తాను పార్టీ విడిచి వెళ్లిపోవాలని వారు కోరుకున్నారని చెప్పారు. దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని.. తాను భవిష్యత్తులో ఓ పార్టీని ఏర్పాటుచేసి.. జాతీయ స్థాయిలో విస్తరిస్తానని గులాం నబీ ఆజాద్‌ తన భవిష్యత్తు వ్యూహాన్ని వెల్లడిరచారు. జాతీయపార్టీ ఏర్పాటుకు అవసరమైన వనరులను సమకూర్చుకోవాలని.. దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. తాను కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే వీడానని, పార్టీ మూల సిద్ధాంతాన్ని కాదని స్పష్టం చేశారు. మనిషి పేరు మార్చుకున్నంత మాత్రన.. రక్తం, రూపు రేఖలు మారవు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జమ్మూ కశ్మీర్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను ప్రారంభించే జాతీయపార్టీ కార్యకలాపాలు మొదట జమ్ము కశ్మీర్‌ లోనే మొదలవుతాయన్నారు. జమ్మూ కశ్మీర్‌ లో ఎన్నికలొస్తే ప్రచారంలో పాల్గొంటానని చెప్పడంతో వీలైనంత త్వరగా ఆయన పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో తనకు 8 రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తే 7 రాష్ట్రాల్లో గెలిచామని.. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ నాయకత్వంలో అన్ని ఓటములే అంటూ ఘాటూగా స్పందిచారు. తాను పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ బలోపేతానికి సీనియర్లతో మాట్లాడాలని ఎన్నోసార్లు రాహుల్‌ గాంధీకి సూచించానని.. తన మాటలను రాహుల్‌ గాంధీ లెక్క చేయలేదన్నారు. సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమని, ఆమె తనకు ఎంతో గౌరవం ఇచ్చేవారని, ఆప్యాయంగా ఉండేవారని గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. రాహుల్‌ గాంధీ ఏమి చేస్తున్నారో సోనియాగాంధీ పట్టించుకోలేదని గులాంనబీ ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *