కమలంలో కల్చర్‌ మారుతోందా…

హైదరాబాద్‌, జూలై 8, (న్యూస్‌ పల్స్‌)
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు చర్చనీయాంశంగా మారింది. శభాష్‌ సంజయ్‌ జీ అంటూ కితాబులు ఇచ్చిన హైకమాండ్‌?. ఇలా పక్కనపెట్టడమేంటన్న డిస్కషన్‌ గట్టిగా జరుగుతోంది.
బీజేపీ…. తాము నమ్ముకున్న సిద్ధాంతాల ఆధారంగా పని చేసే పార్టీ..! వ్యక్తులు ముఖ్యం కాదు… వ్యవస్థే ముఖ్యం అని చెప్పే పార్టీ..! వ్యక్తుల కోసం నిర్ణయాలు ఉండవు…. పార్టీ అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని చెబుతుంటారు. సీన్‌ కట్‌ చేస్తే…. తెలంగాణ బీజేపీలోని తాజా రాజకీయ పరిణామాలు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయన్న చర్చ వినిపిస్తోంది. మూడేళ్లుగా అధ్యక్షుడిగా బాధ్యతలు చూస్తున్న సంజయ్‌ ను పక్కనపెట్టడంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. పార్టీలోకి వచ్చిన కొత్త నేతల తీరే…ఈ పరిణామాలకు కారణమైందన్న డిస్కషన్‌ గట్టిగా జరుగుతోందికాంగ్రెస్‌ అంటేనే అసంతృప్తులు, గ్రూప్‌ రాజకీయాలు అంటూ మొన్నటి వరకు మాట్లాడుతూ వచ్చింది బీజేపీ తెలంగాణ. కానీ ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొవాల్సి వచ్చింది. అది కాస్త నాయకత్వ మార్పు వరకు కూడా తీసుకువచ్చిందన్న చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలు కూడా అందుకు బలం చేకూర్చినట్లు అయింది. నిజానికి బీజేపీలో సిద్ధాంతపరంగా పని చేసే వ్యక్తులకు పెద్ద పీట వేస్తుంటారు. సంఫ్‌ు సూచనల మేరకు నిర్ణయాలు ఉంటాయి. కానీ బీజేపీ తెలంగాణ విషయానికొస్తే రివర్స్‌ గా ఉంది. కొత్తగా వచ్చిన నేతలైన ఈటల, రఘనందన్‌, జితేందర్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి వంటి నేతలు అసంతృప్తి రాగాన్ని ఎత్తుకున్నారు. సొంత పార్టీలోని నేతలనే టార్గెట్‌ చేస్తూ… పావులు కదిపారు. వీటన్నింటిని గమనించిన నాయకత్వం….. ఈటల, కోమటిరెడ్డిని ఢల్లీికి పిలిచి మాట్లాడిరది. రాష్ట్రంలోని పరిస్థితులపై ఆరా తీసింది. ఇదే టైంలో… బండి సంజయ్‌ ని పదవి నుంచి తీసివేస్తారన్న ప్రచారం జరిగింది. అలాంటిదేమి ఉండదంటూ కీలక నేతలు చెప్పుకొచ్చారు. కానీ సీన్‌ కట్‌ చేస్తే… కీలకంగా ఉన్న బండి సంజయ్‌ ను పదవి నుంచి తప్పించారు. కిషన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇది కాస్త.. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.నిజానికి వ్యక్తిగత అజెండా. పదవులను ఆశించటం వంటి విషయాలకు బీజేపీలో స్కోప్‌ ఉండదని ఆ పార్టీ నేతలు చాలా మంది చెబుతుంటారు. కానీ తెలంగాణ బీజేపీలోని తాజా పరిణామాలను బట్టి చూస్తే అందుకు భిన్నంగా జరిగిందన్న వాదన వినిపిస్తోంది. అంసతృప్తితో ఉన్న ఈటలకు కీలకమైన ఎన్నికల మేనెజ్‌ మం?ట్‌ కమిటీ బాధ్యతలు ఇవ్వటం, రాజగోపాల్‌ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించటం, బండి సంజయ్‌ ను తొలగించటం వంటి నిర్ణయాలే ఇందుకు ఉదాహరణ అని విశ్లేషకులు అంటున్నారు. తాజా నిర్ణయాల ప్రభావం?. పార్టీపై ఉంటుందని, చాలా వాటికి దారి తీసే అవకాశం ఉందని అభిప్రాయపడుతన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *