‘మూడో కలైంజర్‌ వద్దు… చిన్నవర్‌ చాలు’

నన్ను మూడో కలైంజర్‌, యు అధ్యక్షుడు అని పిలువొద్దని, చిన్నవర్‌ అంటే చాలని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ కార్యకర్తలను విజ్ఞప్తి చేశారు. పుదుకోటలో ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సహాయాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో మాట్లాడిన కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారని, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా ఈ ప్రాంతం రాశి కలిగిన ప్రాంతమని చెబుతుంటారని, కానీ తనకు ఆ నమ్మకం లేదని, కార్యకర్తల శ్రమ వల్లే సాధ్యమని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. తనను మూడో కలైంజర్‌, యువ అధ్యక్షుడు అని పిలువడం మానుకోవాలని, ఎందుకంటే కలైంజర్‌ అంటే ఒక్కరు మాత్రమేనని, ప్రస్తుతం అందరిలో తాను చిన్నవాడిని కావడంతో ‘చిన్నవర్‌’ అని పిలిస్తే చాలని ఉదయనిధి అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *