అకాల వర్షం… అపార నష్టం

రెక్కల కష్టం నీటిపాలవుతుంటే రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చేతికొచ్చిన పంటను చూసుకొని ముసిరిపోయిన రైతును.. వడగాళ్ల వాన కోలుకోలేని దెబ్బ తీసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్‌ పరిధిలో తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. అకాల వర్షంతో విక్రయించేందుకు సిద్దంగా ఉన్న ధాన్యం తడిసిపోయింది. పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిముద్దయింది. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ఆరపోసిన ధాన్యం వర్షార్పణం అవ్వటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.ఆరుగాలం కష్టపడి పండిరచిన పంట చేతికొచ్చే సమయంలో వర్షం తమను కోలుకోలేని దెబ్బ తీసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతలు మొదలు పెట్టినప్పటి నుండి వర్షాలు వెంటాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తీరా పంట చేతికి వచ్చి కొనుగోళ్లు జరుగుతున్న సమయంలో వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని రైతులు బాధపడుతున్నారు. చేతికి వచ్చిన పంట కళ్ళముందే తడిసి పోతుంటే ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నామని అన్నదాతలు కన్నీరు పెట్టకుంటున్నారు. అకాల వర్షాలతో ?తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక మెదక్‌ జిల్లాలో వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వడళ్ల వానకు రైతులు ఆగమాగం అవుతున్నారు. ఆదివారం కూడా మెదక్‌, మర్కుక్‌ మండలాలతో పాటు పాపన్నపేట మండలం రామతీర్థం, ఉద్దాపూర్‌, ఆరెపల్లి,పాపన్నపేట,కుర్తివాడ, కుకునూర్‌పల్లి మండలంమంగోల్‌, కుకునూర్‌పల్లి, బోబ్బయిపల్లి తదితర గ్రామాల్లో భారీ వర్షం పడిరది. ఈదురుగాలుతో రాళ్లు పడడంతో చేతికొచ్చిన వడ్లు పొలంలోనే రాలిపోయాయి.చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వరితో పాటు మక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లోని మామిడి కాయలు నేలరాలాయి. దుబ్బాక పట్టణంలో హబ్సపూర్‌ రోడ్డులో భారీ వృక్షం నేల కూలింది. రాకపోకలు నిలచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని చెట్టును తొలగించే పనులు చేపట్టారు.
శాపంగా మారుతున్న ఆలస్యం
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. వారం, పది రోజుల కిందనే వరి కోతలు మొదలైనా.. చాలాచోట్ల సెంటర్లు ఓపెన్‌ చేయలేదు. దీంతో రైతులు వడ్లను సెంటర్‌ ఏర్పాటు చేసే ప్రదేశాలతో పాటు రోడ్లపై పెద్ద ఎత్తున రాశులు పోసి ఎదురుచూడాల్సి వస్తోంది. కానీ, నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. నిర్వాహకులు టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదని, ఆరుగాలం కష్టం నీటిపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌?లో మెదక్‌ జిల్లాలో 1.98 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా.. 4.43 లక్షల మెట్రిక్‌? టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అగ్రికల్చర్‌ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్‌, ఐకేపీ, మార్కెటింగ్‌? డిపార్ట్‌?మెంట్‌?ల ఆధ్వర్యంలో 402 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రైతులు వరికోతలు మొదలు పెట్టారు. హార్వెస్టర్లతో నూర్పడి చేస్తుండటంతో వెంటవెంటనే కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. అయితే సివిల్‌ సప్లై, మార్కెటింగ్‌ అధికారులు ఇప్పటి వరకు ఐకేపీ ఆధ్వర్యంలో 22, పీఏసీఎస్‌?ఆధ్వర్యంలో 220 కలిపి 236 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఓపెన్‌? చేశారు. ఇందులోనూ చాలాచోట్ల వసతులు లేకపోవడంతో కాంటా పూర్తి స్థాయిలో జరగడంలేదు. ఇప్పటి వరకు 242 మంది రైతుల నుంచి 1843 మెట్రిక్‌? టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలుగా పోసి రైతులు పడిగాపులు గాస్తున్నారు.గత మూడు, నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో దాదాపుగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మార్కెట్‌? యార్డుల్లో, కేంద్రాల వద్ద వడ్లు తడిసిపోయాయి. ఒక రోజు నానిన వడ్లు ఎండేలోపే మళ్లీ వాన పడుతోంది. దీంతో కొల్చారం మండలం నాయిని జలాల్‌?పూర్‌?, అప్పాజిపల్లి, రంగంపేట, చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో వడ్లు నాని మొలకలు వచ్చాయి. తడిసిన వడ్లకు కొంటామని అధికారులు చెబుతున్నా.. పూర్తిస్థాయిలో గైడ్‌లైన్స్‌ రాకపోవడంతో వెనకడుగు వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాళ్లు కొనేలోగా పూర్తిగా మొలకెత్తేలాగా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *