గులాబీ గూటికి సోమేష్‌…

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ వీఆర్‌ఎస్‌కు ఆమోదం లభించింది. ఈ ఏడాది చివరి వరకు పదవీ కాలం ఉన్నా సోమేష్‌ కుమార్‌ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పదవీ విరమణ చేశారు. తెలంగాణ నుంచి రిలీవ్‌ అయిన తర్వాత ఏపీలో విధుల్లో చేరిన సోమేష్‌ కుమార్‌కు తగిన బాధ్యతలు అప్పగించక పోవడంతో స్వచ్ఛంధ పదవీ విరమణకు దరఖాస్తు చేశారు.తెలంగాణ మాజీ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది. విఆర్‌ఎస్‌ కోసం సోమేష్‌ దరఖాస్తుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. సోమేశ్‌ కుమార్‌ త్వరలోనే బీఆర్‌ఎస్‌ లో చేరబోతున్నారని, లేదా ప్రభుత్వ సలహాదారు పదవి పొందే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.బిహార్‌కు చెందిన సోమేశ్‌ కుమార్‌ 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించినా సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ ` క్యాట్‌ ఉత్తర్వులతో తెలంగాణలోనే ఆయన కొనసాగారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు.క్యాట్‌ ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో డీవోపీటీ సవాల్‌ చేసింది. ఈ వ్యవహారంపై విచారణ తర్వాత కొద్ది నెలల క్రితం తెలంగాణ హైకోర్టు ఆయన్ను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసే అవకాశం కూడా లేక పోవడంతో సోమేష్‌ కుమార్‌ ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు.తెలంగాణ నుంచి రిలీవ్‌ అయిన సోమేష్‌కు ఏపీ ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఆమోదముద్ర వేశారు. సోమేశ్‌ దరఖాస్తును తాజాగా డీవోపీటీ అంగీకరించింది. సోమేష్‌ పదవీ విరమణకు అమోదం లభించడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం మొదలైంది.ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఔరంగాబాద్‌ లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభలో సోమేశ్‌ ప్రత్యక్షమవ్వడం ఈ ఊహాగా?నాలకు ఊతం ఇచ్చింది. వేదికపై ఉన్న సోమేష్‌ గురించి కేసీఆర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో సోమేష్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమేని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సోమేశ్‌ను నియమిస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *