అన్ని హంగులతో… సర్వాంగ సుందరం…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్‌ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం దృష్టికి వచ్చింది. తరుచూ పై కప్పు పెచ్చులు ఊడిపడడం, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సమస్యలు తలెత్తడం, అన్ని వసతరులతో క్యాంటీన్‌ ఏర్పాటుకు స్థలం లేమి, పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులతో పాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాత సచివాలయం స్థానంలోనే రాష్ట్ర పాలనకు కేంద్రమైన కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు. నూతన సచివాలయం ఏర్పాటుపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమగ్ర అధ్యయనంచేసి పలు లోపాలను గుర్తించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నివేదిక ఇచ్చింది.అనంతరం నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్‌ 2019 జూన్‌ 27న కొత్త సచివాలయం భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. సచివాలయ నిర్మాణానికి డాక్టర్‌ ఆస్కార్‌, పొన్ని కాన్సెస్సావో అనే ప్రఖ్యాత ఆర్కిటెక్టులు డిజైనర్లుగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్‌ ఆమోదించిన ప్రస్తుత నమూనాతో నూతన సచివాలయం రూపుదిద్దుకున్నది. షాపూర్‌ జీ పల్లోంజి అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సచివాలయన్ని నిర్మించే కాంట్రాక్టును దక్కించుకొని అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టింది
సచివాలయంలో అంతస్తుల వారీగా విభాగాల వివరాలు
గ్రౌండ్‌ ఫ్లోర్‌ : ఎస్సీ మైనార్టీ, లేబర్‌, రెవెన్యూ శాఖలు
1వ అంతస్తు: ఎడ్యుకేషన్‌, పంచాయతీ రాజ్‌, హోంశా
2వ అంతస్తు: ఫైనాన్స్‌, హెల్త్‌, ఎనర్జీ, పశు సంవర్థక శాఖ
3వ అంతస్తు: ఇండస్ట్రియల్‌ అండ్‌ కామర్స్‌ డిపార్ట్‌ మెంట్‌, ప్లానింగ్‌ డిపార్ట్‌ మెంట్‌
4వ అంతస్తు : ఫారెస్ట్‌, కల్చరల్‌ డిపార్ట్‌ మెంట్‌, నీటి పారుదల శాఖ, లా డిపార్ట్‌ మెంట్‌
5వ అంతస్తు: ఆర్‌ అండ్‌ బి, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్తు: సీఎం, సీఎస్‌, సిఎంవో ఉన్నతాధికారులు, పీఆర్వో, సిబ్బంది కార్యాలయాలు
ముఖ్యమంత్రి కార్యాలయం వివరాలు
ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌తో సీఎంకార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్‌ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతో పాటు ముఖ్యమంత్రి విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్‌ హాలును ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్‌ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం దృష్టికి వచ్చింది. తరుచూ పై కప్పు పెచ్చులు ఊడిపడడం, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ సమస్యలు తలెత్తడం, అన్ని వసతరులతో క్యాంటీన్‌ ఏర్పాటుకు స్థలం లేమి, పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులతో పాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాత సచివాలయం స్థానంలోనే రాష్ట్ర పాలనకు కేంద్రమైన కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారు.
సచివాలయం విస్తీర్ణం వివరాలు
మొత్తం భూ విస్తీర్ణం : 28 ఎకరాలు
భవనం నిర్మించిన ఏరియా : 2.45 ఎకరాలు
ల్యాండ్‌ స్కేపింగ్‌ : 7.72 ఎకరాలు
సెంట్రల్‌ కోర్ట్‌ యార్డ్‌ లాన్‌ : 2.2 ఎకరాలు
పార్కింగ్‌ : 560 కార్లు, 700 బైక్‌లు పట్టేంత
యాన్సిలరీ బిల్డింగ్‌ ఏరియా : 67,982 చ.అ.
ప్రధాన భవన కాంప్లెక్స్‌ బిల్టప్‌ ఏరియా : 8,58,530 చ.అ.
లోయర్‌ గ్రౌండ్‌ G గ్రౌండ్‌ G ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు : 14 అడుగులు
అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు
భవనం పొడవు, వెడల్పు : 600 చీ 300
ప్రధాన గుమ్మటాలు (స్కైలాంజ్‌) : 11వ అంతస్థు
కొత్త సచివాలయం 6 ఫ్లోర్లే, కానీ చూడ్డానికి 11 అంతస్తులుగా ` ఎందుకిలా?
పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనలో భాగంగా ఈ కొత్త సెక్రటేరియట్‌ భవన నిర్మాణం జరిగింది. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసి తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ఏప్రిల్‌ నెలాఖరు నాటికి సరిగ్గా 26 నెలల సమయం పూర్తవుతుంది. ఆర్‌ అండ్‌ బి శాఖ ఐజీబీసీ (ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌), టిఎస్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌, రాష్ట్ర పోలీసు విభాగాల సూచనలతో ఎలాంటి లోపం లేకుండా ఈ భవన నిర్మాణం జరిగింది. దేశంలోని చారిత్రక కట్టడాల కన్నా దీనిని ఎక్కువ ఎత్తులో నిర్మించారు. అందులో రెండుసార్లు 45 రోజుల చొప్పున కరోనాతో పనులు ఆగిపోయాయి. అయినా కార్మికులను ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మొదటగా ఈ నిర్మాణం ప్రారంభించినప్పుడు 1500 మందితో ప్రారంభమై చివరకు 4000 మంది కార్మికులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *