కండువా కప్పుకోవటం ఖాయమేనా..

మరికొద్ది నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. ఓ వైపు ప్రజల్లోకి వెళ్తూనే… ప్రత్యర్థులను ఢీకొట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇక గతంలో జరిగిన ఎన్నికల్లో తేలిపోయిన కాంగ్రెస్‌… వచ్చే ఎన్నికలను మాత్రం చావోరేవోగా భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. త్వరలోనే గద్వాల నుంచి రెండో దశ పాదయాత్ర కూడా చేపట్టనున్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ ప్రజలను కోరుతున్నారు. ముఖ్య నేతలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కీలక నేతలను రప్పించే పనిలో పడిరది తెలంగాణ కాంగ్రెస్‌. ఆ దిశగా చర్చలు కూడా జరుపుతోంది.నిజానికి 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్‌ నుంచి చాలా మంది నేతలు వెళ్లిపోయారు. అయితే క్రమంగా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చింది. మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఇదే సమయంలో హైకమాండ్‌ రంగంలోకి దిగటంతో పలు మార్పులను చేపట్టింది. రేవంత్‌ రాకతో దూకుడు పెరిగింది. ప్రస్తుతం పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్తోంది. వరంగల్‌ డిక్లరేషన్‌ తో పాటు పలు హావిూలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇక కీలక నేతలను పార్టీలోకి రప్పించి అధికార బీఆర్‌ఎస్‌ కు గట్టి సవాల్‌ ను విసరాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితో చర్చలు జరుపుతోంది. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లితో కూడా మంతనాలను వేగవంతం చేసింది. ఇక వీరే కాకుండా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డితో చర్చలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండే నేతలను కూడా రంగంలోకి దింపి? ఇబ్బందులు రాకుండా చూసే పనిలో పడిరది రాష్ట్ర నాయకత్వం.నిరుద్యోగులు అంశం, పేపర్‌ లీకేజీలో వాస్తవాలు, ఉద్యోగాల భర్తీపై బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూలపై పోరాటం చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో నిరుద్యోగ నిరసన దీక్షలు నిర్వహించి? మే మొదటి వారంలో హైదరాబాద్‌ వేదికగా భారీ సభను తలపెట్టాలని డిసైడ్‌ అయింది. ఈ సభకు పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీని రప్పించనున్నారు. ఆమె సమక్షంలోనే కీలక నేతలంతా కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే వీరే కాకుండా? మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్‌ లోకి వస్తారన్న టాక్‌ వినిపిస్తోంది.మొత్తంగా మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న వేళ… కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు, ప్రతివ్యూహాలను సిద్ధం చేసే పనిలో పడిరది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో గెలిచే రేసు గుర్రాలపై కూడా ఫోకస్‌ పెట్టే పనిలో పడిరది. ఓవైపు ప్రజల్లో ఉంటూనే… పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టిపెడుతోంది.
కాంగ్రెస్‌ గూటికి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు పెరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు త్వరలో పార్టీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో బీఆర్‌ఎస్‌ నుంచి మరో ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నాగర్‌ కర్నూలుకు చెందిన భారత రాష్ట్ర సమితి సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి పార్టీకి గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు అయన రంగం సిద్ధం చేసుకున్నారు. భారత రాష్ట్ర సమితి తరపున నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి ఉన్నారు. ఆయనతో సరిపడకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించారు. పార్టీ హైకమాండ్‌ కూడా మర్రి జనార్ధన్‌ రెడ్డికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరువురు మద్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరడం అధినాయకత్వం పట్టించుకోకపోవడంతో కలత చెందిన దామోదర్‌ రెడ్డి పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు అయన సన్నిహితులు చెబుతున్నారు.అయితే దామాదర్‌ రెడ్డి చేరిక పట్ల సీనియర్‌ నేత కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు ఆయనను ఒప్పించే బాధ్యతను పార్టీ అగ్ర నేత జానారెడ్డికి అప్పగించినట్లు సమాచారం. గతంలో జానారెడ్డి సమక్షంలోనే ఈ ఇరువురు నేతలు చర్చలు జరపనున్నట్లుగా తెలు?సతోంది. నాగంకు నచ్చజెప్పి దామోదర్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకునేందుకు లైన్‌ క్లియర్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం అనుకున్నట్లుగా జరిగితే మే మొదటి వారంలో ఇక్కడి సరూర్‌ నగర్‌ స్టేడియంలో జరిగే భారీ బహరంగ సభలో దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ సభకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. నాగర్‌ కర్నూలు నియోజక వర్గం లోని తాడూరు మండలానికి చెందిన దామోదర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరక ముందు కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రజా పరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత స్థానిక సంస్థల తరపున శాసనమండలికి ఎంపికై ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తరపున నాగం జనార్ధన్‌ రెడ్డి కీలకంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో ఆయనకు ప్రత్యర్థిగా దామోదర్‌ రెడ్డి ఉండేవారు. ఈ కారణంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేరికను నాగం స్వాగతిస్తే.. సమస్య పరిష్కారమైనట్లే. లేకపోతే ఆయన పార్టీ మార్పు వల్ల బీఆర్‌ఎస్‌ పార్టీలో తగ్గిపోయే వర్గపోరు.. కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *