నొప్పి లేని మరణశిక్షకు అడుగులు

దేశంలో మరణశిక్ష అమలుకు అనుసరిస్తున్న ఉరితీసే విధానాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది. ఈ క్రమంలోనే ఈ విధానాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలపింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకట రమణి సుప్రీం కోర్టుకు వెల్లడిరచారు. అలాగే మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే విధానం సరైనదేనా, ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా అనే అంశాల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు అవసరం అని సుప్రీం కోర్టు సలహా ఇచ్చింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతిపాదిత ప్యానెలలో సభ్యులను ఎంపిక చేసేందుకు కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి విచారణ తేదీని వేసువి సెలవుల తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. నొప్పి, బాధ లేకుండా మరణించే మార్గాలను అన్వేషించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అంగీకరిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని సుప్రీం కోర్టుకుతెలియచేసింది. మరణశిక్ష వేసే సమయంలో ఎలాంటి పద్ధతులను పాటించాలి? అనే దానిపై సరికొత్త మార్గాలను సూచించడం ఆ కమిటీ లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో మరణశిక్షను ఎలా అమలు చేస్తున్నారు? బాధకరమైన పద్ధతులకు భిన్నంగా ఉరిశిక్షను ఎలా అమలు చేయాలి? అనే దానిపై కమిటీ అధ్యయనం చేస్తుంది.మరణశిక్ష పద్ధతులను పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఒక ప్యానెల్‌ ఏర్పాటు చేయనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 జీవించే హక్కుతో పాటు శిక్షించబడిన ఖైదీని గౌరవప్రదంగా ఉరితీసే హక్కు కూడా ఉంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ తక్కువ బాధాకరంగా ఉండేలా మరణశిక్ష వేయాలని పిటిషనర్‌ వాదించారు. భారతదేశంలో మరణశిక్ష అమలు విషయంలో తక్కువ బాధాకరమైన పద్ధతులను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకుతెలిపింది.ఉరి ద్వారా మరణశిక్షనుఅమలు చేయడంలోని లోతుపాతులను తెలుసుకోవడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. నిపుణుల కమిటీ సభ్యులపై ప్రభుత్వం ఆలోచిస్తోందని, వీలైనంత త్వరగా కమిటీని ఏర్పాటు చేస్తామని ఏజీ ధర్మాసనానికి తెలియచేశారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన ధర్మాసనం విచారణను జూలైకి వాయిదా వేసింది.న్యాయవాది రిషి మల్హోత్రా వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్‌ను ఆయన దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు)ని సూచిస్తుందని, శిక్షించబడిన ఖైదీని గౌరవప్రదంగా ఉరితీసే హక్కును కూడా కలిగి ఉందని వాదించించారు. తద్వారా మరణం తక్కువ బాధాకరంగా మారుతుందని తెలిపారు. ప్రస్తుతం 60 దేశాల్లో ఉరి వేసుకుని మరణించే పద్ధతి ప్రబలంగా ఉంది. మరణశిక్ష విధించే ఇతర పద్ధతుల్లో ప్రాణాంతక ఇంజక్షన్‌, ఫైరింగ్‌ స్క్వాడ్‌ లేదా ఎలక్ట్రిక్‌ చైర్‌ ఉన్నాయి. ఉరిని రద్దు చేసి, దానికి బదులుగా విద్యుదాఘాతం, ఫైరింగ్‌ స్క్వాడ్‌ లేదా ప్రాణాంతక ఇంజక్షన్‌తో మరణశిక్షను అమలు చేయడానికి ఇష్టపడే పద్ధతిలో దేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని సుప్రీంకు వివరించారు.గౌరవప్రదంగా చనిపోవడం జీవించే హక్కులో ఒక భాగమని, ప్రస్తుతం అమలులో ఉన్న ఉరితీసే విధానం సుదీర్ఘమైన బాధను కలిగిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది.ఉరిశిక్షను వీలైనంత త్వరగా సరళంగా, ఖైదీకి భయాందోళన లేకుండా ఉండాలని కూడా విజ్ఞప్తి చేసింది.న్యాయవాది రిషి మల్హోత్ర.. మరణశిక్ష అమలులో ఉరితీసే పద్దతికి ఉన్న రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అమెరికాలో ప్రాణాంతకమైన ఇంజక్షన్‌ ద్వారా మరణ శిక్ష అమలు చేస్తుండగా.. మన దేశంలో ఉరిశిక్ష విధానం అనుసరిస్తున్నారు. అయితే దాంతో పోలిస్తే ఉరితీత అనేది చాలా క్రూరమైన, దారుమైన విధానం అని రిషి మల్హోత్ర పిటిషన్‌ లో పేర్కొన్నారు. అయితే దీనిపై ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఉరిశిక్ష అమలుకు మానవీయ పద్ధతుల్లో ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాలను పరిశీలించడానికి మరింత అంతర్లీన సమాచారం అవసరం అని కేంద్రానికి సూచించింది. దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *