ప్రతి ఒక్కరి చిట్టా ఉంది…

ముందుగా పార్టీ సెక్రటరీ జనరల్‌ ఎంపీ కే. కేశవరావు ప్రసంగంతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఇక బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. డ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అన్నారు. అక్టోబర్‌లోనే ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికలకు మరో 4 నెలల టైమే ఉందని అనడంతో సంచలనంగా మారింది. ఇందు కోసం నేతలు ఇంట్లో కాదు.. ప్రజల్లో ఉండాలన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్‌ హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా పార్టీ కోసం కలిసి పని చేయాలని అన్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని.. లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని అన్నారు. అందరూ ఎన్నికలే టార్గెట్‌గా పనిచేయాలని.. ఎలాంటి సమస్య ఉన్న హైకమాండ్‌ దృష్టికి తేవాలని సూచించారు.టికెట్ల పంచాయితీ పై నేతలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయితీ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. నేతలందరూ కలిసి పనిచేసుకోండి ? టికెట్లు ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసన్నారు. టికెట్ల పంచాయితీ మొదలైతే ప్రజల్లో వేరే మెసేజ్‌ వెళ్తదని హెచ్చరించారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజల్లోనే ఉండాలి? ప్రజలతోనే ఉండాలని సూచించారు.టీఆర్‌ఎస్‌ పార్టీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేసిన క్రమాన్ని వివరించారు. భవిష్యత్‌ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగామన్నారు. అదే పంథాలో అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు. అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలని చెప్పారు. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటామన్న ఆయన… మార్క్‌ ఫెడ్‌ కు ఈ మేరకు ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తుందని అన్నారు. ‘‘పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి. క్యాడర్‌ లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టండి.షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తాం. బాగా పనిచేసిన వారికే టికెట్లు ఇస్తాం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలి. విూరు జాగ్రత్తగా ఉండకపోతే విూకే నష్టం. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్‌ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్‌ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం. ఎలక్షన్‌ షుడ్‌ బి నాట్‌ బై చాన్స్‌… బట్‌ బై చాయిస్‌. దూపయినప్పుడు బావి తవ్వుతాం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదు. బీఆర్‌ఎస్‌ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టివి యాడ్స్‌, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చు.అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానల్‌ ను కూడా నడపవచ్చు’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *