దోస్తి..దిశగా అడుగులు

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవల వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు… ప్రతిపక్ష టీడీపీ దూకుడు పెంచింది. అధికార వైసీపీపై ఓ రేంజ్‌ లోనే స్వరం పెంచుతోంది. ఓవైపు లోకేశ్‌ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తుంటే… పార్టీ అధినేత చంద్రబాబు కూడా నేతలతో సవిూక్షలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్‌ ను ఓడిరచాలన్న కసితో ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ కూడా వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. మరోసారి జగనన్న ప్రభుత్వమే అంటూ ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… ప్రతిపక్ష పార్టీలు పక్కగా పావులు కదిపే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ మరోసారి భేటీ అయ్యారు. తాజా రాజాకీయ పరిణామాలపై చర్చించారు. వీరిద్దరి భేటీ కాస్త… టాక్‌ ఆఫ్‌ ది ఆంధ్రాగా మారింది.ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని చెబుతున్న పవన్‌… ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమే అన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా కాస్త సైలెంట్‌ అయిన పవన్‌… బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో కూడా భేటీ అయ్యారు. ఇటీవలే ఢల్లీి వెళ్లి కూడా బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపారు. ఈ పరిణామాలపై పలువురు టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన తమతో కలవకుండా బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకుస్తున్నారంటూ మాట్లాడారు. బీజేపీ ` వైసీపీ ఒకటే అంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై పలువురు బీజేపీ నేతలు స్పందిస్తూ… వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని… రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే తమ లక్ష్యమని చెప్పారు. ఇలా రాజకీయం సాగుతున్న నేపథ్యంలో… టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమమయ్యాయి. సీన్‌ కట్‌ చేస్తే…. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌ వేదికగా చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై గంటరన్నపాటు చర్చించారు. ఫలితంగా మరోసారి టీడీపీ ` జనసేన పొత్తు అంశం చర్చనీయాంశంగా మారింది.పవన్‌ ` చంద్రబాబు భేటీ కావటం మూడోసారి. 2019 ఎన్నికల తర్వాత మొదటి సమావేశం 2022 అక్టోబరు 18న విజయవాడలో జరిగింది. పవన్‌ బస చేసిన హోటల్‌కు వెళ్లిన చంద్రబాబు.. ఆయనతో భేటీ అయ్యారు. జగన్‌ ప్రభుత్వ అరాచకాలపై కలసి పోరాడాలని నిర్ణయించారు. ఉమ్మడిగా విూడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కుప్పంలో చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవడంతో… హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి జనసేన అధినేత పవన్‌ సంఫీుభావం తెలిపారు. 2023 జనవరి 8న వారి భేటీ జరిగింది. ప్రభుత్వం ఉమ్మడి పోరాటం దిశగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. యర్రగొండపాలెంలో చంద్రబాబును అడ్డుకోవటంపై కూడా పవన్‌ ఘాటుగా స్పందించారు. తాజాగా హైదరాబాద్‌ వేదికగా పవన్‌… మరోసారి చంద్రబాబుని కలవటంతో ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందన్న వాదన బలపడుతోంది. వీరి భేటీని బీజేపీ ఎలా చూస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఓవైపు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్న పవన్‌… మరోవైపు చంద్రబాబుతో కూడా మంతనాలు చేస్తున్నారు. ఫలితంగా మూడు పార్టీలు మరోసారి కలిసే అవకాశం ఉంటుందా..? అన్న టాక్‌ వినిపిస్తోంది. దీనిపై ఇప్పుడిప్పుడే నేతల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.ఇక రాబోయే రోజుల్లో చంద్రబాబు ` పవన్‌ మధ్య మరిన్ని భేటీలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *